ఆంధ్రప్రదేశ్‌

15న 104 ఉపగ్రహాల ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 8: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే పిఎస్‌ఎల్‌వి-సి 37 రాకెట్ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ నెల 15న పిఎస్‌ఎల్‌వి-సి 37 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ వాహక నౌక ద్వారా మన దేశానికి చెందిన 650 కిలోల బరువుగల కార్టోశాట్-2డి ఉపగ్రహం, 30కిలోల బరువుగల ఐఎన్‌ఎస్-1ఎ, ఐఎన్‌ఎస్-1బి ఇస్రోకు చెందిన నానో ఉపగ్రహాలతో విదేశాలకు చెందిన 820 కిలోల బరువుగల 101 క్యూబో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై ఇప్పటికే నాలుగు దశల అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇక రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాలను అమర్చాల్సి ఉంది. ప్రయోగానికి చెందిన చివరి మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం ఈ నెల 12న షార్‌లో జరగనుంది. ఎంఆర్‌ఆర్ అనంతరం లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు వారికి అప్పగించనున్నారు.