రంగారెడ్డి

ప్రయాణికుల భద్రతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, నవంబర్ 21: ప్రయాణి కుల భద్రతే లక్ష్యంగా..నేర నిరోధనకు ఆటోలపై నంబరుతో కూడిన స్టిక్కర్ల అతికింపు చర్యలకు షాద్‌నగర్ ట్రాఫిక్ ఎస్‌ఐ రఘుకుమార్ శ్రీకారం చుట్టారు. గురువారం షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో టిటిడి కల్యా ణ మండపం ముందు ఆటోలకు స్టిక్కర్లను అతికించారు. ఇంతకుముందు లేని విధంగా ఆటోల ద్వారా ఏవైనా నేరాలు జరిగే అవకాశాలకు ఆస్కారం లేకుండా ఇక్కడ పదవీ బాధ్యతలు చేపట్టిన ట్రాఫిక్ ఎస్‌ఐ రఘు కుమార్ మొత్తం 370ఆటోలను రిజిష్టరు చేయించారు. అందులో ఈరోజు 120 ఆటోలకు సీవైబీ (సైబరాబాద్)నంబరుతో కూడిన స్టిక్కర్లను అతికించారు. ఆటోలలో ప్రయాణీకులను చేరవేసే సమయంలో అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకే ఈ విధానం పోలీస్ శాఖ అమలులోకి తీసుకువచ్చిందని ట్రాఫిక్ ఎస్‌ఐ తెలిపారు. డిసెంబరు 1వ తేదిలోగా మిగతా ఆటోలు స్టిక్కరును ఏర్పాటు చేసుకోవాలని లేని పక్షంలో జరిమాన విధించబడుతుందని తెలిపారు. ఏదేమైనా షాద్‌నగర్‌లో ట్రాఫిక్ ఎస్‌ఐ చర్యలపట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.