రంగారెడ్డి

కాప్రా తహశీల్దార్‌గా గౌతమ్ కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, ఫిబ్రవరి 26: కాప్రా మండల తహశీల్దార్‌గా గౌతమ్‌కుమార్ పదవీ బాధ్యతల చేపట్టారు. ఇక్కడ పని చేసిన తహశీల్దార్ నాగమణిని అల్వాల్ మండలానికి మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు బదిలీ చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌కుమార్‌ను జవహర్‌నగర్ 16వ డివిజన్ టీ.విశ్రాంతమ్మ మర్యాద పూర్వకంగా బుధవారం కలిశారు. జవహర్‌నగర్ అరుంధతినగర్, మల్కారం ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా గుంతలపడ్డ రోడ్లను పూడ్చి వేసేందుకు కావాల్సిన మట్టిని ఆయా గుట్ట ప్రాంతాల నుంచి తీసుకుంటామని దీనికి తహశీల్దార్‌గా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మట్టిని తవ్వి గుంతలు పూడ్చడం, అవసరమైన ప్రాంతాల్లో మొక్కలు నాటడం కోసం మట్టి ఎంతో అవసరమని దీనికి కింది స్థాయి రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తే తమకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, సత్యనందం పాల్గొన్నారు.