రంగారెడ్డి

బహుళ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, డిసెంబర్ 24: మేడ్చల్ జోనల్ పరిధిలో హెచఎండిఏ అధికారులు అనుమతులకు మించి నిర్మిస్తున్న బహుళ భవనాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బాచుపల్లి మండల పరిధిలోని నిజాంపేట్, ప్రగతినగర్ గ్రామాలలో పదుల సంఖ్యలో బహుళ భవనాల గోడలను కూల్చివేశారు. నిజాంపేట్ గ్రామంలో దాదాపుగా పది రోజుల నుండి అనుమతులకు మించి అక్రమంగా నిర్మించిన భవనాలను హెచ్‌ఎండిఎ, గ్రామ పంచాయతీ అధికారులు గోడలను కూల్చివేశారు. అయితే సోమవారం నుండి బాచుపల్లి గ్రామంలో హెచ్‌ఎండిఏ, గ్రామ పంచాయతీ అధికారులు ఈనెల 31వరకు వరుసగా కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే గ్రామంలో ఇప్పటికే హెచ్‌ఎండిఎ అధికారులు పది బహుళ నిర్మాణాలను గుర్తించి నోటీసులను సైతం జారీ చేశారు. సోమవారం నుండి పది అక్రమ నిర్మాణాలను కూల్చివేయనున్నారు. అయితే గ్రామంలో కేవలం పది మాత్రమే గుర్తించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో సాయి అనురాగ్ కాలనీ, ఆర్టీసి కాలనీ, జయదీపిక, కెకెఎం కాలనీ, మా విల్లాస్, సాయి పూజిత కాలనీల్లో విచ్చల విడిగా అనుమతులకు మించి బహుళ భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇటీవల నిజాంపేట్, ప్రగతినగర్ గ్రామాలలో కొనసాగుతున్న కూల్చివేతలతో అలర్ట్ అయిన నిర్మాణదారులు సాయి అనురాగ్ కాలనీ, ఆర్టీసి కాలనీల్లో ముందస్తుగానే భవనాలకు పెయింటింగ్‌ను వేసుకుని పాత భవనాలని నమ్మించే పనిలో కొందరు పడ్డారు. గ్రామంలో కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలు, గ్రామ పంచాయతీ సహకారంతో బహుళ భవనాలను నిర్మించినా ఎవరూ పట్టించుకోరనే ధీమాతో యథేచ్ఛగా నిర్మాణాలను కొనసాగించడం విశేషం. అయితే హెచ్‌ఎండిఎ అధికారులు గుర్తించిన భవనాలు మాత్రమే కూల్చివేస్తారా..? లేక అనుమతులకు మించి నిర్మిస్తున్న భవనాలన్నింటిని వరుసగా కూల్చివేస్తారా అన్న వేచి చూడాల్సిందే.

నేరేడ్‌మెట్: క్రిస్‌మస్ సంధర్భంగా మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని నేరేడ్‌మెట్, వినాయకనగర్, జెజెనగర్, డిఫెన్స్‌కాలనీ, నిర్మల్‌నగర్, వౌలాలి, భరత్‌నగర్, ఆర్‌టిసికాలనీ, ప్రశాంత్‌నగర్, సాయినాథపురం, తిరుమలనగర్ ప్రాంతాలలో చర్చిలను నిర్వాహకులు ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చిలను అలకరించారు. క్రిస్‌మస్ సందర్భంగా ఆదివారం చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్‌ను పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఇబ్రహీంపట్నం: క్రైస్తవుల అతిపెద్ద పండుగైన క్రిస్మస్ వేడుకలను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆదివారం జరిగే క్రిస్మస్ వేడుకలకు సంబంధించి చర్చిల ఫాస్టర్లు చర్చిల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రైస్తవు సోదరులు కూడా తమ ఇళ్లను అలంకరించుకున్నారు. విద్యుత్ దీపాలు, ఇళ్లపై స్టార్‌లను ఏర్పాటు చేసుకొని ఇళ్లలో క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని గిల్గాల్, గ్రగోరియస్, వౌంట్ సియోస్ గాస్పల్, మంగళ్‌పల్లి గేటు సమీపంలోని చర్చిల్లో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.