రంగారెడ్డి

యథేచ్ఛగా నీటి దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఏప్రిల్ 15: నాగారం గ్రామంలోని రాజ్‌సుఖ్‌నగర్‌లో నీటి దందా యథేచ్ఛగా కొనసాగుతున్నా, అధికారులు చోధ్యం చూస్తున్నారంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజ్‌సుఖ్‌నగర్‌లో పంచాయతీ సభ్యులు కొందరు బోరు బావుల నుండి ట్యాంకర్లకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. వేసవిలో బోర్లలోని నీరు అడుగంటు తున్నాయని, ఇళ్లలోని బోర్లలో నీళ్లు సరిపడా రావటం లేదని అన్నారు. పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయటానికి వస్తే తమపై వార్డు సభ్యులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అధికారులను కలువనీయటం లేదని వాపోయారు. అక్రమ నీటి దందాను అరికట్టాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. రోజుకు 20 ట్యాంకర్లు నీటిని అమ్ముకుంటూ జల దోపిడీకి పాల్పడుతున్నారని వాపోయారు. తక్షణమే అధికారులు తగు చర్యలు తీసుకొని శాశ్వత ప్రాతిపదికన నీటి దందాను అరికట్టాలని కోరుతున్నారు. చర్యలు తీసుకోకపోతే, సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో అక్రమ నీటి దందాపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

-- దోపిడీ దొంగతనాలతో సంతృప్తి చెందని నిందితులు --
ఎటిఎంలే టార్గెట్
కొల్లగొట్టేందుకు యత్నించిన ఇద్దరు రిమాండ్ * పరారీలో మరొకరు
10లక్షల విలువైన ద్విచక్రవాహనాలు, బంగారు అభరణాలు, సెల్‌పోన్, కెమెరాలు, గ్యాస్ కట్టర్ స్వాధీనం
ఘట్‌కేసర్, ఏప్రిల్ 15: దోపిడీ, దొంగతనాలతో సంతృప్తి చెందని ముగ్గురు దొంగలు ఏకంగా ఎటిఎంను కొల్లగొట్టేయత్నం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికి సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. నగరంలోని ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలలో దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కి పిడి యాక్టు ప్రయోగంతో సంవత్సరం పాటు జైలు జీవితం గడిపినా తీరు మార్చుకోని ఓ దొంగ మళ్లీ దొంగతనాలకు యత్నించి జైలుకు ఊచలు లెక్క పెడుతున్నాడు. మల్కాజిగిరి ఏసిపి గోనే సందీప్ శనివారం నిందితులను ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. నగరంలోని కర్మన్‌ఘట్‌లో నివాసం ఉంటున్న నెనావత్ వినోద్‌కుమార్ (25) వృత్తి అటో డ్రైవర్, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న డొంగ్రి మనిష్ (20)విద్యార్థి, సంతోష్ అనే మరో నిందితుడు (పరారీలో ఉన్నాడు) కలిసి తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నెనావత్ వినోద్‌కుమార్ గత సంవత్సరం బంజరాహిల్స్, పంజాగుట్ట, రాంగోపాల్‌పేట్, సైదాబాద్, గాంధీనగర్ పోలీసు స్టేషన్ల పరిధిలలో పది దొంగతనాలు జరిపి పట్టుబడగా నగర కమిషనర్ పిడి యాక్టు ప్రయోగించగా సంవత్సరం పాటు చంచల్‌గూడ జైలులో ఉన్నట్లు తెలిపారు. గత ఫిబ్రవరి నెలలో జైలు నుండి విడుదల అయిన నెనావత్ వినోద్‌కుమార్ సంతోష్, మనీష్‌లతో టీంగా ఏర్పడి ఘట్‌కేసర్, సంజీవరెడ్డినగర్, మేడిపల్లి, సరూర్‌నగర్, చైతన్యపురి, మీర్‌పేట్ పోలీసు స్టేషన్ల పరిధిలలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. గత నెల 25న పోలీసు స్టేషన్ పరిధి చౌదరిగూడ గ్రామంలోని ఓయు కాలనీలో దొంగతనానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న దొంగలను ఘట్‌కేసర్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇంటి తలుపులు పగులగొట్టి చేస్తున్న దొంగతనాలలో ఎక్కువ డబ్బులు లభించటం లేదని, ఒక్కసారిగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో నగర శివారులోని ఎటిఎంలను కొల్లగొట్టాలని పక్కా పథకం వేసుకున్నట్లు చెప్పారు. అందుకుగాను ఎటిఎంను కొల్లగొట్టేందుకు గ్యాస్ కట్టర్ కిట్టును నగరంలోని జంబాగ్‌లో కొనుగోలు చేశారు. ఏటిఎంలు వీలైతే బ్యాంక్‌లను కూడ కొల్లగొట్టాలనే పథకంతో గత పది రోజులుగా రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, యాదాద్రి జిల్లా భువనగిరి, బీబీనగర్, కరీంనగర్ రోడ్డులలోని ఏటిఎంల వద్ద రెక్కీ నిర్వహించి పక్కా పథకం వేసుకున్నారు. ఏటిఎంలను కట్ చేసేందుకు గ్యాస్ కట్టర్ ఉన్నప్పటికీ సిలిండర్ లభించక పోవటంతో వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. పోలీసు స్టేషన్ పరిధి కొర్రెముల చౌరస్తా సమీపంలో దొంగతనం చేసిన ద్విచక్రవాహనంపై అనుమానాస్పద స్థితిలో తిరుగుతుండగా క్రైం పోలీసులు పట్టుకుని విచారించగా తీగ లాగితే డొంక కదిలినట్లు దొంగతనాలకు పాల్పడిన నేరాలు బయటకు వచ్చినట్లు చెప్పారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుతిరుగుతున్న వినోద్‌కుమార్, మనీష్‌లను రిమాండ్‌కు తరలించినట్లు, మరో నిందితుడు సంతోష్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి పది లక్షల విలువగల నాలుగు ద్విచక్రవాహనాలు, రెండు ఎల్‌ఈడి టెలివిజన్లు, ఒక్క కంప్యూటర్, మూడు కెమెరాలు, రెండు గడియారాలు, ఒక్క సెల్‌పోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
యుట్యూబ్ ద్వారా ట్రిక్కుల ప్రయోగం
యుట్యూబ్ ద్వార హౌ టూ రాబరి అని క్లిక్ చేస్తే అన్ని వివరాలు వస్తున్నాయని, దీంతో తాము గ్యాస్ కట్టర్ కొనుగోలు చేసి ఏటిఎంను కొల్లగొట్టేందుకు యత్నించామని పట్టుబడిన దొంగలు తెలిపారు. దొంగతనాలు చేసేందుకు యుట్యూబ్ వెబ్‌లో రావటంతో కొందరు సులువుగా దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. నేరాలకు పాల్పడే ట్రిక్‌లను అప్‌లోడ్ చేయరాదని చెప్పారు. దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే ప్రతి నేరుస్థుడు తప్పకుండా పట్టుబడుతాడన్నారు. పోలీసు యంత్రాంగం ఇప్పటికే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న సంతోష్‌ను త్వరలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. ఈ సమావేశంలో ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ ప్రకాష్, క్రైం ఇన్‌స్పెక్టర్ ముని, క్రైం ఎస్సై వెంకటయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అంతర్‌రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠాలు అరెస్టు
10లక్షలు నగదు స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు
గచ్చిబౌలి, ఏప్రిల్ 15: ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు అత్యంత క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్‌ను బెట్టింగ్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. బెట్టింగ్ నిర్వాహకులు అందివచ్చిన ఏ ఆవకాశాన్ని విడిచి పెట్టడం లేదు. తమ సాంకేతిక పరిజ్జానాన్ని కూడా వినియోగించుకొని క్రికెట్ బెట్టింగ్‌లు కొనసాగిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన రెండు ముఠాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న బెట్టింగ్‌కు బ్రేకు వేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, కుషాయిగూడ ప్రాంతాలలో బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాలకు చెందిన 10మందిని ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్దనుండి సుమారు 10లక్షలు రూపాయలు నగదు 13 సెల్‌ఫోన్లు ఒక ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. లైవ్ క్రికెట్ యాప్‌తో బాల్ టూబాల్, ఒవర్ టూ ఒవర్, టీమ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగత్ తెలిపారు. సైబరాబాద్ కమిషరేట్‌లో సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖరులు సమావేశంలో లైవ్ క్రికెట్ బెట్టింగ్ వివరాలను వెల్లడించారు. ఖమం జిల్లా భద్రాచలంకు చెందిన కలకత్తా నాగరాజు (43), అదే జిల్లాకు చెందిన తుల్లూరి శ్రీనివాస్ (32), జూపల్లి చంద్ర శేకర్ (31), కలకత్తా సుబ్బారావు (46), ఇబ్రహీంపట్నంకు చెందిన గొట్టం రాజు (33), ముత్యాల సంతోష్ కుమార్ (24)తోపాటు ప్రకాశం జిల్లా ఎర్రగుంట్లపాలెంకు చెందిన వెంకటేశ్వర్లు, ఉదయకుమార్‌లు ఇబ్రహీంపట్నం సమీపంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని కమిషనర్ తెలిపారు. 8మంది ముఠాలోవెంకటేశ్వర్లు, ఉదయకుమార్‌లు పరారీలో ఉన్నారని చెప్పారు. వీరినుండి 7లక్షల, 65 వేలు నగదు, 9 సెల్‌ఫోన్లు ఒక ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు భగత్ తెలిపారు.
కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగుర్ని అరెస్టు చేశారు. ఖమం జిల్లా సత్తుపల్లికి చేందిన బత్తుల రవికుమార్ (35), కుషాయిగూడ నివాసి యాగంటి సుమన్ (28), ఎల్లాగడ్డ శ్రీ్ధర్ (32), యాకరి ప్రమోద్ (27) కుషాయిగూడలోని వివిధ ప్రాంతాల నుండి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరితో పాటు సికింద్రాబాద్‌లోని లాల్‌బజార్‌కు చేందిన అంజనేయులు గౌడ్, కుషాయిగూడకు చేందిన చింటులు బెట్టింగ్ ముఠాలో ఉన్నారని ప్రస్తుతం ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు కమిషనర్ చెప్పారు, నలుగురి నుండి 2లక్షల, 25వేల, 500 రూపాయలు నగదు నలుగురు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

రూ.35కోట్ల వ్యయంతో పర్యావరణ ఉద్యానవనం
* టెండర్లను పిలిచేందుకు సిద్ధమైన హెచ్‌ఎండిఏ
ఉప్పల్, ఏప్రిల్ 15: ప్లాట్ల అమ్మకాల ద్వారా ఆధాయ వనరులను సమకూర్చుకోవడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) మరో అడుగు ముందుకు వేస్తోంది.
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న మహానగరానికి సరికొత్త పూదోట అందాలతోపాటు వినోదాత్మక, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నగర శివారు హిమాయత్‌సాగర్ సమీపంలోని కొత్వాల్‌గూడలో పర్యావరణ ఉద్యానవనం (ఎకో-పార్క్)ను అభివృద్ధి చేయడానికి హెచ్‌ఎండిఏ కమిషనర్ చిరంజీవులు శ్రీకారం చుట్టబోతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విదంగా రూ.35కోట్ల వ్యయంతో నిర్మించబోయే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎకో-పార్కు ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలిచేందుకు సిద్దమవుతున్నారు. అద్భుతమనిపించే అందమైన పూదోటలు, కృత్రిమ ఈతకొలను, నీటి ధారలు, ప్రదర్శన శాలలు, కేబుల్ కార్ వంటి ఆహ్లాదకరమైన వాతావరణం అందించే ఉద్యానవనంపై ప్రాధమిక అధ్యయనం పూర్తయింది. కాంట్రాక్టర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకర (ఎక్స్‌ప్రెన్సన్) ఆఫ్ ఇంట్రెస్ట్)ను టెండర్ల పద్ధతిలో పిలువబోతుంది. ఇప్పటికే ఉద్యానవనంకు సంబంధించిన లావాదేవీల సలహాదారు (ట్రాన్సాక్షన్) అడ్వయిజర్‌గా దారాషా అనే ప్రైవేటు సంస్థను అథారిటీ నియమించింది. ఎకో-పార్కు కోసం అధ్యయనం, ప్రస్తుత పరిస్థితులు, అవకాశాలు, ఆర్ధికపరమైన ప్రణాళిక, ఎంపిక చేయు విధానం వంటి అంశాలపై సమగ్రమైన వివరాలతో కూడిన నివేదికను లావాదేవిల సలహాదారు అథారిటీకి గప్పగించిన విషయం తెలిసిందే. పూర్తి నివేదికను పరిశీలించిన కమిషనర్ చిరంజీవులు కాంట్రాక్టర్ల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి టెండర్లను త్వరలో పిలిచి పనులను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. 111జీవో కింద ఉన్న 85 ఎకరాల విస్తీర్ణంలో దుబాయి తరహాలో ప్రపంచ స్థాయిలో సరికొత్త అందాలతో నూతన నమూనాలతో పర్యావరణ ఉద్యానవనంను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.
జంట నగరాలకు తాగు నీరందించే హిమాయత్‌సాగర్‌కు సమీపంలో అవుటర్ రింగ్‌రోడ్డులో పర్యావరణ ఉద్యానవనంను ఏర్పాటు చేస్తే పర్యాటక కేంద్రంగా హైదరాబాద్ మరోసారి ప్రపంచ పఠంలోకి ఎక్కబోతుందని చెప్పవచ్చు.
పార్టీలో గ్రూపులు వద్దు
* రెండు ఏళ్లల్లో భారీ నిధులు
* వికారాబాద్ ఎమ్మెల్యే బిఎస్‌ఆర్
వికారాబాద్, ఏప్రిల్ 15: పార్టీలో గ్రూపులను ప్రోత్సహించవద్దని, గ్రూపులు చేయవద్దని వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను ఎవరు తిట్టారో తెలుసునని, ఎవరినీ తాను తిట్టలేదని, ఎవరి వద్ద రూపాయి తీసుకోలేదని స్పష్టం చేశారు. పది రోజులుగా నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ వ్యవహారాలు చూస్తున్నామని చెప్పారు. నియోజకవర్గానికి ఇప్పటి వరకు మంత్రి, ఎంపి, తనకు సంబంధించి 15 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, రెండేళ్ళలో భారీ నిధులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు గ్రామాల్లో పర్యటించగా సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు భేషుగ్గా అమలవుతున్నాయని తెలిపారు. పార్టీ సభ్యత్వంలో వెనుకబడి ఉన్నామని, సభ్యత్వ నమోదు రుసుము 13 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం నాలుగు లక్షలే చెల్లించామని అన్నారు. ప్రమాదవశాత్తు చనిపోతే సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు పార్టీ రెండు లక్షల రూపాయల బీమా చెల్లిస్తుందని వివరించారు.
అధ్యక్షుడిగా ప్రభాకర్‌రెడ్డి
వికారాబాద్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు డి.ప్రభాకర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శిగా టి.శంకర్ ఎన్నికవగా, వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షుడిగా వెంకటయ్య, ధారూర్ మండల పార్టీ అధ్యక్షుడిగా వేణుగోపాల్‌రెడ్డి, మర్పల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా సురేష్, మోమిన్‌పేట అధ్యక్షుడిగా మహంత్‌స్వామిలు ఎన్నికయ్యారు.

కళాకారులకు ప్రోత్సాహం
హైదరాబాద్, ఏప్రిల్ 15: కళాకారులకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపుతోపాటు ప్రోత్సాహం లభిస్తోందని గిరిజన సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ అన్నారు. శనివారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో తెలంగాణ పర్యాటక శాఖ శృతిలయ మ్యూజిక్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శతగాత్ర స్వర సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి చందూలాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులను అభినందిస్తూ సాయి మనప్రగడ (సంగీతం), కాసర్ల శ్యామ్ (సాహిత్యం), ఇందిరా పరాశరం (కూచిపూడి నృత్యం)లకు శృతిలయ కళా పురస్కారాలను మంత్రి ప్రదానం చేసారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ప్రభుత్వ ఉప కార్యదర్శి గుదిబండి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత వందమంది చిన్నారులతో సంగీత కార్యక్రమం వీనుల విందుగా సాగింది.

తెలంగాణలో పద్యం సజీవం
హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సర్వేశ్వర ఆర్ట్ అకాడమీ శనివారం సాయంత్రం రవీంద్రభారతి ఘంటసాల ప్రాంగణంలో ‘పద్య తోరణం’ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గాయకులు ప్రియ, ప్రవీణ్ కుమార్, సాయి హారిక, నాగప్రియ, హరిప్రియ, శే్వత, బిందు, గణేశ్, పవన్‌కుమార్, పారిజాత తదితరులు పౌరాణిక నాటకాలలోని కొన్ని ఆణిముత్యాలవంటి పద్యాలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తొలుత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరుగున పడిన పద్యాన్ని వెలికితీసి ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రమణాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు కె.ఎమ్.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వచ్చే సాధారణ ఎన్నికల్లో
కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపిదే అధికారం
* బద్దం బాల్ రెడ్డి ధీమా
చేవెళ్ల, ఏప్రిల్ 15: వచ్చే సాధారణ ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని మిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బద్దం బాల్‌రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్లలోని సిహెచ్‌ఆర్ గార్డెన్‌లో భాజపా చేవెళ్ల నియోజకవర్గంస్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షణీయులై ఇతర పార్టీల నుండి బిజెపిలో చేరుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ముఖ్యమంత్రి కెసిఆర్ తమ పథకాలుగా చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో తెరాసకు ప్రజలు తొందరలోనే తగిన బుద్ధి చెప్పనున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. ముస్లింలను మభ్యపెట్టడానికే 12 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామని చెప్పుతున్నారని వివరించారు. కాగా, భాజపా మండల అధ్యక్షునిగా దేవర పాండు రంగారెడ్డిని నియమించారు. ఈ మేరకు బద్దం బాల్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌రాజ్, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి చేతుల మీదిగా నియామక పత్రం అందజేశారు.

ఉద్యమంలో పోరాడిన వారికి
గుర్తింపు: ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
రాజేంద్రనగర్, ఏప్రిల్15: తెలంగాణ సాధనలో పోరాడిన నాయకులకు టిఆర్‌ఎస్‌లో ప్రత్యేక స్థానం కల్పిస్తామని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. శనివారం మైలార్‌దేవ్‌పల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాజేంద్రనగర్ సర్కిల్లోని నాలుగు డివిజన్ల టిఆర్‌ఎస్ అధ్యక్షులను అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని, ఆశావాహులకు ఎలాంటి అన్యాయం జరుగకుండా చూస్తానన్నారు. కార్పొరేటర్ల అభిప్రాయాలను తీసుకొని రాబోయే 2019 ఎని