రంగారెడ్డి

అన్నీ ‘బడా’ కంపెనీలకేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, ఏప్రిల్ 1: బడా కంపెనీలకు ఒక్క రోజులో సకల సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వాలు, అదేవిధంగా ప్రజలకు సరిపడా వౌలిక వసతులను కల్పిచడం లేదని రాజకీయ జెఏసి చైర్మన్ ఎం.కోందడరామ్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకర్గం బాలాపూర్ మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళశాలలను ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం బిజెపి రాష్ట్ర నాయకుడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ కొలన్ శంకర్‌రెడ్డి చేపట్టిన ఒక రోజు నిరహార దీక్షకు మద్దతుగా జెఏసి చైర్మన్ కోదండరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ పెద్ద కంపెనీల ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని, హైటెక్ సిటి, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో కార్పొరేట్ సంస్థలకు రాత్రికి రాత్రి సకల సౌకర్యాలు కల్పిస్తుంటారు. అదే విధంగా ప్రజలకు ఎందకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన నిలదీశారు. పల్లెలో ఉపాధి లేక ప్రజలు నగరానికి ఉపాధి కోసం వలస వచ్చి, శివారు ప్రాంతాలలో స్థిరపడుతున్నారని తెలిపారు. నగరం విస్తరిస్తునంత వేగంగా, నగర శివారు ప్రాంతాలకు సౌకర్యాల కల్పిడం లేదన్నారు. ప్రభుత్వాలు నగర శివార్లు అభివృద్ధికి చిత్తశుద్దితో పని చేయడం లేదన్నారు. బాలాపూర్ మండలంలో ఒక్కటి కూడా ప్రభుత్వ కళశాల, ఆసుపత్రి లేకపొవడం దారుణమన్నారు. బాలాపూర్‌లో అన్ని వసతులు కలిగిన ఆసుపత్రితో పాటు జూనియర్, డిగ్రీ కళశాలల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. బాలాపూర్ మండలంతో పాటు అన్ని శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నగర శివారు ప్రాంతాల్లో గల చెరువులను శుద్ధి చేయడం అత్యవసరం అన్నారు. చెరువులో మురుగు నీరు చేరి, దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయన్నారు. దీంతో ప్రజలు అనేక రోగాల భారిన పడుతున్నారని తెలిపారు. బాలాపూర్ మండలంలో ఆసుపత్రి, జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు అయ్యేవరకు రాజీ లేని పోరాటం చేయాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జెఏసి అధ్యక్షుడు ఎదిర చల్మారెడ్డి, బిజెపి నాయకులు పెత్తుల పుల్లారెడ్డి, మాజీ ఎంపిటిసి ఏనుగు రాంరెడ్డి, బడంగ్‌పేట్, మీర్‌పేట్, జిల్లెలగూడ, జల్‌పల్లి అధ్యక్షులు నిమ్మల శ్రీకాంత్‌గౌడ్, వరికుప్పల బుచ్చి రాములు, బి.నర్సింహ్మ యాదవ్, ఎస్.శాంతకుమార్, రామిడి మహేందర్‌రెడ్డి, గడ్డం జగన్ పాల్గొన్నారు.

పేదరికాన్ని పారదోలడమే లక్ష్యం
కేంద్ర కార్మిక ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
ఘట్‌కేసర్, ఏప్రిల్ 1: పేదరికాన్ని భారతదేశం నుండి పారదోలడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అన్నోజిగూడ రాష్ట్రీయ విద్యా కేంద్రంలో మూడు రోజులుగా జరుగుతున్న పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ రాష్ట్ర శిక్షణా శిబిరంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతు దేశ సంపదను కాంగ్రెస్ కార్పొరేట్లకు దోచి పెడితే బిజెపి జాతీయ వనరుల మొదటి లబ్ధిదారుడు పేదవాడే అని స్పష్టంగా ప్రకటించిందన్నారు. ఏడు దశాబ్దాల భారత దేశ చరిత్రలో ఎంతోమంది ఆర్థికవేత్తలు ఈ దేశాన్ని పాలించి సామాన్యుడికి సాంఘిక భద్రత కల్పించలేక పోయారన్నారు. బ్యాంకులను జాతీయకరణ చేశామని చెప్పిన పార్టీలు ఒక్క పేదవానికి కూడ కనీసం ఖాతాలు ఇప్పించలేక పోయారని పేర్కొన్నారు. పేద కుటుంబం నుండి వచ్చిన ప్రధాని నరెంద్రమోదీ పేదల కోసం బిజెపి మూల సిద్దాంతం అంత్యోదయ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలన పలితంగా 19 కోట్ల కుటుంబాలకు టాయ్‌లెట్లు, 2.3 కోట్ల మందికి ముద్రా బ్యాంక్ రుణాలు, ఉజ్వల పథకం కింద మహిళలకు రెండు కోట్ల కొత్త గ్యాస్ కనెక్షన్లు యిచ్చినట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేదలను ఆదుకోవటమే లక్ష్యంగా విద్యా కేంద్రం ఆవరణలో ధనుష్ ఇన్ఫోటెక్ డిజిటల్ ఆస్పత్రిని ప్రారంభించినట్లు చెప్పారు. అతి తక్కువ ఫీజుతో అన్ని రకాల రోగాలకు పరీక్షలు జరిపి మందులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. స్థానిక పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బిజెపి అధికార ప్రతినిధి డాక్టర్ విజయ్ శంకరశాస్ర్తీ మట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలు ఒక్క బిజెపికే సాధ్యం అన్నారు. సాంఘిక అసమానతలు తొలగించి సమాజంలో నెలకొన్న దురాచారాలను పారదోలాల్సిన అవసరం ఉందన్నారు. కులాలు, మతాల పేరిట దేశాభివృద్ధిని అడ్టుకోవటం తగదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర ప్రచారక్ అలె శ్యాంజీ మాట్లాడుతూ అందరు కలిసి ఉండటం వల్ల మనుషుల మధ్య ఉన్న దూరాలు తగ్గి వ్యక్తి నిర్మాణం జరుగుతందన్నారు.