రంగారెడ్డి

జీవితాల్లో వెలుగు నింపేందుకే ఫ్యామిలీకౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 22: జీవితాల్లో వెలుగు నింపేందుకే ఫ్యామిలీ కౌనె్సలింగ్‌లని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి అన్నారు. బుధవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలానగర్ జోన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్యామిలీ కౌనె్సలింగ్ సెంటర్‌ను సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్యతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఐడిపిఎల్‌లోని ఎంపిఆర్ గార్డెన్‌లో మహిళా సదస్సు నిర్వహించారు. కలెక్టర్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా భార్యాభర్తల సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయని తెలిపారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు కౌనె్సలింగ్ వ్యవస్థ అని అన్నారు. మానవీయ కోణంలో ప్రతి సమస్యను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కోపతాపాలకు పోకుండా సహనంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఫ్యామిలీ కౌనె్సలింగ్ విధానంతో జీవితాల్లో వెలుగు నింపుతుందని అన్నారు. జీవితం అంటే ఆకర్షణ కాదని, ఓ వృక్షమని చెప్పారు. ఆకర్షణలకు లోనుకాకుండా కుటుంబం సమష్టిగా ఉంటేనే సంసారం సాఫీగా సాగుతుందని వివరించారు. ప్రతి సోమవారం కౌనె్సలింగ్ నిర్వహిస్తారని, పోలీస్‌స్టేషన్‌కు రావడానికి ఇష్టపడనివారు ఫోన్ ద్వారా కౌనె్సలింగ్ పొందవచ్చని తెలిపారు. 9160144144, 810617367, 9849848309 నెంబర్‌లకు ప్రజలు సంప్రదించి కౌనె్సలింగ్ పొందవచ్చని చెప్పారు. సిపి సందీప్ శాండిల్య మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఉత్తమ సేవలను అందించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అని అన్నారు. మురికివాడల్లో 40 శాతం వరకు భార్యాభర్తల కేసులు ఉన్నాయని, వాటి కోసమే ప్రత్యేకంగా ఫ్యామిలీ కౌనె్సలింగ్ సెంటర్ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి రాంచంద్రారెడ్డి, జిల్లా వెల్ఫేర్ అధికారి మల్లారెడ్డి, బాలానగర్ జోన్ డిసిపి సాయిశేఖర్, బాలానగర్ ఎసిపి గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ సిటిజన్లకు శుభవార్త
* సమస్యల్లో ఉన్న వారికి పోలీసుల భరోసా
* 7901114100కు వాట్సప్ చేస్తే ఊరట
* ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం
గచ్చిబౌలి, మార్చి 22: ‘కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌ను పూర్తి చేసిన ప్రభాకర్‌రావుకి ఐదుగురు కుమారులు. అందరినీ ఉన్నత చదువులు చదివించారు. అంతా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అందిరికీ వివాహలు చేసిన తరువాత అందరూ ఒకే కుటుంబంలో నివాసముంటున్నారు. కన్న తండ్రిని కమారులు బాగానే చూసుకునేవారు. కోడళ్లకు మాత్రం ఇది పడేది కాదు. తరచూ అత్తని కోడళ్లు వేధించడం భర్తలకు కోపం వచ్చేది. అంతే.. కుటుంబంలో గొడవలు మొదలు. మరో కుటుంబానికి చెందిన బాలరాజుకి ఒకే ఒక్క కొడుకు. అతనంటే వారికి ప్రాణం. కుమారుడికి పెళ్లి చేశారు. కొత్త కోడలు వచ్చిన తరువాత ఇంట్లో గొడవలు. భార్య మాట కాదనలేక తల్లిదండ్రులను కాదనక మదనపడి పోయేవాడు. తరచూ ఇంటో గొడవలు జరిగేవి. ఇదీ.. ఇద్దరు కుమారులున్న అన్నపూర్ణమ్మ కథ. భర్త చనిపోవడంతో అన్ని తానై పిల్లల్ని చదివించి పెళ్లి చేసింది. కోడళ్లు వచ్చిన తరువాత అత్తని బయటకు గెంటేశారు. ఇలాంటి సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కరం కోసం సైబరాబాద్‌లో వాట్సాప్ ఏర్పాటు చేశారు.
ఏదైనా సమస్య ఉంటే సీనియర్ సిటిజన్లు వాట్సప్ నెంబర్ 7901114100కు ఫిర్యాదు చేస్తే తగిన పరిష్కరం చూపేందుకు చర్యలు తీసుకుంటారు. సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ.. తల్లిదండ్రులను చూడకపోయినా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. కుమారుడు ఆస్తిని లాగేసుకుని తల్లిదండ్రులను బయటకు నెట్టేసినట్లు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరానికి ప్రయత్నిస్తారు’. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివాసముంటున్న సీనియర్ సిటిజన్స్ తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చునని కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఈనెల 16న వాట్సప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇప్పటివరకు ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో ఏడింటిని పరిష్కరించామని పేర్కొన్నారు. వాట్సప్, ఫేస్‌బుక్‌కు వచ్చే ఫిర్యాదులను సంబంధిత పోలీసు స్టేషన్‌కు పంపిస్తారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్.. ఇరువర్గాలను పిలిచి కౌనె్సలింగ్ చేస్తారు. పెద్దల అవసరం కుమారుడికి, కోడలికి తెలియచేస్తారు. నిష్ణాతులతో కౌనె్సలింగ్ ఇప్పించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నారు. కుటుంబ సమస్యలే కాకుండా వయోవృద్ధులను ఎవరైనా మోసం చేసినా.. ఫిర్యాదు చేయవచ్చని శాండిల్య వివరించారు. త్వరలో ఫ్యామిలీ కౌనె్సలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్ల సేవలు ప్రతి కుటుంబానికి అవసరమని కమిషనర్ వివరించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు
షాద్‌నగర్, మార్చి 22: ప్రజా సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సిపిఎం జిల్లా కార్యదర్శి భూపాల్ అన్నారు. బుధవారం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలు చేసేందుకు ప్రతి ఒక్కరు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌లో రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని, తాగునీరు, సాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందువలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కృష్ణానది నీటితో ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం మండలాలకు సాగునీరు, షాద్‌నగర్ ప్రాంతానికి తాగునీరు అందిస్తామని టిఆర్‌ఎస్ నేతలు హామీ ఇచ్చి నేడు విస్మరించారని ఆరోపించారు.
ప్రస్తుతం 25 కార్పొరేషన్ డివిజన్లు, ఏడు మున్సిపాలిటీలు, 27మండలాలతో ఉన్న రంగారెడ్డి జిల్లాలో కేవలం డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎనిమిది వేలు మాత్రమే నిర్మిస్తున్నారని వివరించారు. వీటిని కూడా టిఆర్‌ఎస్ నేతలు పంచుకునే పనిలో పడ్డారని అన్నారు. టిఎస్ ఐపాడ్ ద్వారా అనేక ప్రాజెక్టులు, కొత్త పరిశ్రమలు వస్తాయని టిఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్పలు చెబుతుంటే మరోవైపు ఉన్న పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నారని అన్నారు. 54రకాల జివోలు కాలం చెల్లినవి ఉన్న వాటిని పునరుద్దరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదని చెప్పారు. సమావేశంలో సిపిఎం నాయకులు ఎన్.రాజు, ఈశ్వర్, కుర్మయ్య, సుమన్, శివ పాల్గొన్నారు.