రంగారెడ్డి

ఆస్ట్రేలియా వెళ్లి వచ్చినవారి వివరాల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, మార్చి 21: రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని ఆగిర్యాల గ్రామానికి చెందిన భార్యభర్తలు వారం రోజుల క్రితం ఆస్ట్రేలియాలకు వెళ్లి వచ్చారు. ఆగిర్యాల గ్రామానికి చెందిన భార్యభర్తలు మార్చి 19న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యుల ఇంటికి చేరుకున్నారు. రెండు రోజులు అక్కడే ఉండి తిరిగి స్వగ్రామం ఆగిర్యాలకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శనివారం ఆగిర్యాల గ్రామానికి చేరుకొని ఆస్ట్రేలియా వెళ్లి ఇరువురి నుండి పూర్తి వివరాలు సేకరించారు. దగ్గు, తుమ్ములు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఏమి లేవని చెప్పడంతో వైద్యులు ఊపీరిపీల్చుకున్నారు. జిల్లేడు చౌదరిగూడ మండలం నంద్యాతండాకు చెందిన నలుగురు వ్యక్తులు పుణె నుంచి శనివారం ఉదయం వచ్చినట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో వైద్య సిబ్బందికి తండాకు చేరుకొని వారి నుంచి వివరాలు సేకరించారు. కరోనా వైరస్ లక్షణాలు ఏమీ లేవని వైద్యులు తేల్చారు.
బాధితులకు నష్టపరిహారం
జీడిమెట్ల, మార్చి 21: జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా నుంచి సుచిత్ర వరకు రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఇళ్లను కోల్పోతున్న బాదితులకు కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత నష్టపరిహారాన్ని అందజేశారు. కుత్బుల్లాపూర్ గ్రామంలో 32 ఇళ్లు కోల్పోయన బాధితుల్లో నలుగురికి రూ.3.40 కోట్ల చెక్కును మమత అందించారు. మమత మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో ఇళ్లను కూల్చివేసిన తరువాత మిగతా బాధితులకు చెక్కులను పంపిణీ చేస్తామని అన్నారు. టీఆర్‌ఎస్ యూత్ నాయకుడు కేపీ విశాల్ పాల్గొని మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో ఇళ్లను కోల్పోతున్న వారందరికీ నష్టపరిహారం వచ్చేవిధంగా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ మంగతాయారు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రాజ్‌కుమార్, సెక్షన్ ఆఫీసర్ గిరిరాజు, చైన్‌మెన్ లక్ష్మన్ పాల్గొన్నారు.
హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా మూసివేత
కొత్తూరు, మార్చి 21: హజ్రత్ జహంగీర్ పీర్ దర్గాను వక్ఫ్‌బోర్డు అధికారులు మూసివేశారు. శనివారం మధ్యాహ్నం కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని జహంగీర్ పీర్ దర్గాను కరోనా వైరస్ నేపధ్యంలో వక్ఫ్‌బోర్డు అధికారులు మూసివేశారు. తెలంగాణలో పరమ పవిత్రమైన జహంగీర్ పీర్ దర్గాకు భక్తులు ఎవరు రావద్దని వక్ఫ్‌బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతర్గతంగా బాబాకు రోజువారి ప్రార్థనలు మినహా ఎవరూ భక్తులు రావద్దని, ఎలాంటి దర్శనాలు లేవని, న్యాస్ వంటి కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని భక్తులకు సూచించారు.

ఇంటింటి సర్వేలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది

* 60ఏళ్లు పైబడిన వారి పూర్తి వివరాల సేకరణ * డాక్టర్ బాల నారాయణ
షాద్‌నగర్ రూరల్, మార్చి 21: కోవిడ్ మహమ్మారిని నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టినట్లు రంగారెడ్డి జిల్లా పీఓడీపీ అధికారి డాక్టర్ బాల నారాయణ అన్నారు. శనివారం షాద్‌నగర్ కమ్యూనిటి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డును పరిశీలించారు.
ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ బాల నారాయణ మాట్లాడుతూ షాద్‌నగర్ డివిజన్‌లోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, కేశంపేట, మున్సిపాలిటిలోని అన్ని వార్డుల్లో ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు కలిసి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. 60ఏళ్లు పైబడిన వారికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, వారిలో దగ్గు, దమ్ము, శ్వాస కోస ఇబ్బందులు, జ్వరం, తుమ్ములు, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉంటే తక్షణమే ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చందు నాయక్, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ జే.శ్రీనివాసు పాల్గొన్నారు.