రంగారెడ్డి

శంకర్‌పల్లి నుంచి దేవరకొండ వరకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, ఏప్రిల్ 13: లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో శంకర్‌పల్లి నుంచి దేవరకొండకు కాలినడకన వెళ్తున్నారు. ఆరు కుటుంబాలు వెళ్తుండగా కేశంపేటలో ఎస్‌ఐ కోన వెంకటేశ్వర్లు ఆపి వివరాలను తెలుసుకున్నారు. 170 కిలోమీటర్లు కాలినడకన వెళ్లడం కుదరదని, స్థానికంగా నివాసం కల్పిస్తామని చెప్పారు. భోజన వసతిని సర్పంచ్ తలసాని వెంకట రెడ్డి కల్పించారు.
స్వీయ సంరక్షణతోనే నియంత్రణ
షాద్‌నగర్ రూరల్, ఏప్రిల్ 13: కరోనా వైరస్ పట్ల ప్రజలు స్వీయ సంరక్షణతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ వివరించారు. సోమవారం షాద్‌నగర్ ముఖ్యకూడలిలో లాక్‌డౌన్‌ను సమీక్షించిన ఏసీపీ మాట్లాడుతూ కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. బయటకు వచ్చే వ్యక్తులు విధిగా మాస్కులు ధరించాలని, లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా జరిమాన విధించనున్నట్లు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మెస్తే వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేయనున్నట్లు వివరించారు. మెడికల్, కూరగాయలు, కిరాణాషాపులకు వచ్చే ప్రజలు విధిగా సామాజిక దూరం పాటించడమే కాకుండా మాస్కులు ధరించాలని సూచించారు.