రంగారెడ్డి

ప్రతి ఇంటా.. ప్రకృతి పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 3: ఆరోగ్యవంతంగా ఉండాలంటే కల్తీ లేకుండా నాణ్యమైన ఆహార తీసుకోవాలి. ఇందుకోసం స్వచ్ఛమైన గాలి, నీరు ఎంతో అవసరం. ఇప్పటి వరకు పల్లెల్లో మాత్రమే నాణ్యమైన ప్రకృతి పంటలను పండించడం చూశాము. ప్రస్తుతం పట్టణాల్లో పైగా భవనాలపై మిద్దె తోటల ద్వారా ప్రత్యక్షంగా చూస్తూ ప్రకృతి పంటలను పండిస్తున్నారు. సేంద్రియ ఎరువుల ద్వారా కూరగాయలు, ఆకు కూరలు పండిస్తూ పండ్లు, పూలు, ఔషధ మొక్కలను పెంచుతూ పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ తరహా మిద్దె తోటలు (ఆర్గానిక్ టెర్రీస్ గార్డెన్)కు నగర శివారు బోడుప్పల్ ఆంజనేయనగర్‌లో అపూర్వ స్పందన లభిస్తోంది. కాలనీలో సుమారు 25 ఇండ్లపై తోటలు పెంచుతూ నాణ్యమైన ప్రకృతి పంటలను పండిస్తున్నారు. నివసించే ఇళ్లపై డ్రిప్ ఐరన్ షెడ్‌ను నిర్మించి డ్రమ్ బకెట్స్ ఏర్పాటు చేసి 50 శాతం ఎర్రమట్టి, 25శాతం ఎరువు, 25శాతం కొబ్బరి పొట్టుతో వర్మీ కంపోస్టు సేంద్రియ ఎరువులతో నాటిని పూలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, ఔషధ మొక్కలకు శక్తిని ఇస్తోంది. శ్రమ ఎక్కువయినప్పటికీ ఫలితం అద్భుతమని ఆరోగ్యంగా ఉంటామని విద్యావేత్త రమణా రెడ్డి పేర్కొన్నారు. వేప కాషాయం, ఆవుల పేడతో తయారైన జీవామృతం, అల్లం, వెల్లుల్లి, బెల్లంతో కలిసిన ద్రావణం, పసుపు, నీళ్లు, అప్పుడప్పుడూ కారం నీళ్లు సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తామన్నారు. పండ్లలో దానిమ్మ, జామ, సపోట, డ్రాగన్, స్టార్ ఫ్రూట్, బత్తాయి, అరటి, నిమ్మ, పొప్పడి, మామిడి, అల్లనేరేడు, ఆపిల్స్. అంజీర, రేగు పండ్లు, కిమో థెరపి (లక్ష్మణ ఫలం) వంటి పండ్లను పండిస్తున్నారు. బంతి, పోక బంతి, సూరి బంతి, చామంతి, నూరు వరులు, శంకువులు, వైట్ వాయిలెట్, ఎల్లో, పింక్ కలర్‌లో పోక బంతి, గద్దె చామంతి, కాగడ మల్లె, చవేలి మల్లె, మందార, రోజెన్, కాగితపు పూల మొక్కలను పెంచుతున్నారు. వంకాయ, క్యాబేజీ, కాలిఫ్లవర్, చిక్కుడు, సోరకాయ, బీరకాయ, గోకరికాయ, పొట్లకాయ, దొండ, పసుపు, ఆలుగడ్డ, టమాట, మిర్చి, దోసకాయ, బుడంకాయ, క్యాప్సికం, పోషక పదార్థాలైన పాలకూర, చుక్క కూర, బచ్చలి, మెంతి, పుదీన, కొత్తిమీర, తోటకూర, పుంటికూర, ఔషధ మొక్కలైన షుగర్ ఆకు, నల్లేరు, తులసి, లెమన్ గ్రాస్, శ్రీగంధం మొక్కలను సైతం పెంచుతున్నారు. బయట కొనుగోలు చేయకుండా ఇల్లు ఆవరణలో, పైన పండించుకున్న నాణ్యమైన పంటలతో పండించుకున్న కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో ఆరోగ్యంగా ఉంటున్నామని రమణా రెడ్డి వివరించారు. ఒకరిని చూసి మరొకరు సేంద్రీయ ఎరువులతో తయారు చేసిన పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి మిద్దె తోటలకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే అధిక దిగుబడులను తీసుకొస్తామని తెలిపారు.