రంగారెడ్డి

హిందూ ధర్మాన్ని ప్రపంచ దేశాలకు చాటిన మహనీయుడు శివాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 19: హిందూ ధర్మాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అని ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని రంగారెడ్డినగర్‌లో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు నందనం దివాకర్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ విచ్చేసి చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాంచందర్‌రావు, ప్రభాకర్ మాట్లాడుతూ సుల్తాన్ రాజ్యాధికారాన్ని గడగడలాడించిన శక్తి శౌర్యుడు శివాజి అని తెలిపారు. శివాజి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని సూచించారు.
శత్రు రాజ్యాల పై విరోచిత పోరాటం చేసిన ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో యువత పయనించాలని అన్నారు. ఆయన చూపిన బాటలో యువతరం నడవాలని పిలుపునిచ్చారు. స్థానిక కార్పొరేటర్ విజయశేఖర్ గౌడ్, బిజెపి నాయకులు భరతసింహారెడ్డి, ఆశా, రాజరాజేశ్వరి, నందనం కృపాకర్, రంగా శ్రీనివాస్ గౌడ్, సిహెచ్ రాజశేఖర్‌రెడ్డి, బాల్‌రాజ్, రవికుమార్, విమల్ తివారి, స్థానిక నాయకులు అబ్దుల్ ఖాదర్, రహీమ్, లక్ష్మీనాథ్ పాల్గొన్నారు.
యువతకు ఆదర్శ ప్రాయుడు ఛత్రపతి శివాజీ
యువతకు ఆదర్శ ప్రాయుడు ఛత్రపతి శివాజీ అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అన్నారు. ఆదివారం జీడిమెట్ల డివిజన్ గోదావరి హోమ్స్‌లో క్షత్రియ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కెపి వివేక్ ముఖ్యఅతిథిగా విచ్చేసి శివాజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వివేక్ మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించి పోరాడిన మహనీయుడు శివాజీ అని అన్నారు. 17 ఏళ్ల వయస్సులోనే యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి తోర్నా కోటను సొంతం చేసుకున్న విజయశాలి అని వివరించారు. వీరోధ్యమం అంటే ఛత్రపతి శివాజీనే గుర్తుకు వస్తారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువకులు ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కిషన్ రావు, నాయకులు రవీందర్‌రావు, ఉమాపతి పాల్గొన్నారు.
ఛత్రపతి యుగపురుషుడు
బాలాపూర్: ఛత్రపతి శివాజీ లేకుంటే భారత దేశ సంస్కృతి కనుమరుగు అయ్యేదని బిజెపి సీనియర్ నాయకులు కోలన్ శంకర్‌రెడ్డి కొనియాడరు. ఛత్రపతి శివాజీ జయంతిని సందర్భంగా ఆదివారం బాలాపూర్ చౌరస్తాలో.. బడంగ్‌పేట్ బిజెపి ప్రధాన కార్యదర్శి బోరల ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలకు కోలన్ శంకర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు ఆర్పించారు. ఛత్రపతి దేశ భక్తి, హిందుత్వ భవనతో దేశ ఐక్యత కోసం పనిచేసిన యుగపురుషుడు అని అన్నారు. యువత ఆయనను అదర్శంగా తీసుకొన్ని అన్యాయం, అధర్మం మీద రాజీలేని పోరాటం చేయాలని శంకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎంపిటిసి ఎనుగు రాంరెడ్డి, నాయకులు గుర్రం మల్లారెడ్డి, టి.్భస్కర్‌రెడ్డి, కె.సంజీవ, బంద్యాల శంకర్‌రెడ్డి, సుదర్శన్ చారి, శ్రీనివాస్‌రెడ్డి, కె.ప్రభాకర్‌రెడ్డి, రాము పాల్గొన్నారు.
శివాజీ జయంతి ఉత్సవాలు
కొడంగల్: ఛత్రపతి శివాజీ 387వ జయంతిని కొడంగల్ పట్టణంలో హిందు ధర్మజాగరణ సభ్యులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శివాజీ చిత్రపటంతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీతో హోరెత్తించారు. శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. వినాయక చౌరస్తాలో శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మండల పరిధిలోని పర్సాపూర్, రుద్రారం తదితర గ్రామాలలో యువకులు ర్యాలీలు నిర్వహించి శివాజీకి నివాళి అర్పించారు.
యువత ఛత్రపతి శివాజీని
ఆదర్శంగా తీసుకోవాలి
కాచిగూడ: ఛత్రపతి శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలని బిజెపి సీనియర్ నాయకుడు శేఖర్ మహడిక్ అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శోభయాత్ర శివం రోడ్డు నుంచి పూరణపుల్ వరకు నిర్వహించారు. శేఖర్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కారించుకుని పలు సేవ కార్యక్రమాలతో పాటు శోభయాత్రను నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో నాయకులు సుధీర్, వీరన్న, ఉదయ్‌కుమార్ నేత, శివకుమార్, సతీష్, సురజ్ సింగ్, అజయ్, పవన్, అవినాష్, విజయ్, గోవింద్, నక్కా నాగేష్, దశరథ్, రాము పాల్గొన్నారు.
సంస్కృతమే హిందూ సంస్కృతి బలం
ముషీరాబాద్, ఫిబ్రవరి 19: సంస్కృతం భాష ఆధారంగానే హైందవ, భారతీయ సంస్కృతి పరిఢవిల్లుతోందని కవి, రచయిత తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్ని భాషలున్నా.. అనాదిగా ఉన్న సంస్కృత భాష అనుసంథానంతోనే ఇతర భాషలు ఉద్భవించాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో భారతీయ మాతృభాషల సమ్మేళనం జరిగింది. విశ్వహిందూ ఏక్తా మంచ్, విద్యా పరిరక్షణ సమితి, విస్తృత హిందూ తత్త్వసాహితి, పాన్ హిందూ రైటర్స్ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మేళనానికి హెబ్బార్ నాగేశ్వరరావు ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు. తొలుత గుర్రం జాషువాపై హెబ్బార్ రచించిన ‘అక్షర కరుణ రవి జాతీయ విప్లవ కవి’ పుస్తకాన్ని జాగృతి మాసపత్రిక పూర్వ సంపాదరకులు డాక్టర్ వడ్డి విజయసారథి ఆవిష్కరించారు. ఈసందర్భంగా హెబ్బార్ కీలకోపాన్యాసం చేస్తూ భారతదేశంలో భాషలెన్ని ఉన్నప్పటికీ వాటన్నింటిలోనూ అంతర్లీనంగా హైందవ జాతీయ స్ఫూర్తి ప్రతిఫలిస్తుందన్నారు. బ్రిటిష్ హయాంలోనే సంస్కృతాన్ని నిర్వీర్యం చేసి ఇంగ్లీషును ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఇంగ్లీషు వచ్చిన తర్వాత భారతీయులు కేవలం పేరుకే పరిమితం అయ్యి స్వరూపం మాత్రం ఐరోపా స్వభావం అలవరుచుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు గుడ్డిగా ఉన్న దాన్ని శాస్తమ్రని, నిజమైన శాస్త్రాన్ని మరిచిపోయే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. ‘అందరి భాష సంస్కృత భాష ఇది చారిత్రక వాస్తవం.. అన్ని భాషలూ సంస్కృతానికి రూపాంతరాలే’ అని స్పష్టం చేశారు. పాన్ హిందూ రైటర్స్ ఫోరం అధ్యక్షుడు కె.దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ సంస్కృతం ఆధారం లేకుండా ఏభాషా నిర్మాణం కాలేదన్నారు. టిపిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ మహాకవి గుర్రం జాషువా నిరంతర కవి కృషీవలుడని కొనియాడారు. దళిత కవిగా ప్రాచుర్యం ఉన్నా..సనాతన ధర్మాన్ని తన రచనలలో కొనసాగించారని శ్లాఘించారు. జాషువాకు సంబంధించి అరుదైన అంశాలను జోడించి అరుదైన పుస్తకాన్ని జనబాహుల్యంలోకి తీసుకురావటం అభినందనీయమన్నారు. పుస్తకాన్ని అవిష్కరించిన వడ్డి విజయప్రసాద్ మాట్లాడుతూ జాషువా అనేక రచనలు, పద్యాలు మరుగునపడి ఉన్నాయని అన్నారు. అలాంటివాటిలో కొన్ని హెబ్బార్ నాగేశ్వరరావు అందిపుచ్చుకుని పుస్తరూపంలోకి తేవటం అభినంనీయమన్నారు. ఓయు హిందీ విభాగాధిపతి ప్రొ.షీలామిశ్ర మాట్లాడుతూ ఇతర దేశాలలో ప్రజలు మాతృభాషకిచ్చే ప్రాధాన్యత ఇక్కడ కరువైందన్నారు.

దిగ్విజయ్‌సింగ్‌కు అపూర్వ స్వాగతం

మేడ్చల్, ఫిబ్రవరి 19: అఖిలభారత కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు ఆదివారం మేడ్చల్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే కెఎల్‌ఆర్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన ఆవేదన సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా దిగ్విజయ్‌సింగ్ ఆదివారం ఉదయం నగరం నుండి 44వ జాతీయ రహదారి గుండా నిజామాబాద్ ప్రాంతానికి వెళ్తూ మార్గమధ్యంలోని మేడ్చల్ పట్టణంలోని ప్రధాన కూడలి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు.