రంగారెడ్డి

కొత్త కలెక్టరేట్‌లో చురుకుగా కొనసాగుతున్న పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, అక్టోబర్ 8: నూతనంగా ఏర్పాటు కానున్న మేడ్చల్ జిల్లా కార్యాలయంలో పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. కీసర, ఘట్‌కేసర్, మేడ్చల్, శామీర్‌పేట్, ఉప్పల్, కాప్రా, మేడిపల్లి మండలాలు కీసర రెవెన్యూ డివిజన్‌లోనూ, మల్కాజ్‌గిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ, బాచుపల్లి, బాలానగర్, కూకట్‌పల్లి మండలాలు మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజన్‌లోనూ ఉన్నాయి. కీసర గ్రామంలోని రింగ్‌రోడ్డు పక్కనే గల హశ్వితా ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా కార్యాలయ భవనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 11న దసరా పండుగనాడు అధికారికంగా జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం చేయనుండటంతో అధికారులు రాత్రింబవళ్లు అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. రింగ్‌రోడ్డు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు మెటల్‌రోడ్డు వేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రింగురోడ్డును ఆనుకొని స్వాగత ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలువిభాగాలకు సంబంధించిన ఫర్నిచర్ రావడంతో కూలీలు వాటిని సర్దే పనిలో నిమగ్నమయ్యారు. కార్యాలయం ముందు భాగాన గల స్థలంలో పచ్చదనాన్ని పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు శాఖల కార్యాలయాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మానాలు పూర్తి అయ్యాయి. తహశీల్దార్ కార్యాలయం పక్కనే నూతనంగా నిర్మించిన స్ర్తిశక్తి భవనంలోకి కీసర రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రఘనందన్‌రావు, జెసి ఆమ్రపాలి పలుమార్లు ఏర్పాట్లు పర్యవేక్షించారు. జిల్లా ఇఎస్‌డబ్లుఐ ఇఇ విరూపాక్ష, స్ధానిక తహశీల్ధార్ ఉపేందర్‌రెడ్డి పనులను పర్యవేక్షిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు కానున్న కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జెసి, డిఆర్‌ఓ, ట్రెజరీ, డిటిఓ, డిపిఓ, డిఇఓ, డిఏఓ, డిపిఆర్‌ఓ కార్యాలయాల ఏర్పాటును భవనం పై అంతస్తుల్లో గదులను, ఛాంబర్లను కేటాయించనున్నారు. రికార్డులను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా రికార్డుగదిని ఏర్పాటు చేసి ఫర్నిచర్‌ను అమర్చనున్నారు. కంప్యూటరైజ్డ్ గదిలో ప్రత్యేకంగా బ్యాటరీలను, పలు వస్తు సామగ్రిని ఇప్పటికే తెప్పించారు. ప్రజలు తమ ఫిర్యాదులను ఉన్నతాధికారులకు ఇచ్చేందుకు వీలుగా అతి పెద్ద ప్రజాదర్బార్ హాలును ఏర్పాటు చేసారు.

సిఎం దృష్టికి కెసిఆర్ నగర్ సమస్యలు

ఎంపి మల్లారెడ్డి భరోసా
ఉప్పల్, అక్టోబర్ 8: రామంతాపూర్ కెసిఆర్ నగర్ దీర్ఘకాలిక సమస్యలపై త్వరలో సిఎం దృష్టికి తీసికెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని మల్కాజిగిరి ఎంపి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం రామంతాపూర్ మూసీ పరివాహక భాగాయత్ ప్రాంతంలో మంత్రి కెటిఆర్ దత్తత తీసుకున్న కెసిఆర్‌నగర్, బాలకృష్ణానగర్, సాయికృష్ణానగర్, వెంకట సాయినగర్, లక్ష్మినారాయణనగర్, గ్రీన్‌కాలనీ, సత్యనగర్‌లో స్థానిక కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్‌రావుతో కలిసి పర్యటించారు. ఇక్కడ నిర్మించుకున్న సుమారు రెండువేల మంది ఇంటి యజమానులతో సమావేశమయ్యారు. ఎన్నో ఏళ్ల క్రితం కొనుగోలు చేసుకున్న ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నామని నిరుపేదలు పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ అభివృద్ధి పేరుతో ఇట్టి స్థలాలను స్వాధీనం చేసుకుంటుందని ఆర్డినెన్స్ పేరిట ప్రకటన జారీ చేసి భయం పెట్టిందన్నారు. దీంతో ఇట్టి స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లు పోయి వీధిన పడుతామన్న భయం ఏర్పడిందన్నారు.
అధికారులు కాలనీలలో వౌలిక సదుపాయాలు కల్పించలేదని సిపిఎం కన్వీనర్ ఎర్రం శ్రీనివాస్ ఆరోపించారు. కాలనీల ప్రజలకు పూర్తి భద్రత కల్పించి ఇంటి నెంబర్లు ఇప్పించి సౌకర్యాలను కల్పించాలని ఎంపి మల్లారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. కాలనీల ప్రజల తరపున కార్పొరేటర్ జ్యోత్స్న సైతం భద్రత కల్పించి సౌకర్యాలను కల్పించేవిదంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. స్పందించిన ఎంపి ఉప్పల్ భాగాయత్ రైతుల తరహాలోనే త్వరలో కెసిఆర్‌నగర్ ప్రజల దీర్ఘకాలిక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసికెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ ఇళ్లు పోతాయన్న భయం లేదని భరోసా ఇచ్చారు.