రంగారెడ్డి

టిఆర్‌ఎస్ పాలనలో విద్యపై నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జనవరి 28: టిఆర్‌ఎస్ పాలనలో విద్య ఒక మిధ్యగా మారిందని తాండూరు డివిజన్ విద్యావంతుల ఐక్యవేదిక ప్రతినిధులు, తాండూరు పిజి అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు. గతంలో విద్యాభ్యున్నతి పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ పాలకులను చూడలేదంటూ ఆయా సంఘాల ప్రతినిధులు రామకృష్ణ, బాలకృష్ణ, లక్ష్మణ్, సుధాకర్, యు.రమేష్‌కుమార్, కె.వాసు, టి.శ్రీనివాస్, బి.రాజ్‌కుమార్, జి.రాములు, వెంకటాచారి, నారాయణ తదితరులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఒక్క తాండూరు పట్టణంలోనే నాలుగైదు విద్యాలయాలు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు లేక మూత పడుతున్నాయన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఒకవైపు విద్యాబోధకులు లేక మూత పడుతుంటే, కేవలం ఆయా పురాతన పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించి విద్యార్థుల చదువులు మెరుగుపర్చాల్సిన పాలకులు గురుకులాలు, మైనార్టీ విద్యాలయాల పేరిట కోట్లాది రూపాయలు అంచనాలు వేస్తూ ఏ ఓక్క మైనార్టీ, గురుకులాలు, హాస్టళ్ళు ప్రారంభించకుండా కాలం వృథా చేయడం శోచనీయమని విమర్శించారు. పురాతన విద్యాలయాలను, పేరుగాంచిన పాత పాఠశాలలు, కళాశాలలు పురోభివృద్ధిలోకి తెచ్చి, కొద్దిపాటి నిధులు కేటాయించి ఆయా పాఠశాలలు, కళాశాలల భవనాలను మరమ్మతులు చేపట్టి, ఆ స్కూళ్ళు, కళాశాలల్లో విద్యాధికులను నియమించి పాఠశాల, కళాశాలల విద్యను అతి తక్కువ ఖర్చుతో ముందుకు సాగించే బదులు, అర్థంపర్థం లేని ని అంచనాలతో భారీగా నిధులు వ్యర్థం చేయటం తగదన్నారు. విద్యా రంగాన్ని నిజాయితీతో అభివృద్ధి చేయాల్సింది పోయి, అన్నింటావ్యాపార దృక్పథాన్ని ప్రదర్శిస్తూ తన అనుచరగణాన్ని పెంచి పోషించటం సిఎం కేసిఆర్‌కు రివాజుగా మారిందని వారు నిశితంగా విమర్శించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల మాటెలా ఉన్నా గత రంగా రెడ్డి ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో అన్ని రంగాల కంటే విద్యారంగం లోపభూయిష్టంగా మారిందన్నారు. డివిజన్‌లోని అన్ని స్థాయిల పాఠశాలల్లో, మారుమూల గ్రామీణ ప్రాంతాల పాఠశాలల్లో ఉపాధ్యాయులు కానరాకపోవడం వంటి దయానీయ పరిస్థితులు అను నిత్యం కనిపిస్తుంటాయన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతవిద్య, ఇంటర్ విద్య సైతం ప్రస్తుత పాలకుల పుణ్యమా అంటూ దుర్లభంగా మారిందని విద్యావంతుల ఐక్య వేదిక, తాండూరు పిజి అసోసియేషన్‌ల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. పాఠశాలలు మొదలు, కళాలలన్నింటిలో ఇన్‌చార్జి విద్యాధికారులు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం, తమ నెలవారీ వేతనాలు అందితే చాలు అన్న రీతిలో కాంట్రాక్టు లెక్చరర్లు భావించటం మూలంగా అన్ని స్థాయిల్లో విద్య నాశనం అవుతోందన్నారు.

