రంగారెడ్డి

నోట్లరద్దుపై ప్రజలను చైతన్యం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, జనవరి 25: ప్రభుత్వం నోట్లు రద్దు చెయ్యటంతో ప్రజలు పడుతున్న కష్టాలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపైన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో త్వరలో సమావేశం నిర్వహిస్తున్నట్టు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బుధవారం కంటోనె్మంట్‌లోని జయలక్ష్మీగార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం అభివృద్ధి కాగితాలపైనే ఉందని, రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం పెద్దగా చేసింది ఏమీలేదని, అన్ని ప్రాంతాల్లో మోడల్‌గా పనులు చేసి మాయచేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకం ఇప్పటివరకు అమలు చెయ్యటం లేదని విమర్శించారు. కొత్తగా మైనారిటీలకు తీసుకు వస్తామన్న రిజర్వేషన్‌ల ప్రక్రియ ఇంకా అధ్యయనం స్థాయిలోనే ఉందని, ప్రజావ్యతిరేక కార్యక్రమాలపైన గ్రామాలు యూనిట్‌గా తీసుకుని ధర్నాలు చేసి ప్రజలపక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని వివరించారు.
ప్రతి అంశాలను ప్రజలకు గ్రామస్థాయి నాయకులు, వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, మండల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్‌లు, చైర్మన్‌లతో సమావేశం ఏర్పాటు చేసి ప్రజాసమస్యలపైన చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, శాసనమండలి సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, నాయకులు పల్లె లక్ష్మణ్ గౌడ్, మల్కాజిగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి నందికంటి శ్రీ్ధర్, కంటోనె్మంట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్యారగాని శ్యాంకుమార్, పిసిసి అధికార ప్రతినిధి క్రిషాంక్‌తోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వికారాబాద్ జిల్లా ఎస్పీ
నవీన్‌కుమార్‌పై బదిలీ వేటు

వికారాబాద్, జనవరి 25: పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వికారాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి.నవీన్‌కుమార్‌పై ఎట్టకేలకు బదిలీవేటు పడింది. ఆయన వచ్చినప్పటి నుండి హోంగార్డుల వ్యవహారం మొదలు, మొన్నటి హత్య కేసులో హంతకులను తప్పించారంటూ పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. అందులో భాగంగా రాష్ట్ర డిజిపి కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని నవీన్‌కుమార్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. వికారాబాద్ జిల్లాకు కొత్త ఎస్పీ వచ్చే వరకు ఇంచార్జి ఎస్పీగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. గత ఏడాది మే నెలలో బాధ్యతలు స్వీకరించిన నవీన్‌కుమార్ ఎనిమిది నెలలకు మించకుండానే బదిలీ అయ్యారు.

