రంగారెడ్డి

అక్రమ నిర్మాణాలపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, డిసెంబర్ 14: అక్రమ నిర్మాణాలపై తూతూ మంత్రంగా కూల్చివేతలు అనే అంశంపై మంగళవారం ఆంధ్రభూమి సిటీ టాబ్లాయిడ్‌లో ప్రచురితమైన వార్తకు రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కెటిఆర్ స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి సర్కిల్ 12 ఉప కమిషనర్ వి.మమత.. ఆంధ్రభూమి వార్తకు స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. మదీనగూడలోని ఆర్టీసీ కాలనీ వద్ద సర్వే నెంబరు 54/ఎ లోని ప్లాట్ నెంబరు 8లో కమలేష్‌కుమార్ రాంచందాని, కైలాష్‌కుమార్ రాంచందానీల పేర్లతో గ్రౌండ్ ప్లస్ ఒకటి అంతస్థులకు అనుమతి తీసుకుని రెండు అంతస్థులు అదనంగా నిర్మించారని డిప్యూటీ కమిషనర్ మమత అంగీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా మొదటి అంతస్థులో వేసిన షట్టర్లను తొలగించినట్టు తెలియజేశారు. ఆగస్టు మాసంలో అదనంగా రెండో స్లాబ్, అక్టోబర్ 9వ తేదీన మూడో స్లాబ్‌ను అనుమతులను ఉల్లంఘించి వేశారని పేర్కొన్నారు. యజమానులు కోర్టును ఆశ్రయించగా నవంబరు 1వ తేదీన స్టేటస్ కో జారీ అయిందని తెలిపారు. స్టేటస్ ఖో వెకేట్ చేసిన తర్వాత అదనంగా వేసిన రెండు అంతస్థులను కూల్చివేస్తామని డిప్యూటీ కమిషనర్ వి.మమత బుధవారం పంపిన ప్రకటనలో తెలిపారు.
అక్రమ సెల్లార్‌కు
అధికారుల వత్తాసు
అదనంగా నిర్మించిన రెండు స్లాబ్‌లపై చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చిన అధికారులు అక్రమంగా నిర్మించిన సెల్లార్ విషయంపై పెదవి విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఏదో మొక్కుబడిగా అదనపు స్లాబ్‌లకు చిన్నపాటి రంధ్రాలు వేసి వదిలేసిన సంబంధిత అధికారులు తదనంతరం జరిగిన పరిణామాలతో అటువైపు కనె్నత్తి కూడా చూడకపోవడం గమనార్హం. సంబంధిత టిపిఎస్ మరో ముఖ్య అధికారి అండదండలతోటే అక్రమ నిర్మాణ భాగోతం దర్జాగా కొనసాగిందనే ఆరోపణలు ఉన్నాయి. సెలవు రోజున స్లాబ్ వేసుకోవాలని కూడా సదరు అధికారే సలహా ఇచ్చినట్టు తెలిసింది.
మంజీరా రోడ్డులో తరుచూ తిరిగే అధికారులకు ఆ భవనం కనిపించలేదంటే నమ్మశక్యం కాని విషయంగా భావించవచ్చు. స్లాబ్‌లకు రంధ్రాలు వేశామని, సెంట్రింగ్ తొలగించామని చెప్పిన అధికారులకు అనంతరం తిరిగి స్లాబ్‌లు వేయడం, గోడలు కట్టడం, ఇతర పనులు చేసుకోవడాన్ని ఎందుకు నిరోధించలేదనే అనుమానాలు రావడం సహజం. కూల్చివేతలకు వెళ్లినప్పుడు సంబంధిత అధికారి, సిబ్బందిని లక్షల్లో లంచాలు తీసుకుని ఎలా కూల్చివేస్తారని ఎదురు తిరిగినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అడ్డుకోవాలని స్వతహాగా మాకేమీ లేదని, ఫిర్యాదులు రావడంతో తప్పని పరిస్థితిలోనే ఇక్కడికి రావలసి వచ్చిందని, ఏదో కొంత తీసేసినట్టు చేసి వెళ్లిపోతామని, ఆ తర్వాత పనులు చేసుకోండని నిర్మాణదారులను బతిమాలుకున్నట్టు తెలిసింది.
అనుమతి లేని సెల్లార్, రెండు అదనపు అంతస్థులు కట్టుకోవడానికి భరోసా ఇచ్చిన సదరు అధికారులు స్టే వెకేట్ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా తయారైంది. ఈ అక్రమ అంతస్థులు, సెల్లార్ నిర్మాణంపై జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు విచారణ జరిపించి సదరు ముడుపులు పుచ్చుకున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుని, శేరిలింగంపల్లిలో అక్రమ నిర్మాణాలపై కొరఢా ఝుళిపించాలని స్థానికులు కోరుతున్నారు.

మోదీ నిర్ణయం చారిత్రాత్మకం

ఎల్‌బినగర్, డిసెంబర్ 14: పేదరిక నిర్మూలనకు, నల్లధనాన్ని అరికట్టడానికి ప్రధాని నరేంద్రమోదీ దేశంలో నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని, ఈ నిర్ణయం చారిత్రాత్మకమని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వైస్ చైర్మన్ పేరాల శేఖర్‌రావు పేర్కొన్నారు. బుధవారం కొత్తపేట బాబు జగ్జీవన్‌రామ్‌భవన్‌లో యాంటీ టెర్రరిజం ఫోరం(ఎటిఎఫ్) ఆధ్వర్యంలో ‘పెద్ద నోట్ల రద్దు- సమ్మిళిత అభివృద్ధి వైపు పయనం’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పేరాల శేఖర్‌రావు, ఎటిఎఫ్ కన్వీనర్ రావినూతల శశిధర్, ఆర్థిక రంగ నిపుణులు తారక శ్రీనివాసరావు, గ్రేటర్ బిజెపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వి.రాధధీరజ్‌రెడ్డి హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లధనం, అవినీతి, నకిలీనోట్లను కూకటి వేళ్లతో పెకిలించి వేయడంలో భాగంగా బడానోట్లను రద్దు చేస్తూ దేశ ప్రజలు గర్వించే విధంగా ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. తన కుటుంబాన్ని పక్కనబెట్టి తనకు ప్రాణ హాని ఉండవచ్చు అని తెలిసి కూడా దేశ ప్రధాని భారతదేశాభివృద్ధికి, దేశ ప్రజల్లో వెలుగులు నిండాలని ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాన్ని యావత్ దేశ ప్రజలు స్వాగతిస్తున్నా నల్లధనం ఉన్న కొంతమంది బడా నాయకులు దీనిని రాజకీయం చేస్తున్నారని, అలాంటి విద్రో

కిడ్నాప్ అయిన చిన్నారి తల్లిదండ్రులకు అప్పగింత

మేడ్చల్, డిసెంబర్ 14: మేడ్చల్‌లో కిడ్నాప్ అయిన ఓ చిన్నారిని పోలీసులు తల్లితండ్రులకు అప్పగించారు. బుధవారం మేడ్చల్ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పేట్‌బషీరాబాద్ ఎసిపి ఎ. శ్రీనివాస్‌రావు, ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ కిషోర్‌తో చిన్నారి కిడ్నాప్ ఉదంతానికి సంబణధించిన వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా మాన్గులపల్లి మండలం కళ్లెపాలెం గ్రామానికి చెందిన నాంపల్లి శ్రీను 2010 సంవత్సరంలో మేడ్చల్ ప్రాంతానికి బ్రతుకుదెరువు నిమిత్తం వలసవచ్చి మెదక్ జిల్లా కుచారం గ్రామంలోని ఓ ప్రయివేటు పరిశ్రమలో పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పట్టణంలోని వెంకట్రాంరెడ్డినగర్‌లో తన భార్య శైలజ ఇద్దరు కవల పిల్లలు కుమారుడు దిక్షీత్ (18నెలలు), కుతూరు దిక్షీత (18నెలలు)తో కలిసి సురేశ్ అనే వ్యక్తికి చెందిన ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. కాగా 20 రోజుల క్రితం వీరు ఉంటున్న ఇంటి ఎదురు పోర్షన్‌లో చుట్టాకుల శివ, లక్ష్మీ అనే దంపతులు అద్దెకు దిగారు. ఇంటి యాజమాని నగరంలో ఉండటంతో ఆయన అనుమతితోనే శ్రీను దంపతులకు ఇల్లు అద్దెకిచ్చాడు. అద్దెకిచ్చే సమయంలో శ్రీను ఏదేని గుర్తింపు కార్డును ఇవ్వాలని కోరడంతో పాటు ఏమి పని చేస్తావని అడుగగా శివ తాపిమేస్ర్తి పని చేస్తానని తెలిపాడు. ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవని తర్వాత ఇస్తామని చెప్పడంతో శ్రీను సరేనని ఒప్పుకున్నాడు. ఇలా 20రోజులు గడిచిపోయాయి. ఈ క్రమంలో ఇరువురు కుటుంబాలు చాలా స్నేహంగా మెలగాసాగాయి. ఇద్దరి మధ్య బాగా చనువు కూడా పెరిగింది. శివ, లక్ష్మీ.. దిక్షీతను చాలా అప్యాయంగా చూసుకునేవాళ్లు. చిన్నారి పాపను బాగా ఆడించేవారు. కాగా శివ, లక్ష్మీ మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కూరగాయ మార్కెట్‌కు వెళ్లివస్తామని చెప్పి తమతో పాటు దిక్షీతను కూడా తీసుకుని వెళ్తున్నామని తల్లి శైలజకు చెప్పి వెళ్లారు. దంపతులిద్దరూ ఎంతకు తిరిగి రాకపోయేసరికి తీవ్ర ఆందోళన చెందిన శ్రీను, శైలజ అన్ని చోట్లా వారి ఆచూకీ కోసం గాలించినా లాభం లేకపోవడంతో అదే రోజు రాత్రి మేడ్చల్ పోలీసు స్టేషన్‌లో తమ చిన్నారి దిక్షీత కిడ్నాప్‌కు గురైందని ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ కిషోర్ శివ, లక్ష్మీ వివరాలను సేకరించేందుకు వారు అద్దెకుంటున్న నివాసంలో సోదాలు నిర్వహించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. వారి మాట్లాడే యాసను అక్కడి వారితో తెలుసుకుని భార్యభర్తలు కరీంనగర్ జిల్లాకు చెందిన వారిగా నిర్ధారించుకునిన ఓ పోలీసులు బృందాన్ని బుధవారం అక్కడికి పంపించారు. అంతలోనే ఈ విషయాన్ని పోలీసులు మీడియా దృష్టికి తీసుకువచ్చారు. టివిలలో వస్తున్న కథనాన్ని గుర్తించిన మెదక్ జిల్లా తుప్రాన్ పోలీసులు తమ వద్ద ఓ చిన్నారి ఉందని బాలిక ఫొటోను వాట్సప్ ద్వారా మేడ్చల్ సిఐకు పంపించారు. తల్లితండ్రి శ్రీను, శైలజను పిలిపించి చిన్నారి ఫొటోను వారికి చూపించిన తర్వాత తమ గారాలపట్టీ ఇదేనని చెప్పడంతో కథ సుఖాంతమైంది. ఎస్‌ఐ కిషోర్ సిబ్బందితో కలిసి తుప్రాన్ పిఎస్‌కు వెళ్లి చిన్నారిని మేడ్చల్ పిఎస్‌కు తీసుకువచ్చారు. తుప్రాన్ పోలీసులను పాప విషయమై వివరణ కోరగా మంగళవారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బాలాజీ టైలర్ దుకాణం వద్ద పాపను వదిలి ఇప్పుడే వస్తాను చూస్తుండండీ అని చెప్పి వెళ్లి అతను ఎంతకు తిరిగి రాకపోయేసరికి టైలర్ దుకాణ యాజమాని.. చిన్నారిని తీసుకువెళ్లి తుప్రాన్ పోలీసులకు అప్పగించాడు. ఎట్టకేలకు చిన్నారి దిక్షీత క్షేమంగా తలితండ్రుల ఓడికి చేరడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. చిన్నారి చూడగానే తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ చిన్నారి చివరకు తమ వద్దకు చేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నారి కిడ్నాప్ విషయమై మేడ్చల్ పోలీసులు స్పందించిన తీరును ఎసిపి శ్రీనివాస్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. మేడ్చల్ పోలీసుల పని తనాన్ని మెచ్చుకున్న సైబరాబాద్ సిపి వారికి నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. మేడ్చల్ పట్టణంలో తీవ్ర సంచలనం రెకేత్తించిన చిన్నారి దిక్షీత కిడ్నాప్ కేసు ఎట్టకేలకు సుఖాంతమవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పేట్‌బషీరాబాద్ ఎసిపి శ్రీనివాస్‌రావు సూచించారు. అద్దెకు ఇచ్చే సమయంలో వారి వద్ద నుండి కచ్చితంగా గుర్తింపు కార్డులు తీసుకోవాలని కోరారు.
గుర్తుతెలియని వ్యక్తులను అన్ని విధాలుగా నమ్మి మోసపోవద్దని, ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలని అన్నారు. ఎవరికిబడితే వారికి పిల్లలను అప్పజెప్పకూడదని సూచించారు.

నేరరహిత డివిజన్‌గా తీర్చిదిద్దడానికి కృషి
వనస్థలిపురం, డిసెంబర్ 14: మన్సూరాబాద్ డివిజన్‌ను నేరరహిత డివిజన్‌గా తయారు చేయడానికి అన్ని కాలనీలలో సిసి కెమరాల ఏర్పాటు కు తన వంతు కృషి చేయనున్నట్లు కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి తెలిపారు. బుధవారం డివిజన్ పరిదిలోని మన్సూరాబాద్ చౌరస్తాలో కెబిఆర్ కనె్వన్షన్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ప్రారంభోత్సవానికి విఠల్ రెడ్డి, ఎల్బీనగర్ ఇన్‌స్పెపెక్టర్ కాశీరెడ్డి హాజరైనారు. విఠల్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసి ఆర్ ఆదేశాల మేరకు పోలీసులు నేరాలను తగ్గించడానికి చేస్తున్న సిసి కెమరాల ఏర్పాటుకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు. ఎల్‌బినగర్ ఇన్‌స్పెక్టర్ కాశీరెడ్డి మాట్లాడుతూ నేరాలు త్వరగా గుర్తించి దొంగలను పట్టుకోవడానికి సిసి కెమరాలు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. త్వరలో ఆనంద్ నగర్ చౌరస్తానుండి మన్సురాబాద్ వచ్చే రోడ్డులోని ప్రధాన చౌరస్తాలలో దాతల సహకారంతో సిసి కెమరాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కెబిఆర్ కనె్వన్షన్ యజమానులు కొప్పుల జనార్దన్ రెడ్డి, కొప్పుల ప్రేమ్‌కుమార్‌రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ టంగుటూరి నాగరాజు, వార్డు కమిటీ సభ్యులు వల్లపు అరుణ్ కుమార్ యాదవ్, నర్సింహ్మా, రమేష్, బాల్‌రాజు పాల్గొన్నారు.

నేరరహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలి
మేడ్చల్, డిసెంబర్ 14: నేరరహిత సమాజం కోసం ప్రజలంతా పోలీసులకు సంపూర్ణంగా సహకరించాలని ఇటీవల పేట్‌బషీరాబాద్ డివిజన్ ఏసిపిగా బాధ్యతలు చేపట్టిన అందేటి శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్ పిఎస్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పేట్‌బషీరాబాద్ డివిజన్ పరిధిలోని ప్రజలంతా పోలీసులకు నేరాల అదుపునకు పూర్తి సహకారం అందించాలని తాము స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. తమది ఫ్రెండ్లీ పోలీస్ అని ఎలాంటి సమస్యలున్నా తాము చట్టప్రకారం పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్నారు. నేరాల అదుపుతో పాటు దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌ల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు నిర్భయంగా తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసు స్టేషన్‌లకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఎవరికి భయపడాల్సిన అవసరంలేదని చట్టం అందరికీ సమానమని వివరించారు. పేట్‌బషీరాబాద్ డివిజన్ పరిధిలోని ఠాణాలలో సమస్యలు పరిష్కారం కాని పక్షంలో తన దృష్టికి తీసుకురావాలని అయినంత మటుకు పరిష్కరించేందుకు బాధితులకు న్యాయం చేసేందుకు అంకితభావంతో కృషి చేస్తామని పేర్కొన్నారు. పోలీసులు కూడా ప్రజలతో సత్సంబంధాలు కలిగి వారిని మచ్చిన చేసుకుని వారితో అన్యోనంగా మెలగాలని సూచించారు. డివిజన్ పరిధిని నేరరహితంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతామని వివరించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
వనస్థలిపురం: పోలీస్ ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలు, సూచనలను అనుసరిస్తూ తమ పరిధిలోని ప్రజలకు రక్షణకల్పిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం శక్తి వంచన లేకుండ కృషి చేస్తానని వనస్థలిపురం ఏసిపిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వి.రవీందర్ రెడ్డి చెప్పారు. వనస్థలిపురం ఏసిపిగా ఉన్న భాస్కర్ గౌడ్ మహబూబ్‌నగర్ డిఎస్పీగా బదిలీ అయ్యారు. అతని స్థానంలో డిజిపి కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న 1989 బ్యాచ్‌కు చెందిన రవిందర్ రెడ్డికి వనస్థలిపురం ఏసిపిగా పోస్టింగ్ ఇచ్చారు. బుధవారం రవీందర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఎస్‌ఐ, సిఐగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం కరీంనగర్ జిల్లాలో పని చేశానని, ఎసిపిగా నగరంలో ఎస్‌బి విభాగంలో పని చేసినట్లు చెప్పారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రతి కాలనీలలో సిసి కెమరాలు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించడానికి కల్పించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

వ్యవసాయ మార్కెట్ స్థలం జోలికి వస్తే కఠిన చర్యలు
శంకర్‌పల్లి, డిసెంబర్ 14: వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందిన సర్వే నెంబర్ 196/ఎ లోని రెండు ఎకరాల 30గుంటల స్థలాన్ని కాపాడుకోవలసిన బాధ్యత తమకుందని దీన్ని ఎవరైనా కబ్జా చేస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామని శంకర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఒగ్గు మల్లేశం, వైస్ చైర్మన్ దండు రాజేశ్వర్ హెచ్చరించారు. బుధవారం ఎఎంసి కార్యాలయంలో పాలక వర్గం డైరెక్టర్‌లు కార్యదర్శి, భారతీయ కిసాన్‌సంగ్ నాయకులతో కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. సదరు సర్వే నెంబరులో జరుగుతున్న పశువుల సంత వద్దకు నారాయణ నాయక్ (బిడిఎల్) ఉద్యోగి, తదితరులు వచ్చి ఈ స్థలం తమదని రైతులను సిబ్బందిని తీవ్రంగా బెదిరించి దౌర్జన్యం చేసి వెళ్లగొట్టారని తెలిపారు. విషయం తెలిసి వెంటనే పాలకవర్గం వచ్చి వారి ఆగడాలను ఆపినట్లు తెలిపారు. నారాయణ నాయక్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. వాస్తవానికి సర్వే నెంబర్ 196/ఎఎ లో స్టెటస్కో ఉందని కానీ, నారాయణ నాయక్ అతని అనుచరులు సర్వే నెంబర్ 196/ఎ లోని స్థలం రెండు ఎకరాల 32గంటలను కబ్జా చేయడానికి రైతులను, డ్యూటీలో ఉన్న ఏఎంసి సిబ్బందిని బెదిరించి దౌర్జన్యం చేయడాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని, వారి బెదిరింపులకు భయపడమని హెచ్చరించారు. విషయాన్ని వెంటనే మంత్రి హరీష్‌రావుకు ఫోన్ చేసి చెప్పగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. గుడిమల్కాపూర్ వైస్ చైర్మన్ డి.వెంకట్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు ప్రదీప్‌కుమార్, శంభారెడ్డి, విజయ్, కన్నా తదితరులు తమ వెంట పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు కూడా సీరియస్‌గా తీసుకొని నాయక్‌పై కోపంగా ఉన్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితిలో కూడా స్థలాన్ని వదిలే పరిస్థితి లేదని సమావేశంలో పాల్గొన్న సర్పంచ్ శ్రీ్ధర్, పాలకవర్గం డైరెక్టర్‌లు తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం నాయక్ తదితరులు చేసుకున్న దరకాస్తులను నిరాకరించినట్లు సర్పంచ్ తెలిపారు. పాలక వర్గం రైతుల కోసం పశువుల సంతను నిర్వహిస్తున్నామని ప్రభుత్వ స్థలాన్ని కాపాడే విషయంలో మండల ప్రజలు కూడా సహకరించాలని చైర్మన్ మల్లేశం, రాజేశ్వర్‌లు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు నర్సింలు, గణేష్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, అబ్దుల్ ఖదీర్, రజిని శ్రీనివాస్, తెలుగు శ్రీనివాస్, గుండ సూర్యం, భారతీయ కిసాన్ రైతు సంఘం నాయకులు యం.రాంరెడ్డి, పాండురంగం, ప్రకాష్‌చారి, బుచ్చిరెడ్డి, మల్లారెడ్డి, భూపతిరెడ్డి, గోపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

‘బంగారు తెలంగాణకు పాటుపడదాం’

శామీర్‌పేట, డిసెంబర్ 14: ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి, ఎందరో బలిదానాలతో రాష్ట్రం తెచ్చుకున్నామని, బంగారు తెలంగాణ తయారు చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. శామీర్‌పేట మండల సర్వసభ్య సమావేశం బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపిపి అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వివిధ సంక్షేమ పథకాలు అందజేయడం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకంలోభాగంగా పేదవారికి ఆర్థిక సహాయం అందజేయడంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలను తీసుకొని చెరువులను అభివృద్ధి పర్చడంతో చెరువులు నిండి ఇంటింటా నళ్లా నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో ప్రజలు కొంత మేరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీని ఫలితం చివరకు మంచిగానే ఉంటుందని దీంతో ప్రజలందరు ఉపయోగపడుతారని అన్నారు. నగదు రహిత లావాదేవీలను చేపట్టే దిశగా తెలంగాణ ముందుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ నగదు రహిత రాష్ట్రంగా చేసేందుకు నడుం బిగించారని అన్నారు. మండల పరిషత్ పరిధిలో అభివృద్ది కార్యక్రమాలను విస్తత్రంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే సహకారంతో మరింత ముమ్మరం చేపడుతున్నట్లు ఎంపిపి చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. మారుమూల గ్రామాల్లో నీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక నిధులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలో రవాణా సౌకర్యం సరిగ్గాలేదని ఈ విషయాన్ని అనేక మార్లు ఆర్టీసీ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని సభ్యులు ఆర్టీసీ అధికారులపై చిర్రుబుర్రులాడారు. మండల పరిషత్ సమావేశానికి సంబంధిత డిపో మేనేజర్ హాజరుకావాలని నియమం ఉన్నప్పటికీ అనేక మార్లు గైర్వాజరవుతూ తమ కింది స్థాయి అధికారులను మండల పరిషత్ సమావేశాలకు పంపుతున్నారని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. డిపో మేనేజర్ పరిధిలో రవాణా సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇరిగేషన్ శాఖ పరిధిలో నిధులు ఉన్నప్పటికీ ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నామని ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే నిధులను వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతామని ఎంపిపి తెలిపారు. జడ్పీటిసి బాలేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాణ, ఎండిఒ జ్యోతి, తహశీల్దార్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.