రంగారెడ్డి

‘భూమి’ వార్తకు స్పందన: సమీక్ష సమావేశం ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 12: ‘కాసుల వేట.. కడుపుల కోత’ అంటూ ‘ఆంధ్రభూమి’లో వచ్చిన వార్తకు స్పందించిన వైద్యశాఖ అధికారులు గురువారం ఉదయం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ చందు నాయక్, కమ్యూనిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ ఆసుపత్రి, పీపీ సెంటర్లలో కాన్పుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని, ఇతర ఆసుపత్రులకు తరలకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, వీరు గైనకాలజిస్టులకు సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న వైద్య సదుపాయాలను పేదలకు అందితేనే అది నిజమైన సంకేతమని అభిప్రాయపడ్డారు.
నకిలీ డాక్టర్లకు నోటీసులు
* డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చందు నాయక్
డాక్టర్ల అవతారమెత్తిన నకిలీలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చందు నాయక్ వివరించారు. ముందు ఎంబీబీఎస్ బోర్డులు తగిలించి వెనక అర్హత లేకున్నా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్న కొందరు ఆర్‌ఎంపీలకు నోటీసులు జారీ చేయనున్నట్లు వివరించారు