రంగారెడ్డి

నగరంలో శాంతిభద్రతలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 19: దోపిడీ దొంగతనాల నివారణకు సిసి కెమెరాలను ఏర్పాటు చేయడానికి కాలనీ సంక్షేమ సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉప్పల్‌లోని బాలాజి ఎన్‌క్లేవ్ (హుడా) కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూ.1.75లక్షలతో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్, కార్పోరేటర్ జి.సరస్వతితో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో అల్లర్లు, ఘర్షణల కారణంగా జీవించాలంటే అభద్రతా భావం ఉండేదని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పక్కా ప్రణాళికతో పకడ్బందీ వ్యూహంతో శాంతిభద్రతల విషయంలో పోలీసు యంత్రాంగం సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. నగరంలో ఇప్పటికే పదివేల సిసి కెమెరాలను ఏర్పాటు చేయడంతో దోపిడీ దొంగతనాలు తగ్గాయని వివరించారు. తడి చెత్త పొడి చెత్తను వేరుచేసి పరిశుభ్రతను పాటించేలా జిహెచ్‌ఎంసి యంత్రాంగం చేపట్టిన కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలకు వౌలిక వసతులను కల్పించేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్నామన్నారు. చర్లపల్లి రైల్వే జంక్షన్, వౌలాలి అప్‌గ్రేడేషన్, ఎంఎంటిసి ఫేస్-2, మెట్రోరైలు ప్రాజెక్టు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో, సంక్షేమ పథకాల అమలుతో ఉప్పల్ నియోజకవర్గం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. రూ.12కోట్లతో ఉప్పల్ ప్రధాన రహదారి విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ వంటి జంక్షన్ అభివృద్ధికి త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తుందన్నారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టిఆర్‌ఎస్ ఇంచార్జి బేతి సుభాష్‌రెడ్డి, కార్పోరేటర్ జి.సరస్వతి, కాలనీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి ఓంకార్‌సింగ్ ప్రసంగించారు. అనంతరం మేయర్, ఎమ్మెల్యేను సత్కరించారు.
టర్కీ కరెన్సీ చెలామణికి యత్నం
ఏడుగురి అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 19: నిషేధిత టర్కీ కరెన్సీని చెలామణికి యత్నిస్తున్న ఏడుగురిని నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 26.15 కోట్లు విలువచేసే 186 పదివేల టర్కీ నోట్లు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కోట్లు విలువ చేసే టర్కీ కరెన్సీ మార్చేందుకు యత్నించిన వారిలో పి డేవిడ్, మురుగేశ్, రాజశేఖర్, శ్యాంసుందర్, సత్యం, జంగారెడ్డి ఉన్నారు. వీరంతా చైతన్యపురిలో ఉంటూ తమిళనాడు నుంచి ఓ బ్రోకర్ ద్వారా టర్కీ నోట్లు తీసుకుని హైదరాబాద్‌లో అమాయకులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. వీరిని విచారణ నిమిత్తం బేగంపేట్ పోలీసులకు అప్పగించినట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు.
గిడ్డంగిలో ల్యాప్‌టాప్‌ల చోరీ
కొత్తూరు రూరల్, ఫిబ్రవరి 19: ఆమెజాన్ గిడ్డంగిలో 36 ల్యాప్‌ట్యాప్‌లు చోరీకి గురైనట్టు సంస్థ ప్రతినిధి నాగసుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలో అమెజాన్ సంస్థ ప్రతినిధి నాగసుబ్బారెడ్డి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శ్రీశైలం ఆదివారం తెలిపారు. మండల పరిధిలోని పెంజర్ల వద్ద ఉన్న అమెజాన్ గోదాంలో పలు కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లను భద్రపర్చుతుంటారు. ఈ గిడ్డంగిలో భద్రపరిచిన ల్యాప్‌టాప్‌లను పరిశీలించగా 16 ఆపిల్, 20 హెచ్‌పి కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లు కనిపించకపోవడంతో సంస్థ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ల్యాప్‌టాప్‌ల విలువ లక్షల్లో ఉంటుందని అంచనా. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కొడంగల్ నేతలు
కొడంగల్, ఫిబ్రవరి 19: టిఆర్‌ఎస్ బలపర్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించేందుకు కొడంగల్ టిఆర్‌ఎస్ నాయకులు, మాజీ ఎంపిపి ముద్దప్ప దేశ్‌ముఖ్, మాజీ జడ్‌పిటిసి ఎనుగుల భాస్కర్‌లతో పాటు ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రచారంలో పాల్గొన్నారు. టిఆర్‌ఎస్ బలపర్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి గెలుపు మంత్రి హరీష్‌రావు, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీగా తరలించారు. కార్యక్రమంలో ప్రభాకర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు.