హైదరాబాద్

అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలను ఎంతో వైభవంగా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం పేరు వినపడేలా సన్నాహాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం రవీంద్రభారతిలో శిల్పకళల ప్రత్యేకతను సంతరించుకుంటుందని సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఇనుప వ్యర్థ సామగ్రితోను, బంకమట్టి, రాతి శిల్పాలను రవీంద్రభారతిలో అమర్చడానికి ఘంటసాల ప్రాంగణంలో 50 మంది శిల్పకళాకారులతో ఆదివారం నుండి వర్క్‌షాపును ప్రారంభించామని చెప్పారు. శిల్పులు తయారుచేసిన బొమ్మలు, విగ్రహాలను రవీంద్రభారతి ప్రాంగణంలో అమరుస్తామని అన్నారు. 30వ తేదీ నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలకు రవీంద్రభారతి రంగు దీపాలతో సుందర మనోహరంగా ముస్తాబు చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణాలోని తొమ్మిది జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలను అలంకరించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించే బాధ్యత ఆయా జిల్లాల కలెక్టర్‌లకు ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు. సాధ్యమైనంత వరకు తెలంగాణలోని కళాకారులందరికి అవకాశం లభించేలా మరుగునపడిన కళారూపాలను వెలికి తీసి ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. అనవసర విమర్శలు మాని తెలంగాణ ప్రజలందరూ బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ బతుకమ్మ ఉత్సవాలలో ఈ సంవత్సరం విదేశీ కళాకారులు కూడా పాల్గొంటున్నారని, ఎంపి కల్వకుంట్ల కవిత, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అన్ని ప్రభుత్వ సంస్థలు భాగం పంచుకుంటున్నాయని మామిడి హరికృష్ణ చెప్పారు.