రంగారెడ్డి

శంషాబాద్ టు శివరాంపల్లి ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, నవంబర్ 25: ఫ్రధాని నరేంద్రమోదీకి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. నరేంద్రమోదీ వచ్చిన భారత వాయుసేన విమానం శుక్రవారం సాయంత్రం 6.28 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. ముఖ్యమంత్రి కేసిఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం 6.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ బందోబస్తు మధ్య ప్రధాని మోదీ కాన్వాయ్ శివరాంపల్లిలోని జాతీయ పోలీసుల అకాడమీకి చేరింది.

కారు ఢీకొని
ఇంజనీర్ మృతి
కెపిహెచ్‌బి కాలనీ, నవంబర్ 25: అతివేగంగా వచ్చిన ఓ కారు బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఆవుల కోటేశ్వర్‌రావు(31) బల్కంపేట్‌లో నివాసముంటూ మాదాపూర్‌లోని క్యాప్‌జెమినీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకొని బైక్‌పై బల్కంపేట్‌లోని నివాసానికి వెళ్తున్నాడు. ఈక్రమంలో కైత్లాపూర్ రోడ్డులో అతివేగంగా వచ్చిన ఫియట్ కారు ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న కోటేశ్వర్‌రావు కిందపడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నిత్యం పర్యవేక్షిస్తుండాలి
జిల్లా సంక్షేమ అధికారి మల్లారెడ్డి
మేడ్చల్, నవంబర్ 25: అంగన్‌వాడీ కేంద్రాలకు విచ్చేసే పిల్లల ఎదుగుదలను నిత్యం పర్యవేక్షిస్తుండాలని కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి మల్లారెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని మేడ్చల్ ప్రాజెక్ట్‌కు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రాజెక్ట్ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మల్లారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యలక్ష్మి పథకం లబ్ధిదారులందరికీ అందేవిధంగా కృషి చేయాలని కోరారు. ఎన్‌హెచ్‌టిఎస్, అన్‌లైన్ ఎఫ్‌సిఆర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మాతా శిశు సంరక్షణపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ రికార్డులను రోజువారీగా అప్‌డేట్ చేయాలన్నారు. ఈ సందర్భంగా పిల్లల ఎదుగుదల, అంగన్‌వాడీ కేంద్రాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

ధర్మయుద్ధంలో విజయం ఖాయం

మంద కృష్ణ మాదిగ
కెపిహెచ్‌బి కాలనీ, నవంబర్ 25: ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం మాదిగలు నిర్వహించిన ధర్మయుద్ధంలో మాదిగలు విజయం సాధించడం ఖాయమని ఎమ్‌ఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కూకట్‌పల్లిలోని ఇంద్రనగర్‌లో ఎమ్‌ఆర్‌పిఎస్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ముత్యపాగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల స్థాయి ధర్మయుద్ధ మహాసభ సన్నాహక సదస్సుకు మంద కృష్ణమాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 27న 30 లక్షల మంది మాదిగ, మాదిగ ఉపకులాలు ప్రజలతో నిర్వహించే మాదిగ ధర్మయుద్ధ మహాసభకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ జీవోకు చట్టబద్ధత సాధించుకునే క్రమంలో లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చిన మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని చట్టబద్ధత కల్పించుకొని తీరుతామన్నారు. జరగబోయే ఈ శీతకాల సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి జీవోకు చట్టబద్ధత కల్పించి మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలకు సామాజిక న్యాయం చేయాల్సిందిగా కోరారు. సన్నాహాక సదస్సులో ఎమ్‌ఆర్‌పిఎస్ జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడు ఆనంద్‌రావుమాదిగ, ఎమ్‌ఆర్‌పిఎస్ జాతీయ కళామండలి అధ్యక్షుడు అశోక్, గణేష్‌మాదిగ, రమేష్‌మాదిగ, ఎలిషా, నాగేందర్, దండు యాదగిరి, బాలకృష్ణ, నిరంజన్ పాల్గొన్నారు.

* కేంద్ర రక్షణ మంత్రిని కోరిన
ఎంపి మల్లారెడ్డి
అల్వాల్, నవంబర్ 25: కంటోనె్మంట్ లోని మిలటరీ రోడ్లు మూసివేత గడువు పెంచాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు చామకూర మల్లారెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను కోరారు. శుక్రవారం న్యూఢిల్లీలో మంత్రిని కల్సి రోడ్ల మూసివేతతో ప్రజలకు జరిగే ఇబ్బందుల గురించి వివరించారు. ఆయితే రోడ్ల మూసివేత అంశాన్ని ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామనీ మంత్రి హామీ ఇచ్చినట్టు మల్లారెడ్డి చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా రోడ్ల మూసివేత అంశం ప్రధాన అంశంగా మారింది. నగరంలోని నార్త్ జోన్ పరిధిలోని మల్కాజిగిరి, కాప్రా, ఇసిఐఏల్, నేరేడ్‌మెట్, వౌలాలి, సఫిల్‌గూడ ప్రాంతవాసులు నగరానికి రావాలన్నా నగరం నుండి తిరిగి వెళ్లాలన్నా ఇదేమార్గంలో ప్రయాణించాల్సి ఉంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో దారుల మూసివేత కథ మళ్లీ మొదటికి వచ్చింది. మరోవైపు రాష్ట్ర ఐటి మంత్రి కేటి రామారావు కేంద్ర మంత్రి మనోహర్ పారికర్‌ను కల్సి కంటోనె్మంట్ మీదుగా బొల్లారం ద్వార రామగుండం వరకు ఉన్న రాజీవ్ రాహదారిలో, బోయిన్‌పల్లి మీదుగా మేడ్చల్ వెళ్లే మార్గంలో స్కై ఓవర్‌లు నిర్మించటానికి స్థలం కేటాయించాలని కోరారు. ఈ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉంది.

గుంతలమయంగా హైదరాబాద్ - బీజాపూర్ రహదారి

చేవెళ్ల, నవంబర్ 25: చేవెళ్ల మండల కేంద్రం మీదుగా హైదరాబాద్ - బీజాపూర్ వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారి కంకర తేలి దయనీయంగా మరింది. గుంతలు తెలిన రోడ్లపైన 24గంటలు రాకపోకలు సాగించే చిన్న, అతి భారీ వాహనదారులు, పాదాచారులు ప్రయాణింలంటేనే జంకుతున్నారు.
ఎక్కడ చూసిన గుంతలు తేలిన కంకర రోడ్లతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. చేవెళ్ల- శంకర్‌పల్లి రోడ్లు అధ్వానంగా తయారైంది. గుంతలు, కంకర తేలి ఉన్న ఈ జాతీయ రహదారి మార్గంలో వాహనాలు ఎన్నో సార్లు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్న అధికారులు స్పందించక పోవడంతో ప్రయాణికులు మండి పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండల కేంద్రంలో రోడ్లపైన ఏర్పడ్డ గుంతల్లలో నీళ్లు నిలువడంతో మండల కేంద్రంలోని బస్‌స్టేషన్ నుండి హైదరాబాద్ వెళ్లే రోడ్లు, చేవెళ్ల నుండి శంకర్‌పల్లికి వెళ్లే రోడ్డు, చేవెళ్ల నుండి వికారాబాద్ వెళ్లే రోడ్లు చాలా చోట్ల గుంతలుపడి, కంకర తేలడంతో ప్రయానికులు ప్రయానించెందుకే జంకుతున్నారు. దీంతోవాహనదారులు ఈ రోడ్డుపైన ప్రయాణించాలంటే అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రంలో దయనీయంగా ఉన్న రోడ్లను అధికారులు స్పందించి మరమతులు చేయించాలని ప్రయానికులు కోరుతున్న పటించుకున్న నాథుడే లేడని వాపోయారు. నిత్యం ఇదే గుంతల మీదిగా ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయాణాలు చేస్తుంటారు. గుంతలను పటించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైన మంత్రి మహేందర్ రెడ్డి స్పందించి చేవెళ్లలోని హైదరాబాద్- బీజాపూర్ రహదారిలో మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

వణికిస్తున్న చలి
పరిగి, నవంబర్ 25: పరిగి ప్రజలను చలి వణికిస్తున్నది. దీంతో వామ్మోచలి అంటు ప్రజలు అల్లాడుతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం రాత్రి వేళలలో చలిగాలులు వీస్తున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి చలి మొదలు కావడం తెల్లవారుజామున 9గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదు. రోజు వారి కార్మికులు, ఉధ్యోగులకు చలిపాటు తప్పడం లేదు. వృద్ధులు చిన్న పిల్లలు చలితో ఇబ్బంది పడుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ఉన్ని వస్త్రాలు ధరిస్తున్నారు. ఉదయం సాయంత్రం పూట పరిగిలో ప్రతి ఒక్కరికి మంకీ క్యాప్‌లు కనిపిస్తున్నాయి. వాకింగ్ చేసే ప్రజలు ఉదయం పూట మాస్కులు సహితం ధరిస్తున్నారు. చాల బాగా పెరగడంతో ఉదయం సాయంత్రం ప్రజలు చాల మంది జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9గంటలైనా చలి తగ్గక పోవడంతో విద్యార్థులు చలికి వణికి పోతున్నారు.

ప్రశాంతమైన వాతావరణం కోసమే హరితహారం
మేడ్చల్, నవంబర్ 25: ఆహ్లదకరమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే అందుకు ప్రశాంతమైన పచ్చని వాతావరణం, ప్రకృతి సంపదలు ఎంతో అవసరమని పచ్చదనం పరిఢవిల్లేలా హరితహారం ద్వారా స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు బాధ్యతగల ప్రతి పౌరుడు చిత్తశుద్ధితో కృషి చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి సూచించారు. శుక్రవారం శామీర్‌పేట్ మండల పర్యటనలో భాగంగా దేవరయాంజాల్, తుర్కపల్లి గ్రామాల్లో హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు. శామీర్‌పేట్ చెరువు తూము వద్ద నీటి లీకేజీని పరిశీలించి నీటిపారుదలశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న ప్రపంచ పోకడలకనుగుణంగా అభివృద్ధితో పాటు ప్రజలకు, జీవకోటికి అవసరమైన మంచి వాతావరణం, శుభ్రమైన పరిసరాలు, పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం, స్వచ్ఛ్భారత్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి బృహత్తరమైన పథకాలను ప్రవేశపెట్టి వాటిని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు కూడా చేస్తుందని వివరించారు. జనాభా, మార్కెటింగ్, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో మేడ్చల్ జిల్లా కాలుష్య రహిత వాతవరణానికి దూరమవుతుందని అన్నారు. మేడ్చల్ జిల్లాలో చెట్ల విస్తరణ కేవలం 15 శాతం మాత్రమే ఉందని హరితహారం ద్వారా వీటి సంఖ్య 30 శాతానికి పెంచినపుడే మంచి వాతావరణం ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. చెట్ల పెంపకంతో సహజ సిద్ధమై వాయువుతో పాటు సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడవచ్చన్నారు. రైతు, కూలి, పారిశ్రామిక, కులవృత్తులు ప్రతి ఒక్కరికి జీవనోపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మేడ్చల్ జిల్లాలో 30 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా వచ్చే జూలై నుండి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని ప్రకటించారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో నాటిన మొక్కలు, వాటి సంరక్షణ బాధ్యతలు ఏవిధంగా నిర్వర్తిస్తున్నారా అనే విషయమై మండలంలో పర్యటించానని వివరించారు. మొక్కలు నాటడం, జియో ట్యాగింగ్, సరంక్షణ బాధ్యతలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ ఉమాదేవి, నీటిపారుదల ఇఇ బీంప్రసాద్, డిపిఓ సురేశ్‌మోహన్, డిఎఫ్‌ఓ కృష్ణ, ఇరిగేషన్ డిఇ నర్సింహ్మ, డిపిఎం సురేఖ, ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మన్, ఎంపిపి చంద్రశేఖర్ యాదవ్, జడ్పీటిసి బాలేశ్, ఎంపిడిఓ జ్యోతి, తహశీల్దార్ రవీందర్‌రెడ్డి, ఇఓపిఆర్డీ మల్లికార్జున్, సర్పంచ్‌లు శ్రీనివాస్ ముదిరాజ్, కిశోర్ యాదవ్, వెంకటేశ్, అల్వాల్ సోసైటీ చైర్మన్ దేశమంత్‌రెడ్డి, ఎంపిటిసి జహంగీర్ పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు లక్ష్మాపూర్ చెరువులో మునిగి

ఇంటర్ విద్యార్థి దుర్మరణం
మేడ్చల్, నవంబర్ 25: ప్రమాదవశాత్తు లక్ష్మాపూర్ చెరువు నీటిలో మునిగి ఇంటర్ విద్యార్థి దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని లాలాపేట్ ప్రాంతానికి చెందిన బాలమణి లక్ష్మీనారాయణ దంపతుల కుమారుడు నిఖిల్(16) నగరంలోని వసుంధర కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా శుక్రవారం శామీపేట్ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఓ వివాహ శుభకార్యానికి లక్ష్మీనారాయణ తన కుటుంబీకులతో కలిసి వచ్చాడు. పెళ్లి జరుగుతున్న సమయంలో కాలకృత్యాల కోసం లక్ష్మాపూర్ చెరువు వద్దకు లక్ష్మీనారాయణ కుమారుడు నిఖిల్‌తో కలిసి వెళ్లాడు. కాలకృత్యాలు ముగించుకున్న తర్వాత చెరువులో కాళ్లు కడుకుందామని భావించి నిఖిల్ చెరువు దగ్గరికి వెళ్లాడు. తండ్రి చూస్తుండగానే చెరువు నీటిలో కాలు పెట్టిన నిఖిల్ ప్రమాదవశాత్తు అందులో జారిపడిపోయాడు. నీట మునుగుతున్న నిఖిల్‌ను కాపాడాలని తండ్రి లక్ష్మీనారాయణ కేకలు వేశాడు. పక్కనున్నవారు వచ్చేలోపే నిఖిల్ నీట మునిగిపోయాడు. నిఖిల్‌కు ఈత రాకపోవడంతో తండ్రి కళ్లముందే మృత్యువాతపడ్డాడు. పెళ్లి హడావుడిలో ఉన్నవారికి విషయం తెలియడంతో హుటహుటిన సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. రెండు గంటల వెతికిన అనంతరం నిఖిల్ మృతదేహం చెరువు నీటిలో లభ్యమైంది. చెరువు వద్దకు చేరుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చెరువులో యథేచ్ఛగా చేపట్టిన అక్రమ మట్టి తవ్వకాలతో భారీ గుంతలు ఏర్పడ్డాయని అందులో ఇరుక్కుపోయి నిఖిల్ దుర్మరణం చెందాడని పలువురు ఆరోపించారు. మృతదేహన్ని అనంతరం నగరంలోని లాలాపేట్ ప్రాంతానికి తరలించారు.

బైక్‌లను దొంగిలించిన ఎనిమిది మంది అరెస్టు
ఉప్పల్, నవంబర్ 25: జల్సాల కోసం చిన్నారులు దొంగలుగా మారారు. పార్కింగ్ చేసిన బైక్‌లను దొంగిలించి వాటిపై దర్జాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఎనిమిది మంది బైక్ దొంగలను ఉప్పల్, మేడిపల్లి పోలీసుస్టేషన్ల క్రైం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.16లక్షల విలువైన బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ కమిషనరేట్ జాయింట్ కమిషనర్ శశిధర్‌రెడ్డి తెలిపారు. పట్టుబడిన వారిలో నలుగురు మైనర్‌లు అని పేర్కొన్నారు. శుక్రవారం ఉప్పల్‌లోని మల్కాజిగిరి డిసిపి కార్యాలయంలో డిసిపి రమేశ్ నాయుడు, ఏసిపి గోనె శ్రీకాంత్, ఉప్పల్, మేడిపల్లి ఇన్‌స్పెక్టర్లు నర్సింహారెడ్డి, కొమురయ్య, జగన్నాథరెడ్డి, శ్రీముని, ఎన్.జయరామ్ కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మేడిపల్లికి చెందిన బకి నవీన్ అలియాస్ డిట్చి నవీన్(19), మెకానిక్ రంగు ఉదయ్(19), ఆటోడ్రైవర్ కూతాడి మహేష్(19) మరో నల్గురు విద్యార్థులు దండమైన రాజ సాగర్‌రెడ్డి(17), రాపోలు రోహన్‌రెడ్డి(17), మున్నూరు నవీన్(17), ఒగ్గు నాగరాజు(16), మరో లాండ్రీ షాపు నిర్వహించే చింతల రాజశేఖర్(27)ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వేర్వేరు ప్రాంతాలలో పార్కింగ్ చేసిన బైక్‌లను నకిలీ తాళం చెవిలతో తస్కరించి ఇబ్రహింపట్నం, మోత్కూరు, యాదగరిగుట్ట, ఎల్‌బినగర్, సరూర్‌నగర్, తార్నాక, పోచంపల్లి ప్రాంతాలలో అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారని పేర్కొన్నారు. వరంగల్ రహదారిలో వేహికిల్ చెక్ చేస్తుండగా వీరు పట్టుబడ్డారని తెలిపారు. దొంగలను పట్టుకోవడానికి కృషి చేసిన క్రైం స్ట్ఫాను అభినందించారు. వీరికి బహుమతులను అందజేయడానికి సిపికి రెక్‌మెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కారు సర్వీస్ షెడ్‌లో అగ్ని ప్రమాదం
గచ్చిబౌలి, నవంబర్ 25: మాదాపూర్‌లో శుక్రవారం సాయంత్రం ఫ్లాగ్ ఆటో సర్వీసింగ్ సెంటర్ షెడ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో షెడ్‌లో చాలా కార్లు ఉన్నాయని అంటున్నారు. ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాదాపూర్‌లోని హైటెక్ సిటీ నుండి కూకట్‌పల్లి వైపువెళ్లే మార్గంలో ఉన్న కారు ఫోం వాష్ షెడ్ లోపల నుండి రాత్రి 9గంటల సమయంలో మంటలు రావడంతో స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. హైటెక్‌సిటీ ఫైర్ స్టేషన్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లు తీసు