రంగారెడ్డి

ఇద్దరికి కరోనా పాజిటివ్‌తో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఏప్రిల్ 13: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో కలకలం రేపుతుంది. తాజాగా 65 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో ఆదివారం రాత్రి హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చందు నాయక్ ధ్రువీకరించారు. చేగూర్ గ్రామానికి చెందిన మహిళ(55) ఏప్రిల్ 1న హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని గ్రామానికి తరలించి 2వ తేదీ రోజు అంత్యక్రియలు నిర్వహించారు. 3న మరణించిన మహిళకు కరోనా పాజిటివ్ రిపోర్టు వెలుగు చూసింది. అంత్యక్రియలు నిర్వహించిన తరువాత పాజిటివ్ అంటూ ఫలితం రావడం అధికారులు హుటాహుటిన గ్రామాన్ని చేరుకుని మహిళ తాలూకు కుటుంబ సభ్యులు, బీహార్ యువకులను ఆసుపత్రికి తరలించారు. గ్రామాన్ని కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ సజ్జనార్, ఏసీపీ సురేందర్ సందర్శించి కట్టడి విధించారు. కిరాణ దుకాణం నడిపిస్తుండే మృతురాలి ఇంట్లో అద్దెకు ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన కొందరు యువకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రాగా వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. పాజిటివ్ వచ్చిన యువకుడితోనే మహిళకు కరోనా సోకిందని భావిస్తున్నారు. మృతురాలి భర్తకు సైతం కరోనా పాజిటివ్ రావడంతో ఆదివారం రాత్రి గాంధీ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు.
కూలీలకు అన్నదానం
ఉప్పల్, మార్చి 13: జీహెచ్‌ఎంసీ ఉప్పల్ పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద సోషల్ వర్కర్ గోనే జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కూలీలకు అన్నదానం జరిగింది. ఆకలితో అలమటించకుండా కూలీలకు అన్నం పెట్టి ఆకలి తీర్చేందుకు జగదీశ్వర్ రెడ్డి స్వచ్చందంగా ముందుకు వచ్చారు. లాక్‌డౌన్ ఎత్తేసేంతవరకు నిరంతరం అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
మాస్క్‌ల తయారీలో మహిళల ముందంజ
కీసర, ఏప్రిల్ 13: మాస్క్‌ల తయారీలో మహిళా సంఘాలు ముందజలో ఉన్నారని మేడ్చల్ జిల్లా డీఆర్‌డీవో జ్యోతి అన్నారు. కవోనా ప్రబలు తున్న సందర్భంగా మాస్క్‌ల వినియోగం పెరిగిందని తెలిపారు. 65 వేల మాస్క్‌లు తయారు చేశామని, 30 వేలు విక్రయించగా, 35 వేల మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మేడ్చల్ డీఆర్‌డీవో కార్యాలయాన్ని 9849909332 నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని అన్నారు.