రంగారెడ్డి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మార్చి 15: ఈ నెల 19 వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగిందని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ నిర్వహించిన వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో కలెక్టర్ ఎంవి రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19 తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, జిల్లాలో మొత్తం 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. పోలింగ్ అధికారులకు మలిధఫా శిక్షణ ఇవ్వటం పూర్తిఅయిందని చెప్పారు. పోలింగ్‌కు 48 గంటల ముందు మధ్యం దుకాణాలు మూసివేసేందుకు, అభ్యర్థులు ప్రచారం ముగించేందుకు చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. పోలింగ్ జరిగే సంస్ధలకు 18, 19 తేదీలు సెలవు దినంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. కనీస సౌకర్యాలు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెసి ధర్మారెడ్డి, డిఆర్‌ఓ సురేందర్‌రావు, ఆర్‌డిఓ మధుసూదన్, మల్కాజ్‌గిరి డిసిపి రమేశ్ నాయుడు పాల్గొన్నారు.

వడగళ్ల బాధిత
రైతులను ఆదుకుంటాం
కీసర మండలంలో 608 ఎకరాల్లో పంట నష్టం
220 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి: కలెక్టర్
కీసర, మార్చి 15: ఇటీవల కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ, వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. వడగండ్ల వానతో కీసర మండలంలో 608 ఎకరాల్లో పంటలు నష్ట పోయినట్లుగా అధికారులు ప్రాథమిక నివేదిక అందజేసారని అన్నారు. 220 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. 150 మంది రైతులు ఫసల్‌బీమా యోజన కింద బీమా చేసుకున్నందున, వారికి బీమా కంపెనీ నుంచి నష్టపరిహారం అందుతుందని, మిగిలిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు. పంట నష్టపోయిన రైతులకు సబ్సిడీపై విత్తనాలు, రుణాల రీషెడ్యూల్‌కు చర్యలు తీసుకోవాలని ఎల్‌డిఎంకు వివరించారు. ఇన్‌పుట్ సబ్సిడీ అందించటంలో రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ అధికారులను కోరారు.

హెరిటేజ్‌లో అగ్నిప్రమాదం
తప్పిన ప్రమాదం * కార్మికుల సంక్షేమం * భారీగా ఆస్తినష్టం * షార్ట్‌సర్క్యూట్ కారణమా?
ఉప్పల్, మార్చి 15: ఉప్పల్ పారిశ్రామికవాడలోని హెరిటేజ్ ఫుడ్స్ పరిశ్రమలో బుధవారం పట్టపగలు అగ్నిప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో పెద్ద ప్రమాదం తప్పగా భారీగానే ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. పగలు మూడు గంటల సమయంలో పరిశ్రమలోని కింద స్టోర్‌రూంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. నల్లని పొగతో ఉవ్వెత్తున మంటలు రావడంతో పరిశ్రమలో ఉన్న విలువైన ఆహార పదార్థాలు, మైదా పిండి, బేకరీ ఐటమ్స్ కాలి బూడిదయ్యాయి. అక్కడే పనిచేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీసి పోలీసులు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. హుటాహటిన పరిశ్రమకు చేరుకున్న ఐదు ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు ఉపక్రమించారు. సాయంత్రం ఏడు గంటల వరకు ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పినప్పటికీ భారీగానే ఆస్తినష్టం జరిగిందని తెలిసింది. పెద్ద ప్రమాదం తప్పి కార్మికులు క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి ఏసిపి సందీప్, కార్మిక శాఖ, విద్యుత్, జల మండలి అధికారులు సందర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంపై ఇప్పటివరకు పరిశ్రమ యాజమాన్యం నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు.