రంగారెడ్డి

మైసమ్మ బోనాలలో అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, జనవరి 11: మైసమ్మ బోనాలు పండుగలో అపశృతి చోటు చేసుకుంది. బోనాల ఏర్పాట్లతో భక్తులను క్రమబద్దీకరించేందుకు ఏర్పాటు చేసిన రేయిలింగ్ కూలి ఓ మహిళ మృతిచెందిగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. 13 మందికి గాయాలు తగిలాయి. కొందరు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంత మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన వికారాబాద్ జిల్లా దోమ మండల మోత్కూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. దోమ మండలం మోత్కూర్‌లో మైసమ్మ బోనాలు పండగను జరుపుకుంటున్నారు. గ్రామస్థులే కాకుండా బంధువులను సహితం పిలిపించుకున్నారు. గ్రామ మధ్యలో మైసమ్మ దేవాలయం ఉంది. దేవాలయం దగ్గర బోనాలు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థులు అందరూ మైసమ్మ దేవాలయం దగ్గరికి చేరుకున్నారు. దేవాలయం చుట్టూ ప్రజలు కిక్కిరిసిపోయారు. దేవాలయం పక్కన ఉన్న కటికే గోపాల్ ఇంటిపైకి కొంత మంది మహిళలు ఎక్కి దేవాలయం దగ్గర జరుగుతున్న వేడుకలను చూస్తున్నారు. ఇంటిపై ఉన్న మహిళలు అందరూ రేయిలింగ్‌కు ఆనుకున్నారు. రెయిలింగ్ బరువు ఏక్కవ కావడంతో ఒక్కసారిగ రీలంగ్ కూడ కిందకి పడి పోయింది. రెయిలింగ్ గోడకు ఆనుకుని ఉన్న మహిళలందరూ బిల్డింగ్‌పై నుంచి కింద పడినారు. రాములమ్మ(42) మహిళ తల పగిలి మృతి చెందింది. చెన్నమ్మకు తీవ్ర గాయాలు తగిలాయి.
పరిస్థితి విషమంగా ఉంది. సాయిలమ్మ(32), లావణ్య (25), వెంకటమ్మ (60), మహేశ్వరి (55), అనురాధ (20), లక్ష్మీమ్మ (40), లక్ష్మీబాయి (55), లక్ష్మీబాయి, సుజాత (45), అనంతమ్మ (28), సుగుణబాయి (50), బాలమణి (40) గాయపడ్డారు. కొంత మందిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు.
* బాధిత కుటుంబానికి రూ.2లక్షల పరిహారం
బోనాల పండుగలో పాల్గొని మృతిచెందిన రాములమ్మ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రెండు లక్షల రుపాయలు పరిహారం అందిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. మోత్కూర్‌లో జరిగిన సంఘటన తెలుసుకున్న మంత్రి మహేందర్ రెడ్డి పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరమార్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.