రంగారెడ్డి

వంట గదికి తాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, డిసెంబర్ 12: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వంట గదికి స్వప్రయోజనాల కోసం తాళం వేయడంతో తిప్పలు తప్పడం లేదు. నందిగామ మండల పరిధిలోని శ్రీనివాసులు గూడ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పక్కనే వంటగదిని నిర్మించారు. ఈ గదిలో మధ్యాహ్న భోజనాన్ని వండుతారు. గత కొన్ని నెలలుగా ఈ గదికి ఓ వ్యక్తి తాళం వేసుకుని స్వప్రయోజనాల కోసం వాడుకుంటుండటంతో మధ్యాహ్న భోజనాన్ని ప్రతి రోజు బయట వండాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం నిర్మించిన వంటగదిని పరులు వాడుకుంటుండటంతో ఇబ్బందులు తప్పడం లేదని మధ్యాహ్న భోజన వండే అమృత చెబుతోంది. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన వంటగదిని ఇతరులు వాడుకుంటున్న విషయంపై చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి కృష్ణ తెలిపారు.