రంగారెడ్డి

రూ.10 లక్షల విలువైన పంచలోహ విగ్రహాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జనవరి 11: పంచలోహ విగ్రహాలను అపహరించి తప్పించుకుని తిరుగుతున్న ముగ్గురు అంతర్ జిల్లా ముఠాను రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ జోన్‌పోలీసులు అరెస్ట్ చేసి వారిని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద పది లక్షల విలువ గల పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్ డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి తఫ్సీర్ ఇక్బాల్ తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఐ.శివరామ్(30) ఉప్పునూతల మండలానికి చెందిన మెడపు నాగరాజు అలియాస్ రాజు(20) అచ్చంపల్లి, జూబ్లీనగర్‌కు చెందిన రుద్రాక్షల శివ కుమార్ (20) కలిసి మంగళవారం సాయంత్రం సాగర్ రోడ్డు నుండి బిఎన్ రెడ్డి నగర్ వైపు వెళుతున్నారు. అదే సమయంలో వనస్థలిపురం, ఎల్బీనగర్ సిసిఎస్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చి వీరిని అదుపులోకి తీసుకోగా వీరివద్ద పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారించగా నల్గొండ జిల్లా డిండి గ్రామ సమీపాన ఉన్న లక్ష్మీ నరసింహ్మ స్వామి దేవాలయంలోని పంచలోహ విగ్రహాలను అపహరించి అమ్మటానికి తెస్తున్నట్టు పోలీసులకు వెల్లడించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్టు డిసిపి తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి జానకి, ఎల్బీనగర్, వనస్థలిపురం ఏసిపిలు వేణుగోపాల్ రావు, వి.రవీందర్ రెడ్డి, వనస్థలిపురం సిఐ మురళీకృష్ణ, ఎస్‌ఐలు నాగార్జున, మహేష్ గౌడ్ పాల్గొన్నారు.

అనుమానాస్పదంగా చెలరేగిన మంటలు
దిల్‌సుఖ్‌నగర్,జనవరి 11: కర్మన్‌ఘట్ సాయిరామ్ నగర్ కాలనీలోని ఓ నివాస గృహంలో అనుమానాస్పదంగా మంటలు చేలరేగిన సంఘటన సరూర్‌నగర్ పోలిస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివిరాల ప్రకారం.. కర్మన్‌ఘాట్ పరిదిలో సాయిరామ్‌నగర్‌లో నివాసముంటున్న పెరుమాల్ల పరుశరిమ్‌రెడ్డి వృత్తిరీత్య వంట నూనెల విక్రయ కమిషన్ ఏజెంట్‌గా వ్యాపారం నిర్యహిస్తున్నాడు. తనకు రెండు అంతస్తుల సొంత భవనం ఉంది. మొదటి అంతస్తులో తాను నివాసముంటూ క్రింది ఫ్లోర్‌లో వంటనూనెల విక్రయ ఏజెంట్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. రోజులాగే మంగళవారం సాయంత్రం కార్యాలయాన్ని మూసివేశారు. బుధవారం తెల్లవారుఝామున కాలనీవాసులంతా ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున్న శభ్దాలు వెలువడ్డాయి. దీంతో అందరూ నిద్రలోంచి మేల్కొని శబ్ధం ఎక్కడ నుంచి వచ్చిందని పరిశీలించారు. వంట నూనెల విక్రయ కమీషన్ కార్యాలయం నుంచి వచ్చిందని గుర్తించారు. పెద్ద ఎతన పేలుడు జరిగిప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఆ కార్యాలయంలో ఉన్న గ్యాస్ సిలిండర్, ఫ్రిజ్‌కు ఉన్న గ్యాస్ సిలిండర్లు ఎప్పటిలాగే మాములు స్థితిలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని స్థానికులు 100 నెంబరుకు ఫోన్ చేసి వివరించారు. సమాచారం అందుకున్న పోలిసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటనస్థలాన్ని పరిశిలించారు. గ్యాస్ లీక్ అవ్వకుండానే పేలుడు జరుగడం అనేక అనుమానాలకు తావునిస్తుంది. ఇంట్లో ఏమైన పేలుడు పదార్థులు నిల్వ ఉంచారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పేలుడు దాటికి ఇంట్లోని ఐదు తలుపులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రక్కింటి తలుపులు సైతం దెబ్బతిన్నాయి. అక్కడే పడుకున్న వాచ్‌మెన్ హరిదయాల్‌కు పేలుడుతో తలకు గాయమైంది. ఘటన స్థలాన్ని ఎల్‌బినగర్ డిసిపి తప్సిర్ ఎక్బాల్, ఏసిపి వేణుగోపాల్, సరూర్‌నగర్ సిఐ లింగయ్య పరిశీలించారు. ఘటనాస్థలాన్ని డాగ్ స్క్వాడతో తనికి చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఫిబ్రవరి 15న పౌష్టికాహార ధాన్యాల పంపిణీ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం
వికారాబాద్, జనవరి 11: అంగన్‌వాడీ, రేషన్ దుకాణాల్లో కొర్ర, సామ, రాగి, జొన్న పౌష్టికాహార ధాన్యాల పంపిణీ పైలెట్ ప్రాజెక్టును ఫిబ్రవరి 15న ప్రారంభిస్తామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కొర్ర, సామ, రాగి, జొన్నల సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పౌష్టికాహార లోపాలను నివారించడానికి జిల్లాలోని పరిగి, దౌల్తాబాద్, బొంరాస్‌పేట్, దోమ మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామని చెప్పారు. వాసన్ ప్రభుత్వేతర సంస్థ సమన్వయంతో జిల్లాలో పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి అంగన్‌వాడీ కేంద్రాలలో, రేషన్ షాపుల్లో కొర్ర, సామ, రాగి, జొన్నలను పైలెట్ ప్రాజెక్టు నాలుగుమండలాల్లో అమలు చేస్తామని పేర్కొన్నారు. సిడిపివోలు గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాలలో బియ్యం స్థానంలో జొన్న, రాగులు, కొర్రలను ప్రత్యామ్నాయంగా వినియోగించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో సర్పంచుల సహకారం తీసుకుని వీటిపై సూచనలు, శిక్షణలు ఇవ్వాలని తెలిపారు. మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రత్యేకంగా మిల్లెట్ ఫెస్టివల్ వంటివి నిర్వహించాలని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు నేరుగా తృణ ధాన్యాలు చేరేలా జిల్లా సంక్షేమ, పౌర సరఫరాలు, మార్క్‌ఫెడ్‌లు కలిసి ఒక కమటీగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కొత్తమెనూ ప్రారంభించడానికి విలేజ్ ఆర్గనైజేషన్ కమిటి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం పరిగి, దౌల్తాబాద్, బొంరాస్‌పేట్ మండలాల్లో ఒక్కో మండలానికి రెండు రేషన్ షాపుల్లో ఆహారభద్రత ద్వారా జొన్నలను ఎనిమిది కిలోల చొప్పున ప్రతి కుటుంబానికి అందేలా పైలెట్ ప్రాజెక్టు అమలు చేయాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. స్థానికంగా జొన్నలు, రాగులు, కొర్రలను పండించే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల సమస్యలు, ఆత్మహత్యలు నివారించడానికి వర్షాధార భూముల్లో కరవు నెలకొన్నపుడు బోర్‌వెల్ షేరింగ్ వంటి వినూత్న పద్ధతులను అవలంబించాలని పేర్కొన్నారు. ఒకే రకమై పంట కాకుండా వివిధ రకాలైన పంటలను సాగు చేసే విధంగా మండల వ్యవసాయ అధికారులు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. రైతులకు స్థానికంగా అవసరమైన సదుపాయాలు, యంత్రీకరణ వంటి ఆధునిక పద్దతులను పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అవసరమైన పనులు, ఫామ్ పాండ్‌ను డ్వామా సహకారంతో రైతులు వినియోగించుకునేలా చర్యలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు కింద 100 తండాలలో వెయ్యి ఎకరాలలో రైతులకు కావాల్సిన సదుపాయాలను కలిపించాలని, మొదటి దఫా 50 తండాలలో 800 ఎకరాల్లో సౌకర్యాలు కల్పించి మార్పు తీసుకుని వచ్చే విధంగా వాపస్ స్వచ్చంద సంస్థ సహకారంతో ఫిబ్రవరి 15 నుండి అమలు చేస్తామని వివరించారు. జెసి సురేష్‌పొద్దార్, సబ్‌కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, డిఆర్‌డివో జాన్సన్, జిల్లా సంక్షేమ అధికారి సునంద, డిసిఎస్‌వో పద్మజ, వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ఉద్యానశాఖ అధికారి సంజయ్‌కుమార్, వాసన్ స్వచ్చంద సంస్థ ప్రతినిధులు రవీంద్ర, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీల సందడి
రాజేంద్రనగర్, జనవరి 11: సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, పార్టీ కార్యాలయాల్లో ముగ్గుల పోటిలు సందడిని సంతరించుకుంది. సంప్రదాయాలు, సంస్కృతికి అద్ధం పట్టే విధంగా రకరకాల రంగురంగుల ముగ్గులు వేసి ఆకర్శించారు.