పకడ్బందీగా కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

కీసర, జనవరి 28: కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మాత్సవాలు ఈసారి పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎంవి రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని ఆలయ ఇఓ వెంకటేశ్ అధ్యతన మొదటి విడత సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన శివాలయం కీసరగుట్టని పేర్కొన్నారు. ఫిబ్రవరి 22నుండి 27వరకు నిర్వహించే జాతరకు అధికారులంతా సిద్ధంకావాలని కోరారు. కీసరగుట్ట ఆలయం పక్కనే కలెక్టరేట్ ఉండటం తమ అదృష్టమన్నారు. గతంలో ఉత్పన్నమైన సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాన్య భక్తుడు త్వరగా స్వామివారి దర్శనం చేసుకునేలా ఉండాలని తెలిపారు. కీసరగుట్ట ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ముందుగా ప్రచార కమిటీ వేసి బ్రహోత్సవాల పోస్టర్‌ల ద్వారా రాష్ట్రం మొత్తం ప్రచారం నిర్వహించాలని కోరారు. గతంలో పనిచేసిన అధికారుల సలహాలు, సూచనలను తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులను కోరారు. విఐపి పాసులు దుర్వినియోగం కాకుండా విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఉచిత దర్శనంలో నిలుచున్న భక్తులకు ఎండ లేకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నాలుగు జనరేటర్‌లు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఇరవైనాల్గు గంటలు శానిటేషన్ పర్యవేక్షించాలని డిపిఓ సురేశ్‌మోహన్‌ను కోరారు. పెద్దమ్మ, నూర్‌మహ్మద్, తామరకొలనులలో నీరు ఉన్నందున పోలీసులను, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సర్పంచ్ గణేశ్ కలెక్టర్‌కు వివరించారు. కీసర గ్రామం నుండి, గుట్టవరకు, నడక దారిన లైటింగ్, మరుగుదొడ్లు, తాగునీరు ఏర్పాట్లు చేయాలని అన్నారు. లిక్కర్ గుట్టపైకి తేకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తులకు అవగాహన కల్గించేలా 26 శాఖల ద్వారా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని డిఆర్‌డిఏ అధికారులను కోరారు. జిల్లాస్థాయిలో నిర్వహించే క్రీడల్లో ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలని డిఇఓ ఉషారాణికి వివరించారు. శాంతియుత వాతావరణంలో క్రీడలు నిర్వహించుకోవాలని తెలిపారు. అహ్మద్‌గూడ వద్ద, నాగారం చౌరస్తా, రాంపల్లి చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, పరిష్కరించాలని జెడ్‌పిటిసి రమాదేవి కోరారు. జాతర జరిగే వారం రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. 274 ఆర్టీసి బస్సులు జాతర సందర్బంగా నడిపామని కుషాయిగూడ డిపో మేనేజర్ జగన్ తెలిపారు.అవసరమైతే మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌కు తెలిపారు. టాయిలెట్స్, తాగునీరు గతంలోకంటే ఎక్కువగా ఏర్పాటు చేయాలని ఎంపిటిసి జంగయ్య తెలిపారు. ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని జంగయ్య పేర్కొన్నారు. కోతులు, పందుల బెడద ఉందని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిబ్రవరి ఆరవ తేదీన రెండవ కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ ఎంవి రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మేడ్చల్ ఏమ్మేల్యే సుధీర్‌రెడ్డి, జెసి ధర్మారెడ్డి, డిఆర్‌ఓ సురేందర్‌రావు, డిపిఓ సురేశ్‌మోహన్, డిఇఓ ఉషారాణి, గుట్ట ఆలయ చైర్మన్ టి.వెంకటేశ్, నారాయణశర్మ, జెడ్‌పిటిసి రమాదేవి, ఎంపిపి సుజాత పాల్గొన్నారు.

రైతులకు అందని పరిశోధనా ఫలితాలు

రాజేంద్రనగర్, జనవరి 28: శాస్తవ్రేత్తలు వ్యవసాయంపై నూతన పరిశోధనలు చేస్తున్నప్పటికీ ఆ ఫలితాలను క్షేత్ర స్థాయిలో రైతులకు అందించడంలో విఫలమవుతున్నారని భారత వ్యవసాయ పరిశోధనా మండలి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఎడ్యుకేషన్) డాక్టర్ ఎన్‌ఎస్ రాథోర్ అన్నారు. శనవారం రాజేంద్రనగర్‌లోని ఐసిఏఆర్ నారమ్‌లో 8వ నేషనల్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్ కాంగ్రెస్-2017 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. అనంతరం ఆయన శాస్తవ్రేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. నూతన పరిశోధనలను ఎప్పటికప్పుడు రైతులకు చేరవేర్చి భారతదేశాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టాలని కోరారు. ఇటీవల కాలంలో న్యూట్రిషన్ ఫుడ్ అందుబాటులో లేకప్రజలు పలు అనారోగ్యాలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యూట్రిషన్ ఆహార పదార్థాల పరిశోధనల్లో శాస్తవ్రేత్తలు, అధికారులు ఎందుకు విఫలమవుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం సాంకేతికంగా ఎన్ని సహాయ సహకారాలు అందిస్తున్నా పరిశోధనల్లో విఫలం చెందడం బాధ కలిగిస్తుందన్నారు. రసాయన ఎరువులు వినియోగించడం వల్ల భూమితో పాటు రైతు కూడా నష్టాలపాలవుతున్నాడని, సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులను ప్రోత్సహిస్తే ఉత్తమ ఫలితాలతో భూమి సాగుకు అనుకూలంగా మారుతుందన్నారు. సేంద్రియ పంటల కారణంగా పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి పెరిగి రైతులు సంతోషంగా ఉంటారన్నారు. రైతులు సేంద్రియ ఎరువుల వైపు మొగ్గుచూపేలా శాస్తవ్రేత్తలకు సూచించారు. గతంలో రాత్రివేళల్లో రైతులు పొలాల్లో నీళ్లు పెట్టేందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, కాని ఇటీవల రైతుల సౌలభ్యం కోసం మొబైల్ యాప్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. అంతేకాకుండా అధికారులు ఈయాప్‌ను ఎలా వినియోగించుకోవాలో శిక్షణ ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంఫాల్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ ప్రేమ్‌జిత్‌సింగ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు, ఐసిఏఆర్ నారమ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కల్పన శాస్ర్తీ, శాస్తవ్రేత్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు 2017 పద్మశ్రీ అవార్డు గ్రహీతలు చింతకింది మల్లేశం, దరిపల్లి రామయ్యలకు రాథోర్ చేతుల మీదుగా సన్మానించి అవార్డులను అందజేశారు.

నాగారంలో రోడ్డు పక్కన పసిపాప

కీసర, జనవరి 28: నవమాసాలు మోసిన ఆ తల్లికి ఆడబిడ్డ పుట్టగానే ఎలా వదిలించుకోవాలపించిందో ఏమో అంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్న వైనం మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన కాలనీవాసులను చలించి వేసింది. కొందరు పిల్లల కోసం గుళ్లూ, గోపురాలు, వ్రతాలు, నోములూ చేసినా కరుణించని దేవుడు, మరికొందరికి వద్దనుకున్నా సంతానాన్ని ఇస్తుంటే, వారు ఆడపిల్ల పుట్టిందనే సాకుతో ఇలా రోడ్డున పడవేస్తున్నారు. నాగారం గ్రామంలోని రోడ్డుపక్కన ఆడ శిశువు కీసర పోలీసులకు లభించింది. వివరాల్లోకి వెళితే నాగారంలోని నేతాజీ నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వారు మూడు రోజుల పసి కందును రోడ్డు ప్రక్కగా వదిలి వెళ్లారు. పసిపాప కేకలు విన్న స్దానికులు అక్కున చేర్చుకొని పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని పసికందును స్వాధీనం చేసుకొని డాక్టర్‌లకు చూయించారు. పాప ఆరోగ్యంగా ఉందని ఎలాంటి సమస్యలు లేవని పేర్కొన్నారు. అనంతరం నగరంలోని శిశు సంక్షేమ కేంద్రం వారికి అప్పగించారు.

నలుగురు కొడుకులున్నా పట్టించుకోరు
ప్రభుత్వం ఆదుకోదు
న్యాయమూర్తి ముందు కన్నీళ్ళు పెట్టుకున్న వృద్ధుడు
ధారూర్, జనవరి 28: నలుగురు సంతానంలో ఏ ఒక్కరూ తల్లి దండ్రులను పట్టించుకోకపోవడంతో ఓ వృద్ధుడు న్యాయమూర్తి ముందు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. వృద్ధుని కన్నీళ్ళకు జిల్లా అదనపు న్యాయమూర్తి హృదయం చలించింది. వృద్ధుని ఓదార్చి అతని మాటలు పూర్తిగా విన్న ఆయన పెద్దాయనతో సంతకం తీసుకుని ఆయన చెప్పిన మాటలను రికార్డు చేసి కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే గోధుమగూడ గ్రామంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సుకు హాజరైన జిల్లా అదనపు న్యాయమూర్తి ముందు అదే గ్రామానికి చెందిన కొండలి సాయన్న అనే వృద్ధుడు న్యాయమూర్తి ముందు విలపించాడు. కొడుకులు పట్టించుకోవడం లేదు.. ప్రభుత్వం ఆదుకోవడం లేదు.. ఉన్న ఆసరా పించను ఇవ్వకుండా రద్దు చేశారు. నాకు చచ్చిపోవాలనిపిస్తోందని వృద్ధుడు విలపించాడు. కాగా వృద్ధుడు కొండలి సాయన్నకు నలుగురు కొడుకులు. వారిలో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. మరో ఇద్దరు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వృద్ధుల కుమారుల్లో ఎరవైనా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆసరా పింఛను ఇవ్వరాదని నిబంధనలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు ఆసరా పించను రద్దు చేశారు. వృద్ధుడు చెప్పిన విషయాలను కాగితంపై రాసి వేలిముద్ర తీసుకోవాలని దాని ఆధారంగా కేసు నమోదు చేసి ఆయనకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పేరుతో మోసం

