రంగారెడ్డి

కాప్రాయి చెరువు సుందరీకరణకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఫిబ్రవరి 26: కాప్రాయి చెరువు సుందరీకరణ కోసం కృషి చేస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చెప్పారు. బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కటికరెడ్డి ఆరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని కాప్రాయి చెరువు సుందరీకరణ కోసం కృషి చేయాలని శాతవాహన నగర్ కాలనీ వాసులు సుధీర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకు విన్నపించారు. కాలనీల మధ్య చెరువు ఉండడం కారణంగా ఆహ్లాదకరమైన వాతవరణం ఉంటుందని, అభివృద్ధి లేని కారణంగా నిరుపయోగంగా తయారైందని అరవింద్ రెడ్డి ఎమ్మెల్యేకు వివరించారు. చెరువు చుట్టు ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసి గార్డెనింగ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో శాతవాహన నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మినారయణ, హనుమంత్, శంకర్, దాసరి మహేష్ పాల్గొన్నారు.