రంగారెడ్డి

అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయం: మంత్రి ఈటల రాజేందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, ఏప్రిల్ 18: అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఇటీవల ఐకెపి, విఓఎల వేతనాలు పెంచడంతో మంగళవారం పెద్దఅంబర్‌పేట్‌లో అన్ని జిల్లాల విఓఎ, ఐకెపిలు అభినందన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో విఓఎలు, ఐకేపిలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టనుందని అన్నారు. విఓఎలు, ఐకేపిలకు ప్రభుత్వం అందిస్తున్న డబుల్‌బెడ్‌రూమ్‌లో ఇళ్లు కేటాయించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విఓఎల రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు, కార్మికశాఖ అధ్యక్షులు రూప్‌సింగ్, గంగిరెడ్డి, సుదర్శన్, నర్సయ్య, శారద, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

కెమికల్ గోదాంలపై దాడులు
* పలు సంస్థల సీజ్, నోటీసుల జారీ
జీడిమెట్ల, ఏప్రిల్ 18: జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పలు కెమికల్ గోదాంలకు అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. అక్రమంగా కొనసాగుతున్న కెమికల్ వ్యర్థ రసాయన గోదాంలను సీజ్ చేయడంతో పాటు పలు పరిశ్రమలకు నోటీసులను జారీ చేశారు. పిసిబి, ఐలా, జిహెచ్‌ఎంసి, ఫైర్, పోలీసు, రెవెన్యూ విభాగాల అధికారులు సంయుక్తంగా కెమికల్ గోదాములు, పరిశ్రమలపై దాడులు చేపట్టారు. జీడిమెట్ల, రాంరెడ్డినగర్, సుభాష్‌నగర్, దూలపల్లి తదితర ప్రాంతాల్లోని కెమికల్ గోదాంల్లో ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమంగా కొనసాగుతున్న గోదాములను అధికారులు సీజ్ చేశారు. మొత్తం 12 గోదాంలను అధికారులు సీజ్ చేయగా పలు పరిశ్రమలకు నోటీసులను జారీ చేశారు. అక్రమంగా కొనసాగుతున్న గోదాంలు, పరిశ్రమలలో సంబంధిత పత్రాలను పరిశీలించి యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు. నోటీసు ప్రకారం గడువులోగా గోదాంలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. మంత్రి కెటిఆర్ రాకతో ఎట్టకేలకు అధికారులు స్పందన వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి వ్యర్థ రసాయన గోదాంలతో నిత్యం నరకం చూస్తున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుని, కెమికల్ గోదాంలను ఎత్తివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

రేపటి నుంచి శ్రీచీర్యాల లక్ష్మీనృసింహస్వామి
నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు
కీసర, ఏప్రిల్ 18: శ్రీచీర్యాల లక్ష్మీనృసింహస్వామి నవమ వార్షికోత్సవాలు గురువారం 20 వ తేదీ నుండి 23 వ తేదీ ఆదివారం వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ తెలిపారు. ఇప్పటికే చలువ పందిళ్లు, వన్‌వే వెహికిల్ పార్కింగ్, మంచినీటి సౌకర్యం, తదితర ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బ్రహ్మోత్సవాలు మూడు రోజులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈసారి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున విఐపిలు వచ్చినప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తుతో పాటు ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినీప్రముఖులు, పలువురు విఐపిలు బ్రహ్మోత్సవాలకు హాజరు కానున్నట్లు తెలిపారు. గురువారం శ్రీ స్వామి వారి గ్రామోత్సవం, శుక్రవారం స్వామి వారికి బాలభోగము, నవ కలశాభిషేకాలు, అఖండ జ్యోతి స్థాపన, అగ్నిప్రతిష్ఠ, ఆరాధన, మహానివేదన, శాత్తుమరైతీర్థ ప్రసాద వినియోగం, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణము, సాయం ఆరాధన శనివారం శ్రీలక్ష్మీనృసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవము, ఆదివారం శ్రీసుదర్శననారసింహ హోమం తదితర పూజాకార్యక్రమాలతో పాటు ప్రముఖులచే లక్ష్మీనృసింహస్వామి గీతాలాపనలు ఉంటాయన్నారు.