రంగారెడ్డి

ఎటిఎం నుండి డబ్బులు డ్రా: నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటిఎం నుండి డబ్బులు డ్రా: నిందితుడి అరెస్టు
మేడ్చల్, ఏప్రిల్ 22: ఎటిఎం నుండి డబ్బులను డ్రా చేసిన ఓ నిందితున్ని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్‌పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పారిశ్రామికవాడలోని ఎఎన్ ఇంజనీరింగ్ కంపెనీలో పట్టణంలోని ఉమానగర్ కాలనీలో నివాసం ఉండే షేఖ్ మిరాజ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా ఈ నెల 19వ తేదీన మిరాజ్ మేడ్చల్ పోలీసులకు 25 రోజుల క్రితం తన మనీపర్సు పోయిందని అందులో ఎటిఎం కార్డుతో పాటు దాని పిన్ నంబర్ కూడా ఉందని తన అకౌంట్ నుండి రూ. 73వేలు డ్రా కూడా చేశారని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న నేరవిభాగం ఎస్‌ఐ గ్యార పవన్‌కుమార్ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తాళపల్లి గ్రామానికి చెందిన మదర్‌బాషా(21) ఆర్‌ఎస్‌ఎస్ కంపెనీ తరఫున ఎఎన్ ఇంజనీరింగ్‌లో సెక్యూర్టీగార్డుగా రెండు నెలల క్రితం పనిలో కుదిరాడు. కాగా కంపెనీలో పనిచేసే కార్మికులు విధుల్లోకి చేరేముందు బట్టలను మార్చుకోని కంపెనీ డ్రెస్ వేసుకుంటారు. దీంతో సెక్యూరిటీగార్డు బాషాకు దురాలోచన కలిగి మిరాజ్ ప్యాంటులో నుండి మనీపర్సు దొంగలించి చూడగా అందులో ఎటిఎంకార్డు లభించిండంతో పాటు కార్డుకు సంబంధించిన పిన్ నంబర్ కూడా వ్రాసివుంది. ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఇప్పటి వరకు ఎటిఎంకార్డు నుండి మొత్తం 30 సార్లు రూ. 73వేల వరకు నగదు డ్రా చేసి తాను ఉంటున్న అద్దె ఇంటిలో దాచిపెట్టాడు. శనివారం మేడ్చల్ మార్కెట్ రోడ్డు అనుమానంపై మదర్‌బాషాను నేరవిభాగం ఎస్‌ఐ గ్యారపవన్‌కుమార్ సిబ్బంది అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు ఇన్స్‌పెక్టర్ వివరించారు. నిందితుడి వద్ద నుండి రూ. 73వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
నిజాయితీ చాటుకున్న
ఆటో డ్రైవర్
బాలాపూర్, ఏప్రిల్ 22: ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ప్రియాంక అనే మహిళ నగరంలోని అల్మాస్ గూడ వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అయితే..ఆటోలో 5తులాల బంగారు గొలుసును పోగొట్టుకుంది. దానిని గమనించిన ఆటో ట్రైవర్ మల్లేష్ ఆ బంగారు గొలుసును మీర్‌పేట పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. కాగా తన బంగారు గొలుసు పోయిందని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గొలుసు ప్రియాంకదేనని నిర్ధరణకు వచ్చి ఆ బంగారు గొలుసును ఆమెకు అప్పగించారు. కాగా బంగారు గొలుసును అప్పగించి తన నిజాయితీని చాటుకున్న ఆటోడ్రైవర్ మల్లేష్‌కు రూ. 3వేలను రివార్డుగా అందజేశారు.

విద్యార్థి దశలోనే
భవిష్యత్ ప్రణాళిక
ఎమ్మెల్యే కెపి వివేక్ హితవు
జీడిమెట్ల, ఏప్రిల్ 22: విద్యార్థి దశలోనే భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ సూచించారు. రంగారెడ్డినగర్ డివిజన్ గాంధీనగర్‌లోని స్కైటన్ ఫంక్షన్ హాల్‌లో మదర్సా నాసిర్ ఉల్ ఉలూమ్ 26వ వార్షికోత్సవ వేడుకలను వివేక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకువెళ్తే.. సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు సూచించిన బాటలో పయనించి ఉన్నతమైన విద్యతో దేశానికి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, హెచ్‌ఎం ఖలీముల్లా ఖాన్, నాయకులు అబ్దుల్ ఖాదర్, విద్యార్థులు పాల్గొన్నారు.

చీర్యాలలో కన్నుల పండువగా
శ్రీలక్ష్మీనృసింహుడి తిరుకల్యాణం
వేలాదిగా తరలివచ్చిన భక్తజనం * పట్టువస్త్రాలు సమర్పించిన సమాచార శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్
మేడ్చల్, ఏప్రిల్ 22: కీసర మండలంలోని చీర్యాల ప్రాంతంలోని శ్రీలక్ష్మీ నృసింహ్మ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా వేలాది భక్తుల సమక్షంలో పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనృసింహ గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఆలయ నవమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు నలందిగర్ నరసింహచార్యుల ఆధ్వర్యంలో లక్ష్మీనృసింహ గాయత్రి వేద విద్యార్థి పరిషత్‌కు చెందిన పండితులు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవ ఘటాట్టలను భక్తులకు వివరించారు. ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ, ధర్తకర్త శ్రీహరి, రాష్ట్ర పౌరసంబంధాల, సమాచారశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, షాప్ మాజీ సంచాలకులు రాజ్‌ఠాకుర్ దంపతులు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని తరించారు. ప్రత్యేక పూజలలో భాగంగా స్వామివారికి నవకలశ అభిషేకం, శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణము, శ్రీసుదర్శన నారసింహ యాగం నిర్వహించారు. స్వామివారి తిరుకల్యాణాన్ని తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కళాకారుల, విద్యార్థుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అకట్టుకున్నాయి. కల్యాణమహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సమాచార కమిషనర్ నవీన్‌మిట్టల్, మేడ్చల్ ఎమ్మేల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన ఎమ్మేల్సీ, గ్రేటర్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, ఆందోళ్ ఎమ్మేల్యే బాబుమోహన్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ది మోహన్‌రెడ్డి, డాక్టర్ సాయిగారి మల్లారెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు నక్క ప్రభాకర్‌గౌడ్, అల్వాల్ డివిజన్ ఉప కమిషనర్ ఎ. రమేశ్, ఉప్పల్ డివిజన్ ఉప కమిషనర్ విజయ్ కృష్ణ తదితరులకు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికికారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ ఎం. లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరి ప్రముఖులును శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాలను బహుకరించారు.

సేంద్రియ సాగువైపు రైతును మళ్లించాలి
జాతీయ సదస్సులో చినజీయర్ స్వామి సూచన
రాజేంద్రనగర్, ఏప్రిల్ 22: తక్కువ రసాయనాలతో పంటలు పండించే విధానాలపై రైతులలో అవగాహన పెంచాల్సిన అవసరం త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణరాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం ప్రారంభమైన జాతీయ సదస్సులో ఆయన మధ్యాహ్నం పాల్గొని శాస్తవ్రేత్తలకు ఆశీర్వచనాలతో పాటు పలు సూచలను చేశారు. రసాయనిక ఎరువులు వాడకం పెరగడం, హైబ్రిడైజేషన్ వల్ల భూమి సమతుల్యత దెబ్బ తింటుందని చెప్పారు. భూమి తన శక్తిని కోల్పోని విధంగా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడంపై రైతులను మళ్లించాలని సూచించారు. మానవసేవ చేస్తే మాధవ సేవ చేసినట్లు కాదని, మనుషులు తమ స్వార్థం భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు కల్గించేలా చేస్తున్నారన్నారు. మాధవ సేవ చేయడమంటే భూమిపై ఉన్న అన్ని జీవరాశుల మనుగడను కాపాడటమేనన్నారు. ఇది జరుగకుండా చూడాలని శాస్తవ్రేత్తలకు సూచించారు. మనిషి తాను బతుకడం కోసం గాలిని, నీటిని, భూమిని సర్వస్వాన్ని కలుషితం చేస్తున్నారన్నారు. పంటలకు సరైన ధరలు ధరలు లభించేలా ప్రభుత్వాలు చూడాలని సూచించారు. రైతులు ఒత్తిడిని అధిగమించేలా విధానాలు ఉండాలని ఆయన తెలిపారు. రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఎకరాకు రూ.4 వేలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్‌రావు, సర్వారెడ్డి వెంకురెడ్డి డెవ్‌లెప్‌మెంట్ చైర్మెన్ డాక్టర్ ఎస్.వెంకురెడ్డి, అహోబిలం స్వామిజీ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నేత నర్సారెడ్డి
ఆదర్శప్రాయుడు
‘మై లైఫ్ ఆటోబయోగ్రఫీ’ పుస్తకావిష్కరణ సభలో వక్తలు
కాచిగూడ, ఏప్రిల్ 22: మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నర్సారెడ్డి అందరికీ ఆదర్శప్రాయుడని పలువురు వక్తలు కొనియాడారు. నర్సారెడ్డి రచించిన ‘మై లైఫ్ ఆటోబయోగ్రఫీ’ పుస్తకావిష్కరణ సభ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని గోల్డెన్ జూబ్లి బ్లాక్‌లో నిర్వహించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సారెడ్డి కాంగ్రెస్‌లో అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. నర్సారెడ్డి సేవలు కాంగ్రెస్‌కు ఎంతో అవసరమన్నారు. ప్రగతిశీల ఆలోచనలతో పార్టీని ముందుకు తీసుకుపోవాలని అకాక్షించారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా పుస్తకాన్ని రచించారని కీర్తించారు. పుస్తకాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నర్సారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో జిల్లాస్థాయి నుంచి పార్టీ మంత్రిగా ఎదిగి అనేక పదవులలో కాంగ్రెస్‌కు సేవలందించిన గొప్పవ్యక్తి అని కొనియాడారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను పుస్తక రూపంలో అందించారని పేర్కొన్నారు. యువతకు నర్సారెడ్డి జీవిత లక్ష్యలను తెలియజేయాలన్నారు. మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ నర్సారెడ్డి అందరికి మార్గదర్శకుడని తెలిపారు. నర్సారెడ్డి రెవెన్యూ శాఖమంత్రిగా పదవులో ఉన్నప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఎనిమిది లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనికే దక్కుతుందన్నారు. శాసనసభా పక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ నర్సారెడ్డి జీవితం ఆత్మకథగా పుస్తక రూపంలో తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పుస్తకం రాజకీయ, పౌర సమాజానికి ఎంతో అవసరమన్నారు. నర్సారెడ్డి ప్రభావితం వల్లే తాను రాజకీయాల్లోకి రావాలని ప్రేరణ కలిగిందన్నారు. మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ నర్సారెడ్డి వ్యవసాయ కుటుంబలో జన్మించి చిన్నతనంలో ఎదుర్కొన్న సమస్యలను పుస్తకంలో తెలియాజేశారని వివరించారు. తాను నమ్ముకున్న సిద్దాంతాల కోసం పని చేశారని తెలిపారు. ప్రసుత్త రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయని, రాజకీయాల నుంచి తప్పుకోకుండా కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి పాల్వాయి గోవర్థన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు షబీర్‌అలీ, కమలాకరరావు, నిరంజన్, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాల కార్మికులుగా మారిన
హెచ్‌ఐవి బాధితులు
* ఆశ్రయం పేరుతో డ్రైనేజీ పనులు చేయిస్తారా?
* స్వచ్ఛంద సంస్థ పని తీరుపై ప్రజల ఆగ్రహం
* సంస్థ నిర్వాహకులపై చర్యలు
తీసుకోవాలని బిజెవైఎం పోలీసులకు ఫిర్యాదు
ఉప్పల్, ఏప్రిల్ 22: నిలువ నీడలేని అభం శుభం తెలియని అనాద హెచ్‌ఐవి బాధితులు ఆశ్రయం కోసం వస్తే వారిచే పనులు చేయించుకుంటూ బాల కార్మికులుగా మార్చిన ఓ స్వచ్చంద సంస్థ పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ చదువుకునే వయసులో వారి ఆలనా పాలనా మరిచి వారిచే డ్రైనేజీ పనులు చేయిస్తారా అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ భారతీయ జనతా యువమోర్చ (బిజెవైఎం) నేతల సహకారంతో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే...ఉప్పల్ స్వరూప్‌నగర్‌లో ఆగాపే ఆర్ఫాన్ స్వచ్చంద సంస్థ ఉంది. యునైటెడ్ స్టేట్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో నడుస్తున్న సంస్థకు సంబంధించిన ఏడు భవనాల్లో ఇది ఒకటి. ఇక్కడికి వచ్చిన చిన్నారులకు ఆశ్రయంతో పాటు చదువు చెప్పించె విద్యాసంస్థలు ఉన్నాయి. ఆర్ఫాన్ స్వచ్చంద సంస్థలో ప్రస్తుతం ఉన్న 50 మంది హెచ్‌ఐవి పాజిటివ్ బాధితులు ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న ప్రభుత్వ నీలోఫర్, గాంధీ, ఉస్మానియా వంటి ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం వచ్చిన అనాద, హెచ్‌ఐవి పాజిటివ్ బాధితులను ఇలాంటి స్వంస్థలకు పంపిస్తున్న విషయం తెలిసిందే. ఉచితంగా భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తుండటంతో హోంలో ఉంటున్న చిన్నారులు నిర్వాహకులు ఏమి చెప్పినా చేయాల్సిందే. ఈ క్రమంలో శనివారం సంస్థ బయట డ్రైనేజీ సెప్టిక్ ట్యాంక్‌లో నుంచి విషపూరితమైన మురికి నీటిని చిన్నారులచే బలవంతంగా తీయిస్తుండగా స్థానికులు చలించిపోయారు. ఇదేమి పని అంటూ పని చేయిస్తున్న వార్డెన్ ప్రజావతిని నిలదీస్తూ మండిపడ్డారు. చదువుకునే చిన్నారులచే పనులు చేయిస్తూ బాలకార్మికులుగా మారుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి బాలల హక్కుల సంఘం సహకారంతో నిర్వాహకులను పోలీసులకు పట్టించారు. విషయం తెలుసుకున్న బిజెవైఎం నాయకులు రేవెల్లి రాజు, విఠల్, బిజెపి నాయకులు మంకాల లక్ష్మణ్, జి.శ్రీనివాసశర్మ సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవింద్ ఫిర్యాదుతో ఆగాపె స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు

ఏట్ల ఏర్రవల్లిలో
దళితుల ఆందోళన
* గుడిలో కొబ్బరికాయలు కొట్టినందుకు అగ్రవర్ణాల వేధింపులు
* రెండు రోజులుగా తాగునీరు, విద్యుత్ సరఫరా బంద్
* షాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు బాధితుల ధర్నా
షాబాద్, ఏప్రిల్ 22: గ్రామాల్లో నిరుపేదలపై అగ్రవర్ణాల అరాచకాలు కొనసాగుతున్నాయి. శనివారం షాబాద్ మండల పరిధి లోని ఏట్ల ఏర్రవలి గ్రామంలో గత రెండు రోజులుగా నూతనంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని దళితులంతా స్వామి వారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో అదే గ్రామానికి చెందిన అగ్ర కులస్థులు దళితులను దేవాలయంలో ఎందుకు పూజలు చేశారని ఆగ్రహించి రెండు రోజులుగా ఎస్సీ వాడకు తాగునీరు, విద్యుత్ సరఫర వౌలిక సదుపాయాలు బంద్ చేశారని ఆరోపించారు. నాగర్‌గూడ నుండి షాబాద్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం షాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈకార్యక్రమంలో దళిత కులాల మండల కార్యదర్శి ముక్యువిశ్వం, మహేష్, దేశమల్ల అంజనేయులు, భీంభరత్, రవికుమార్, దళిత నాయకులు డిమాండ్ చేశారు.

నిరుద్యోగులకు సదవకాశమే జాబ్‌మేళా
వికారాబాద్, ఏప్రిల్ 22: నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లాలో పెద్ద మొత్తంలో జాబ్‌మేళాను నిర్వహించినట్లు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 19 వివిధ కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు. కంపెనీల్లో పదో తరగతి నుండి డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగులు అవకాశం పొందవచ్చని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో కంపెనీలు లేనందున స్థానిక ఎమ్మెల్యే కోరిక మేరకు ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చా రు. భవిష్యత్‌లో నియోజకవర్గాల వారీగా జాబ్‌మేళాలను నిర్వసించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జాబ్‌మేళాకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దరఖాస్తులు అందజేశారు. కార్యక్రమంలో వికారాబా ద్ శాసనసభ్యుడు సంజీవరావు, మార్కె ట్ కమిటి చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి, జడ్పిటిసి ముత్తార్‌షరీఫ్, డిఆర్‌డివో జాన్సన్‌లు పాల్గొన్నారు.

వౌలిక వసతుల కల్పనకై కృషి చేద్దాం
ఉప్పల్, ఏప్రిల్ 22: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని మురికి వాడల్లో నివసిస్తున్న నిరుపేద ప్రజలకు వౌళిక వసతుల కల్పనకై శనివారం వైస్ చాన్సలర్ ఎస్.రామచంద్రంతో ఉప్పల్ ఎమ్మె ల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ భేటీ అయ్యారు. ఓయూ పరిధిలోని క్యాంప్ నెంబర్ ఒకటి నుంచి నుంచి ఐదు వరకు ఉన్న కాలనీలలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు దుర్భర జీవనం గడుపుతున్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు విద్యుత్, తాగునీరు. మరుగుదొడ్లు వంటి వౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో తక్షణమే స్పందించి అత్యవసర సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేదా అనుమతి ఇస్తే జిహెచ్‌ఎంసి నుంచి సౌకర్యాలను కల్పించగలమన్నారు. వసతుల విషయంలో పై అధికారుల దృష్టికి తీసికెళ్లి చర్యలు తీసుకుంటామని విసి చెప్పిట్లు సమాచారం.

మైనింగ్ ప్రభావిత గ్రామాల అభివృద్ధి
వికారాబాద్, ఏప్రిల్ 22: గనులు, సంబంధిత పరిశ్రమల ప్రభావిత గ్రామాల్లో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుండి తొమ్మిది కోట్ల రూపాయలు జిల్లా మినరల్ ట్రస్ట్ ఫండ్ కింద మంజూరైనట్లు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తహశీల్దార్లు, ఎంపిడివోలు, మైనింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని చెప్పారు. మైనింగ్ ఏరియా ప్రజల సౌకర్యార్థం తాగునీరు, పర్యావరణ పరిరక్షణ, వైద్య, విద్య, మాతా శిశు మరణాల సంక్షేమం, వయోవృద్ధులు, దివ్యాంగులు నైపుణ్యం పెంపొందించుకునేందుకు, పారిశుధ్యానికి 60 శాతం నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. మిగిలిన 40 శాతం నిధులతో గ్రామాల్లో వౌలిక సదుపాయాలు, నీటి పారుదల, విద్యుత్, వాటర్‌షెడ్ అభివృద్దికి సంబంధించిన ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా మినరల్ ట్రస్ట్ ఫండ్ కింద సౌకర్యాలు కల్పించేందుకుగాను 70 గ్రామాలు ఎంపిక చేయబడ్డాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ డి.దివ్య మాట్లాడుతూ కిసాన్‌మిత్ర హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫోన్‌కాల్స్‌పై ప్రతి సోమవారం మండల కమిటీలో సమీక్షించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారి డివిజన్ స్థాయిలో, నెలకోసారి జిల్లా స్థాయిలో ఫోన్‌కాల్స్‌పై రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఫోన్‌కాల్స్‌ను తీసుకోవడమే కాకుండా అతని సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో వెళ్ళి సమస్యపై సంబంధిత అధికారులతో చర్చించి వారి సమస్యను తీర్చినపుడే అది సార్థకమవుతుందని స్పష్టం చేశారు. బొంరాస్‌పేట్, దౌల్తాబాద్, కొడంగల్ మండలాల్లో పంట నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమకాని వారిని గుర్తించి వారి ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్, సబ్‌కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, డిఆర్‌వో జి.సంధ్యారాణి, డిఆర్‌డివో జాన్సన్, ఆర్డీవో విశ్వనాథం, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోపాల్, మైనింగ్ ఎడి సామెల్ జాకబ్, ఎంపిడివో, తహశీల్దార్లతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పొలాల్లో పంటలను పరిశీలించి నమోదు చేసేందుకు విఆర్‌వోలకు ట్యాబ్‌లను మంత్రి అందజేశారు.

విద్యుత్ పొదుపు అందరి బాధ్యత
సెక్యూరిటీ గార్డులను సత్కరించిన ఉప కమిషనర్
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22: నిత్య జీవితంలో అత్యంత ముఖ్యమైన విద్యుత్‌ను పొదుపు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చందానగర్ సర్కిల్ 12 ఉప కమిషనర్ వి.మమత అన్నా రు. శనివారం రప్రపంచ ధరిత్రి దినోత్సవం (వరల్డ్ ఎర్త్ డే) ను పురస్కరించుకుని చందానగర్‌లోని సర్కిల్ 12 కార్యాలయంలో సెక్యూరిటీ గార్డులు బాబ్జీ, అబ్రహంలను డిప్యూటీ కమిషనర్ మమత శాలువాతో