రంగారెడ్డి

పానీ పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, ఫిబ్రవరి 27: వేసవి కాలం ప్రారంభమైతే తాగునీటి కోసం కష్టాలు పడాల్సిందే. శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి పాలకులు, అధికారులు సక్రమంగా చర్యలు తీసుకోకపోవడంతోనే నీటి కష్టాలు మొదలయ్యాయని ప్రజలు అంటున్నారు. కొత్తూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవీ కాలం ముగిసి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా నేటి వరకు ఎన్నికలు నిర్వహించకపోవడం.. ప్రత్యేక అధికారులను నియమించడంతో సమస్యలతో తాము కొట్టుమిట్టాడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక అధికారులు ఎప్పుడు వస్తారో..ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజలు అంటున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రతి ఏడాది అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పైపులైన్ పనులు పూర్తి చేసి తాగునీటి సమస్యను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన పాలకులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినీ ఇండియాగా చెప్పుకునే కొత్తూరు పారిశ్రామిక ప్రాంతంతోపాటు కొత్తూరు మండల కేంద్రంలో నీటి కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో నల్లాలు రాక, ఉన్న బోరుబావుల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో నీటి ట్యాంకర్లను ఆశించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని అంటున్నారు. నీటి సమస్యను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మండల సర్వసభ్య సమావేశంలో పలుమార్లు చెప్పినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి సమస్యను నియంత్రించేందుకు ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాల్సిన పాలకులు, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు.