రంగారెడ్డి

డబ్బుల కోసం అవే పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, డిసెంబర్ 3: దేశంలో ఉన్న నల్లధనం వెలికి తీసేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంతో గత కొన్నిరోజులుగా చేవెళ్ల మండలంలోని ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు డబ్బుల కోసం బ్యాంక్‌ల్లో బారులు తీరుతున్నారు. శనివారం బ్యాంక్‌లో అధికారులు ఏటిఎంలో సరిపడా నగదు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడుతున్నారు. అయితే చేవెళ్ల మండల కేంద్రంలోని ఎస్‌బిహెచ్, ఆంధ్రాబ్యాంక్, యాక్సిస్‌బ్యాంక్, బ్యాంక్ ఆఫ్-బరోడా, కెనరా బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లతో పాటు మండల పరిధిలోని ఆలూర్, కౌకుంట్ల తదితర బ్యాంకుల ముందు జనం తెరవకముందు నుండే డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు. బ్యాంక్‌ల్లో సరిపడా డబ్బులు లేకపోవడంతో ఖాతాదారులకు కేవలం 4వేల నుండి 6వేల వరకే ఇస్తున్నారు. దీంతో ప్రతిరోజు డబ్బుల కోసం బ్యాంక్‌ల చుట్టూ తిరగాలా? అని పలువురు ఖాతాదారులు బ్యాంక్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే తమ వద్ద ఉన్న నగదు చాలా తక్కువగా ఉందని, దానినే అందరికీ సర్దుతున్నట్టు అధికారులు తెలిపారు. ఏటిఎంలో డబ్బులు ఏర్పాటు చేస్తే ఖాతాదారులకు ఇంత ఇబ్బంది ఉండదని పలువురు పేర్కొంటున్నారు.