రంగారెడ్డి

ప్రభుత్వ పాఠశాలలో సృజనాత్మక పెంచేందుకే డిజిటల్ తరగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, నవంబర్ 16: ప్రభుత్వ పాఠశాలలో ప్రణాళికలు, విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడానికి డిజిటర్ క్లాస్‌లు ఎంతో ఉపయోగపడతాయని శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్ అన్నారు. బుధవారం రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూంలను మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనలో సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. విద్యార్థులు డిజిటల్ తరగతులను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3300 పాఠశాలల్లో డిజిటల్ తరగతులతో నూతన పద్ధతులతో విద్యను బోధించడం జరుగుతుందని, ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 135 ప్రభుత్వ పాఠశాలల్లో 40 వేల మంది విద్యార్థులు డిజిటల్ తరగతులు వినియోగించుకుంటున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ ఏడాది సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలను విద్యార్థులు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం వెనుకడుగు వేసేది లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు కావాల్సిన అదనపు గదులను, పక్కా భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్, కార్పొరేటర్లు రావుల విజయజంగయ్య, కోరణి శ్రీలత, మండల విద్యాధికారి భూపతిరావు, టి ఆర్ ఎస్ నాయకురాలు స్వర్ణలతా భీమార్జున్‌రెడ్డి, బిజెపి నాయకులు వై.శ్రీ్ధర్, టిఆర్‌ఎస్ నాయకుడు కెఎస్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

సర్కారు బడుల్లో డిజిటల్ చదువులు
శేరిలింగంపల్లి, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా బోధనలో డిజిటల్ విప్లవాన్ని తెచ్చిందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం మియాపూర్‌లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులను ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ లిటరసీతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని విద్యా బోధన చేపట్టడం ఒక విప్లవంలాంటిదని పేర్కొన్నారు. ఆధునిక విద్యాభ్యాసంతో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు సైతం కంప్యూటర్ పరిజ్ఞానం కలుగుతుందని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు మరింత గురుతర బాధ్యత పోషించాలని ఎమ్మెల్యే గాంధీ సూచించారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల విద్యాధికారి రామ్‌చందర్, ఉపాధ్యాయులతో పాటు టిఆర్‌ఎస్ నాయకులు పురుషోత్తం యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వాలా హరీష్‌రావు, గోపరాజు శ్రీనివాసరావు, లద్దె నాగరాజు, నర్సింగ్, కరణ్‌గౌడ్, సురేష్ ముదిరాజ్, చంద్రిక పాల్గొన్నారు.
తాండూరులో..
తాండూరు: ప్రాథమిక స్థాయి నుండే విద్యాభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ నెంబర్-1 హైస్కూలులో డిజిటల్ క్లాసులను ముఖ్యఅతిధిగా హజరై ప్రారంబించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేరువ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
సరూర్‌నగర్‌లో..
హయత్‌నగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్ తెరాస ఇన్‌చార్జ్ ముద్దగోని రామ్మోహన్‌గౌడ్, లింగోజిగూడ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు తెలిపారు. డివిజన్ పరిధిలోని సరూర్‌నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను వారు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసి విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, ఉపాద్యాయులు రాఘవరెడ్డి, మోహన్‌రెడ్డి, నాయకులు శ్రీ్ధర్‌గౌడ్, సత్యనారాయణ, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
మేడ్చల్‌లో..
మేడ్చల్: మేడ్చల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం అధికారికంగా డిజిటల్ తరగతులు ప్రారంభమయ్యాయి. గౌడవెళ్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపిపి విజయలక్ష్మీ ముఖ్యఅతిథిగా విచ్చేసి డిజిటల్ క్లాసులను ప్రారంభించారు. పూడూరు గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులకు శ్రీకారం చుట్టారు. వారానికి