పయనీర్ కానె్సప్ట్ స్కూల్లో ..
సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని కాటేదాన్ మణికంఠహిల్స్‌లోని పయనీర్ కానె్సప్ట్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో హరిదాసు, గంగిరెద్దు, జంగమాలుగా వేషం వేసి గంగిరెద్దులతో భిక్షాటన చేస్తూ అందరినీ ఆకర్శించారు. చిన్న పిల్లలకు బోగి పండ్లను పోసి పండుగను జరుపుకున్నారు. వేడుకల్లో పాఠశాల కరస్పాండెంట్ ప్రమోద్‌రెడ్డి పాల్గొన్నారు.
సాయిగ్రామర్ స్కూల్లో..
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పద్మశాలిపురం సాయికాలనీలోని సాయి గ్రామర్ హైస్కూల్లో బుధవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పండుగ ప్రాధాన్యత ఉట్టిపడేలా రంగురంగుల ముగ్గులు వేసి విద్యార్థులు పలువురిని ఆకట్టుకున్నారు. ముగ్గులు వేసి ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెట్టి అలరించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ ఏపి చారి, ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మి, ఉపాధ్యాయులు సునిత, సత్య, ఉషా, ఎంబి నాయక్, సంజయ్ పాల్గొన్నారు.
రామకృష్ణ విద్యాలయంలో..
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని మధుబన్‌కాలనీలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో సంక్రాంతి సంబరాలను విద్యార్థులు జరుపుకున్నారు. భోగి మంటలు పెట్టి పాలుపొంగించి సంక్రాంతి ఉత్సవాలు రెండు రోజుల ముందే జరుపుకున్నారు. గాలిపటాలను విద్యార్థులు స్వతాహగా తయారు చేసి ఎగురవేసి పండుగను జరుపుకున్నారు. పలురకాల ముగ్గులు రంగులు నింపారు. విద్యార్థులు వివిధ వేషాధారణాలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. వేడుకల్లో పాఠశాల కరస్పాండెంట్ బొల్ల శ్రీనివాస్, డైరెక్టర్లు బొల్ల రాజేశ్వరి, ప్రిన్సిపల్ సునిల్ కుమార్ పాల్గొన్నారు.
పండుగలు సంస్కృతి,
సంప్రదాయాలకు ముఖచిత్రం
భారతీయ సంస్కతి, సంప్రదాయాలకు పండుగలు ముఖచిత్రంగా నిలుస్తాయని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. శివరాంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాగృతి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటిల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముగ్గుల పోటిల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. భారతదేశం పలు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని అన్నారు. ఇంటి ఆవరణలో వేసే ముగ్గులతో ఇంటి పరిసర ప్రాంతాల్లో నిండైన సౌందర్యం వస్తుందన్నారు. మహిళలు ముగ్గుల వేయడం అనాదిగా వస్తున్న ఆచారమని చెప్పారు. మహిళలు ముగ్గులు వేసేందుకు ఎంతో ఆసక్తిని కనబరుస్తారని గుర్తు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు మహిళలను ప్రోత్సహించేందుకు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. రాజేంద్రనగర్ కార్పొరేటర్ కోరణి శ్రీలత, జాగృతి నాయకులు లక్ష్మి, అక్కిరాజు రాధేశ్యాం, కాశిగారి యాదగిరి, బండారి శంకర్, పోరెడ్డి ధర్మారెడ్డి, అడికె శ్రీశైలం, యు.విజయ్‌కుమార్, ఎల్లప్ప, సరికొండ వెంకటేష్ పాల్గొన్నారు.

