రంగారెడ్డి

అధిక ధరలపై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, ఏప్రిల్ 13: అధిక ధరలకు నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో కిరాణాషాపు యజమానిపై కేసు నమోదు చేసినట్లు కొందుర్గు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని మహాదేవ్‌పూర్ గ్రామంలో ఓ కిరాణాషాపు యజమాని అధిక ధరలకు నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. షాపు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ వివరించారు.

అప్రమత్తంగా ఉండాలి
షాబాద్, ఎప్రిల్ 13:కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుమలాపూర్ సర్పంచ్ శ్రీ్ధర్ రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలోని పురవీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ మందును పిచికారి చేయించారు.
పేదలకు చేయూత
ఘట్‌కేసర్, ఏప్రిల్ 13: లాక్‌డౌన్ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న పేదలను ఆదుకోవటమే లక్ష్యంగా వైఎస్‌ఆర్ ట్రస్టు నిరంతరం సేవలు అందిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం మర్పల్లిగూడ, చౌదరిగూడ, మక్త, నారపల్లి, అవుషాపూర్, ఎదులాబాద్, వెంకటాపూర్‌లో వైఎస్‌ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ చేశారు. అవుషాపూర్ సర్పంచ్ ఏనుగు కావేరి, టీఆర్‌ఎస్ యువజన విభాగం మండల శాఖ అధ్యక్షుడు బాలు యాదవ్, మర్పల్లిగూడ ఉప సర్పంచ్ మాయ నరేష్, మండల వైఎస్‌ఆర్ ట్రస్ట్ సభ్యులు ఏనుగు మచ్చేందర్ రెడ్డి, భాను పాల్గొన్నారు.