ఓటుహక్కుపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి
ఉప్పల్, జనవరి 25: ప్రభుత్వ ఉద్యోగులు ఓటుహక్కుపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) కార్యదర్శి అరుణ కుమారి అన్నారు. ఏడవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం తార్నాకలోని హెచ్‌ఎండిఏ కార్యాలయంలో ఓటుహక్కు వినియోగించడంపై ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయించడానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయాలంటే ప్రతి ఒక్కరు విధిగా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల శాతం తక్కువగా ఉంటుందని, నిరక్షరాస్యుల కంటే చదువుకున్న వారే ఓటుహక్కును వినియోగించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్డీఓగా పనిచేసినపుడు 92.9శాతం ఓటింగ్ జరిగిందనే విషయాన్ని గుర్తుచేశారు. ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రభుత్వంతో పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు వేసే ప్రక్రియ అని, అభ్యర్ధులెవరికీ ఓటు వేసే ఇష్టం లేకపోతే ఆ విషయంపై స్పష్టం చేసే నోట్ బటన్ ఒత్తాలని, కానీ ఓటింగ్ ప్రక్రియలో మాత్రం తప్పనిసరిగా పాల్గొనాలని నొక్కి చెప్పారు. కార్యక్రమంలో మెంబర్ ఎస్టేట్ రాజేషం, పిఆర్‌ఓ కృష్ణ పాల్గొన్నారు.
మేడిపల్లిలో..
మేడిపల్లి తహశీల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ సంతోష్‌లాల్, విఆర్‌ఓ కుమార్, ఉద్యోగులు మల్లయ్య, పావని, రమాదేవి, శైలజ, కవిత పాల్గొన్నారు.
ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో
జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏడవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉద్యోగులతో కలిసి ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు.
బొంరాస్‌పేటలో..
బొంరాస్‌పేట: ఏడవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఉన్న ప్రాముఖ్యాన్ని యువతకు, ప్రజలకు అవగాహాన కల్పించారు. తహశీల్దార్ వెంకటయ్య బొంరాస్‌పేటలో జరిగిన ఓటర్ల దినోత్సవంలో పాల్గోని కొంత మంది యువకులకు ఓటరు గుర్తింపుకార్డులను అందజేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు ఓటరు కార్డు కోసం ధరాఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధంలా పనిచేస్తుందని, మంచి వారిని ఎన్నుకునే అవకాశం ఓటుతోనే సాధ్యమని అన్నారు.
జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలో
మేడ్చల్ విద్యార్థినికి మొదటి బహుమతి
మేడ్చల్: జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కాప్రా ప్రాంతంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలో మేడ్చల్ పట్టణంలోని నాగార్జున టాలెంట్ స్కూల్‌కు చెందిన సిహెచ్ శ్రీహర్ష అనే విద్యార్థిని ప్రథమస్థానంలో నిలిచింది. బుధవారం జిల్లా కలెక్టర్ చేతులమీదుగా ఆమె బహుమతిని అందుకుంది. పట్టణంలోని సైబరేజ్ స్కూల్‌కు చెందిన నేహ అనే విద్యార్థిని వక్తృత్వ పోటీలో, లక్ష్మమ్మ విద్యానిలయంకు చెందిన ఖాజా రహమతుల్లా అనే విద్యార్థి క్విజ్ పోటీలో, మండలంలోని గుండ్లపోచంపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పవన్ మాక్ పార్లమెంట్‌లో తృతీయ బహుమతులను సాధించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విజేతలకు జిల్లా కలెక్టర్ బహుమతులు అందజేశారు. జాతీయ ఓటరు దినోత్సవం ఉత్తమ ఆర్గనైజర్‌గా మండలస్థాయిలో అత్వెల్లి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రాజిరెడ్డి ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంఇఓ శ్రీ్ధర్ పాల్గొన్నారు.

28 నుంచి శ్రీగాయత్రి పీఠం వార్షికోత్సవాలు
ఘట్‌కేసర్, జనవరి 25: అన్నోజిగూడ శ్రీగాయత్రీ పీఠం ద్వాదశ వార్షికోత్సవం ఘనంగ నిర్వహిస్తున్నట్లు శ్రీమాత సేవాశ్రమం గాయత్రీ పిఠాధిపతి శ్రీ గాయత్రీ తత్త్వానంద ఋషి తెలిపారు. మండల పరిధి అన్నోజిగూడ గ్రామంలోని శ్రీమాతా సేవాశ్రమంలో శ్రీ మాత సేవాశ్రమ ట్రస్టు బోర్డు సభ్యులు శ్రీ గాయత్రీ తత్త్వానంద ఋషి దంపతులు శ్రీగాయత్రీ పీఠం ద్వాదశ వార్షికోత్సవ పత్రికను బుధవారం ఆవిష్కరించారు. శ్రీగాయత్రీ తత్త్వానంద ఋషి మాట్లాడుతు శ్రీమాతా సేవాశ్రమం వెలసి 12 సంవత్సరాలు గడిచినట్లు ప్రతి సంవత్సరం శ్రీగాయత్రీ దేవి అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. శ్రీగాయత్రీ పీఠాన్ని స్థాపించి పుష్కరకాలం పూర్తవుతున్న సందర్భంగా శనివారం మొదులు కొని పంచమి బుధవారం వరకు పంచావ్హాకదీక్షతో మహాకుంభాభిషేక కార్యక్రమాలను నిర్వహంచనున్నట్లు చెప్పారు. ఈనెల 28న గోపూజ, గణపతిపూజ, స్వస్తిపుణ్యాహవాచనం, ఋత్విగ్వర్ణణ అంకురార్పణ- ధ్వజారోహణం, అఖండ దీపారాధన, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠాపన స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పా రు. 29న శ్రీ గాయత్రీహవనం, సాముహిక లక్షపుష్పార్చన, గురువందన కార్యక్రమం శ్రీ మదనాంద సరస్వతీస్వామి, శ్రీకృషానంద సరస్వతీ స్వామి వార్ల పాదుకా పూజలు, శ్రీమాధవానంద సరస్వతి స్వామివారి పాదపూజ, అనుగ్రహభాషణం, మంగళహారతి, దీపోత్సవం, 30న రుద్రహవనము, శ్రీమధుసూదనానంద సరస్వతీచే సహస్ర ఘటాభిషేకం, మహాలింగార్చన, 31న చండీహవనం, లక్షఫలార్చన, ఫిబ్రవరి ఒకటిన స్థాపిత దేవత హవనములు, మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి, మహాదాశీర్వచనం, ఋత్విక్ సన్మానం, పనె్నండు సంవత్సరాలుగా శ్రీగాయత్రీ దేవికి తమ సేవలను అందించిన కవులకు, కళాకారులకు, సాహితీవేత్తలకు సముచిత సన్మానము, దీపోత్సవము, మంగళహారతి, మంత్రపుష్పం తీర్ధప్రసాద వినియోగము వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గురుదేవులు శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమాధవానంద సరస్వతీ స్వామి వారి ఆశీస్సులతో జరుపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో శ్రీ మాత సేవాశ్రమ ట్రస్టు బోర్డు సభ్యులు వేలేటి బాలమురళీకృష్ణ, నాబోతు సిద్దిరాములు గుప్త, జోగినపల్లి మోహన్‌రావు, చెన్నమనేని వెంకట్‌రావు, పానుగంటి నరసింహరావు, బోయపల్లి కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.

రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని విద్యార్థి దుర్మరణం
రాజేంద్రనగర్, జనవరి 25: రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన కారు ఢీకొనడంతో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ బస్తీకి చెందిన వీరరాజు కుమారుడు పవన్‌కుమార్(15) రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన పవన్ సాయంత్రం స్కూల్‌కు వదిలాక హిమాయత్‌సాగర్ పత్తికుంట వైపు నడుచుకుంటూ వెళ్లాడు. హనుమాన్‌నగర్ డి ఆర్ ఆర్ సమీపంలో రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో హిమాయత్‌సాగర్ వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన నిస్సార్ కారు (టి ఎస్ 13 ఏకే 3390) కారు ఢీకొట్టింది. దీంతో పవన్ తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవర్ ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన పవన్‌కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. స్థానికులు సూచించిన సమాచారం మేరకు కారు వివరాలను సేకరించి డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. పవన్‌కుమార్ స్కూల్ వదిలాక ఇంటికి వెళ్లకుండా హిమాయత్‌సాగర్ వైపు ఎందుకు వెళ్లాడో తెలియాల్సి ఉందని పోలీసులు భావిస్తున్నారు.

వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో జిల్లాలో ఆదర్శం
ధారూర్, జనవరి 25: గ్రామంలో స్వచ్ఛ్భారత్ అభియాన్ ద్వారా వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకుని వికారాబాద్ జిల్లాకే ఆదర్శంగా నిలిచారని రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ చైర్మెన్ సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని అంపల్లి, కొండాపూర్ కలాన్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రాంభించారు. ఈ సందర్భంగా అంపల్లిలో ఆర్‌ఓ మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం కొండాపూర్ కలాన్ గ్రామంలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో యువత ముందుకు వచ్చి వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకుంటామని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కొండాపూర్ కలాన్ గ్రామ పంచాయతీ దాని అనుబంధ గ్రామం నర్సాపూర్‌లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకుని జిల్లాలో ఆదర్శంగా నిలిచారన్నారు. యువత మంచి ఇదే స్ఫూర్తితో ముందుకు నడవాలన్నారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బాగంలో రచ్చగట్ట నిర్మాణం చేసుకోవాలని సూచించారు. ఉపాధిహామీ పథకం కింద పంట పొలాల్లోకి రోడ్లు వేయించుకోవాలని కొండాపూర్-నర్సాపూర్, కాచారం-కొండాపూర్‌కలాన్ గ్రామాల మధ్యలో పానాదులను మట్టి రోడ్లుగా నిర్మించుకోవాలన్నారు. ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా రాష్ట్రంలో వెనుకబడి ఉందని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. మండల పరిషత్ అధ్యక్షురాలు ఉమాపార్వతి, పిఎసిఎస్ చైర్మెన్ హన్మంత్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మెన్ రాజునాయక్, పిఎసిఎస్ వైస్ చైర్మెన్ వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్ భారతమ్మ, మండల అభివృద్ధి అధికారి సబిత, తహశీల్దార్ శ్రీనివాస్, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు వడ్ల నందు, బందెయ్య పాల్గొన్నారు.

విధిగా హెల్మెట్‌లను ధరించాలి

మేడ్చల్, జనవరి 25: ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్‌లను ధరించాలని అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్‌ను కచ్చితంగా పాటించాలని స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి సూచించారు. బుధవారం అల్వాల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలో 28వ జాతీయ భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీలో ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. ర్యాలీ పట్టణంలోని పలు ప్రధాన పురవీధులగుండా నిర్వహించారు. అనంతరం పట్టణంలోని వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలను విధిగా పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా 28వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మనకోసం మన కుటుంబం కోసం మనమే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ద్విచక్రవాహనదారులు వేగ నియంత్రణను పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల నిబంధనలు మన మంచికేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న మనం పోలీసుల నియమనిబంధనలను పాటించాల్సిందేనని చెప్పారు. ప్రజలను చైతన్య పరిచేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు అన్నివిధాలుగా సహకరిస్తుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పోలీసు వ్యవస్థ మనుగడకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని వివరించారు.
ప్రజలందరూ పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, అల్వాల్ ట్రాఫిక్ సిఐ నర్సింహారెడ్డి, ఎఎంసి చైర్మన్ సత్యనారాయణ, టిఆర్‌ఎస్ నాయకులు భాస్కర్ యాదవ్, మల్లికార్జున్, నందారెడ్డి, నర్సింహ్మరెడ్డి, శేఖర్‌గౌడ్, మోహన్‌రెడ్డి, రామస్వామి, నాగరాజు, రఘు, రమేశ్ ముదిరాజ్, సాటే నరేందర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు విజయ్‌రావు పాల్గొన్నారు.

వచ్చే ‘దిశ’ సమావేశం నాటికి 90 శాతం సమస్యల పరిష్కారం

వికారాబాద్, జనవరి 25: మే నెలలో నిర్వహించే జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికల్లా ప్రస్తుత సమావేశంలో సేకరించిన సమస్యల్లో 90 శాతం పరిష్కారమవుతాయని కమిటీ (దిశ) చైర్మన్, చేవెళ్ళ పార్లమెంటు సభ్యుడు కొండా విశే్వశ్వర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన దిశ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, నిధుల వినియోగంపై సమీక్ష చేసేందుకే దిశ సమావేశమని చెప్పారు. వికారాబాద్ జిల్లాకు 376 కోట్ల రూపాయలు మంజూరు కాగా 270 కేంద్రానివి కాగా 105 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవని తెలిపారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో 204 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే 134 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అమలవుతున్న నాడెడ్ కంపోస్టు పిట్స్‌ను గ్రామీణ ప్రజలు వాడుతున్నారా అని ప్రశ్నించారు. గ్రామం నుండి మొదలు పట్టణాల దాకా నిరుద్యోగ యువత కంప్యూటర్ ఉద్యోగాలను కోరుకుంటున్నారని, మేస్ర్తీల అవసరం చాలా ఉందని ఆంధ్ర, ఒరిస్సాల నుండి వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. పథకాల విభజన ఇంకా పూర్తి కాలేదని, వికారాబాద్ పట్టణం అటు శాటిలైట్ పథకాన్ని కోల్పోగా, స్మార్ట్‌సిటీకి ఎంపిక కాలేదని స్పష్టం చేశారు. ఎంఎంటిఎస్ రైలు కోసం ప్రయత్నిస్తున్నామని, వికారాబాద్ స్టేషన్‌లో నిలిపి ప్రయాణికులను అనుమతించని, విశాఖపట్టణం, మచిలీపట్నం రైళ్లకు ప్రయాణీకులను అనుమతించాలని రైల్వే జిఎం సమావేశంలో మాట