జాబ్‌మేళాకు అనూహ్య స్పందన
మేడ్చల్, జనవరి 11: మేడ్చల్ మండలం మైసమ్మగూడ పరిధిలోని నర్సింహ్మరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళా కార్యక్రమానికి విద్యార్థుల నుంచి అనూహ్యమైన స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఫ్రెషర్స్ జాబ్ ఫెయిర్ నర్సింహ్మరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా నిర్వహించిన జాబ్‌మేళాకు రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ఆరు వేల మంది విద్యార్థులు హజరయ్యారని పేర్కొన్నారు. 40కిపైగా పేరు ప్రఖ్యాతులుగాంచిన బహుళజాతి కంపెనీలు జాబ్‌మేళాలో పాలుపంచుకున్నాయని వివరించారు. ఆయా కంపెనీలు నిర్వహించిన నైపుణ్య పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 1800 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ప్లేస్‌మెంట్ సాధించారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విద్యార్థులు జాబ్‌మేళాలో పాల్గొన్నారని వివరించారు. కళాశాల ప్రాంగణమంతా సందడి నెలకొంది. ఎక్కడా చూసినా విద్యార్థులు గుంపులుగుంపులుగా కిక్కిరిసిపోయి కన్పించారు. జాబ్‌మేళాను ప్రారంభించిన కళాశాల చైర్మన్ జక్కుల నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని అకాంక్షించారు. నర్సింహ్మరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో భవిష్యత్తులో మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. కాలేజీలో విద్యార్థులకు అన్ని మూళిక సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు కళాశాల తరఫున ఉద్యోగాలు సాధించినట్లు వివరించారు. జాబ్‌మేళా నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ త్రిలోక్‌రెడ్డి, ప్లేస్‌మెంట్ అధికారి హన్మంతరావు, ప్రిన్సిపాల్ సిఎన్‌వి శ్రీ్ధర్ పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలాల్లో వెలసిన కబ్జాలను తొలగించాలి: మేయర్
కుషాయిగూడ, జనవరి 11: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా తలపెట్టిన డబుల్ బెడ్‌రూమ్ పథకాల హామలు ప్రభుత్వ భూమిని సమాకూర్చలని గ్రేటర్ మేయర్ బోంతు రామ్మోహాన్ రెవెన్యు అధికారులను అదేశించారు. కాప్రా సర్కిల్ కార్యాలయంలో డిప్యూడి కమీషనర్ సరోజ అధ్యక్షతన గ్రేటర్ మేయర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈసందర్భాంగా విలేకర్లతో రామ్మోహాన్ మాట్లాడుతూ కాప్రా మండలం పరిధిలో జమ్మిగడ్డ, ఆదర్శనగర్, కాప్రా చెరువు, సాయిరాంగనర్, సాయిబాబానగర్, సాధనవిహార్, జీఆర్‌రెడ్డినగర్, చర్లపల్లి చెరువు ప్రాంతంలోని ప్రభుత్వ స్ధలాలను గుర్తించి సరిహాద్దు రాళ్ళు ఏర్పాటు చేయలని సూచించారు. జమ్మిగడ్డ, ఆదర్శనగర్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని కబ్జాదారులుపైన క్రీమినల్ కేసులు నమోదు చేయలని రెవెన్యు అధికారులకు అదేశాలు జారీ చేశారు. సాయిబాబానగర్‌లోని 710 సర్వే నెంబర్‌లో ఎంత ప్రభుత్వ భూమి ఉందని దాన్ని గుర్తించి గ్రేటర్ అధికారులకు అప్పగిస్తే వెంటనే డబుల్‌బెడ్‌రూ ఇళ్ళ నిర్మిణం చేస్తామని అధికారులకు సూచించారు. భావన ఋషి సోసైటీ సభ్యులపై ల్యాండ్‌గ్రాఫింగ్ కేసు నమోదు చేయలని తహాశీల్ధార్ ఉపేందర్‌రెడ్డి అదేశాలు జారీ చేశారు. భావన హోసింగ్ సోసైటీ సర్వే నెంబర్లలో ఏలాంటి వివాదలు ఉన్నాయని వాటి వెంటనే కోర్టులో తెల్చుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ స్ధలాలో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించి ఇళ్ళను కోల్పోన బాధితులకు మొదటి ప్రాధాన్యతగా డబుల్ బెడ్‌రూమ్‌లో ఆవకాశం కల్పిస్తామని తెలిపారు. గ్రేటర్ పరిధిగా కాప్రా మండలంలోనే రికార్డులో ప్రభుత్వ భూమి ఉందని వాస్తవానికి పూర్తిగా కబ్జాల గురైన అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కబ్జాలకు పాలుపడిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని అధికారులక అదేశించారు. కాప్రా సర్కిల్ పరిధిలో ప్రభుత్వ స్ధలాలు సాధన విహార్, కాప్రా చెరువుఎఫ్‌టిఎల్ అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులకు సూచించారు.