గచ్చిబౌలి, జనవరి 28: బ్యాక్‌డోర్ ఉద్యోగాలను నమ్మవద్దని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా నిరుద్యోగులు పట్టించుకోకుండా మోసగాళ్ల వలలో పడుతూనే ఉన్నారు. నేరగాళ్ల మాటకు మోసపోతూ లక్షల రూపాయలు నష్టపోతున్నారు. చేతులు కాలక ఆకులు పట్టుకున్న చందంగా సైబర్ దొంగల చేతుల్లో మోసపోయాక చివరిగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం ఇపిస్తామని విద్యార్ధిని లక్షా 84 వేల రూపాయలకు మోసం చేసిన సంఘలన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పరిధిలో జరిగింది. సైబర్ క్రైం ఏసిపి జయరాం కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. జీడిమెట్ల పరిధిలోని సూరారం కాలనీలో నివాసముండే శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చదువు అనంతరం ఉద్యోగం కోసం షిని డాట్‌కం వెబ్‌సైట్‌లో తన రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేశాడు. ఇలాంటి డేటాను కొందరు దుండగులు సంబంధిత ఏజన్సీల నుంచి కొనుగోలుచేసి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. శ్రావణ్ కుమార్ రెడ్డికి గతఏడాది నవంబర్‌లో రాహుల్ కౌరవ్(23) వ్యక్తి ఫోన్‌చేసి తాను ఎఎస్ గ్రూప్ కన్సల్టెన్సీ నుంచి మాట్లాడుతున్నానని తాము ఇండిగో ఎయిర్‌లైన్స్‌తోపాటు పలు సంస్థల్లో బ్యాక్ డొర్‌లో ఉద్యోగం ఇపిస్తామని నమ్మపలికాడు. దాంతో శ్రావణ్‌కుమార్ ఇంతమంచి కంపెనీలో ఉద్యోగం వరించి వచ్చిందని ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు. ఫోన్‌చేసిన వ్యక్తి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో పలుమార్లు నిందితులు సూచించిన ఖాతాలలో డబ్బులు జమ చేశాడు.
సుమారు లక్షా 84వేల రూపాయలు చెల్లించాడు. ఇండిగో హెచ్‌ఆర్ మేనేజర్ పేరుతో వివిధ రకాలుగా ఫోన్‌లు చేసి డబ్బులు వేయాలని చెప్పడంతో, ఉద్యోగం ఇవ్వకుండా ఏవో కారణాలతో డబ్బులు వేయించుకుంటుండం చూసి అనుమానంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైం పోలీసులు నిందితులను పట్టుకునేందుకు పథకం వేశారు. నిరుద్యోగి మాదిరిగా షిసి సైట్‌లో రెజ్యూమ్‌ని పెట్టి నిందితులను ముగ్గులోకి దింపారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్‌ఐ శ్రీనివాస్, విజయ వర్ధన్ బృందం ఢిల్లీకి వెళ్లింది. వలపన్ని రాహుల్‌కౌర్‌ని అదుపులోకి తీసున్నారు. అనంతరం నిందితుడిచ్చిన సమాచారంతో న్యూఢిల్లీలోని ఎఎస్ గ్రూప్ కన్సల్టెన్సీ కార్యాలయంపై దాడి చేశారు. అక్కడ కార్యాలయాన్ని చూసిన సైబర్ క్రైం పోలీసులకు దిమ్మతిరిగినంత పనయ్యింది. కార్యాలయంతో నిరుద్యోగుల వివరాలను సేకరించి వారికి ఫోన్‌లు చేయడానికి 15మంది యువతులు పని చేస్తున్నారు. ఎఎస్ గ్రూప్ నిర్వాహుకులు రాహుల్ కౌరవ్‌తోపాటు అర్జున్ సింగ్ (22)ని అదుపులోకి తీసుకున్నారు.
నిర్వాహకులలో అమన్, లోకేష్, ఫ్రాన్సిస్, అజిత్ సింగ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరి నుండి లక్షా 10వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు ఏసిపి జయ