నిర్మాణాల తొలగింపులో కబ్జాదారులు అడ్డుపడితే పోలీసుల సహాయంతో పూర్తిగా తొలగించి ప్రభుత్వ బోర్డులను ఏర్పాటు చేయలని అదేశించారు. ఈసమీక్షా సమావేశంలో ఇన్‌చార్జీ తహాశీల్ధార్ ఉపేందర్‌రెడ్డి, గ్రేటర్ హోసింగ్ ఈఈ సిద్ధార్ధ, డిఇ నారాయణ, ధర్మారెడ్డి, సర్వేయర్ నూకరాజు, జగదీష్, కాప్రా ఇంజనీరింగ్ ఈఈ దత్తుపంతు, బాలకృష్ణ, కోటేశ్వర్‌రావు, టౌన్‌ప్లానింగ్ ఎసిపి సంతోష్‌కుమార్, శ్రీనివాస్, సత్యలక్ష్మీ, కార్పొరేటర్ పావనిరెడ్డి, నాయకురాలు మణేమ్మ, సరోజ, ప్రభాకర్‌రెడ్డి నాగిళ్ళ బాల్‌రెడ్డి, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణంలో లక్ష్యాలను అధిగమించాలి
వికారాబాద్, జనవరి 11: మరుగుదొడ్ల నిర్మాణాల్లో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంపిడివో, ఇవోఆర్‌డిలతో మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్లు నిర్మించుకునేవారు ఎంపిడివోలతో తప్పనిసరిగా మంజూరు తీసుకోవాలని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు అర్హత కలిగిన వారికి స్ర్తినిధి నుండి రుణాలను అందించాలని పేర్కొన్నారు. మరుగుదొడ్లను నాణ్యతతో నిర్మించాలని స్పష్టం చేశారు. నిర్మించుకున్న వారికి త్వరలో డబ్బులు వచ్చేలా చూడాలని తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన వాటికి యుసిలను వెంటనే అప్‌లోడ్ చేయాలని అన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తీర్చుదిద్దుకుంటున్న కరీంపూర్ గ్రామంలో ఉన్న పాఠశాల, అంగన్‌వాడి కేంద్రంలో మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ గ్రామాల్లో అర్హులైన వారికి స్ర్తినిధి ద్వారా రుణాలు అందించాలని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణాల ఆవశ్యకతపై కళాజాత ద్వారా ప్రచారం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రీన్‌బుక్ ఉంచాలని, డంపింగ్‌యార్డుల నిమిత్తం స్థలాలను గుర్తించి కేటాయించాలని ఆదేశించారు. సమీక్షలో డిఆర్‌డివో జాన్సన్, గ్రామీణ నీటి సరఫరా ఈఈ ఆంజనేయులు, ఎంపిడివో, ఇవోఆర్‌డిలు పాల్గొన్నారు.

కాంట్రాక్టు లెక్చరర్ల సమ్మెకు మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ ర్యాలీ
మేడ్చల్, జనవరి 11: ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం పదవ రోజుకు చేరడంతో వారికి మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను నుండి ప్రారంభించి మేడ్చల్ బస్సు డిపో వరకు నిర్వహించారు. కాంట్రాక్టు లెక్చరర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వం బేషజాలకు పోకుండా ఒప్పంద అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోని పరీక్షల కాలం సమీపిస్తునందున సమ్మె నిర్వహిస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల ముందు కెసిఆర్.. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీరిస్తామని చెప్పిన హమీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాలలో ఆయా సబ్జెక్టుల సంబంధించిన లెక్చరర్లు లేకపోవడంతో 20రోజులుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివ