రంగారెడ్డి

తెలంగాణలో తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 23: తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని సిఎం కెసిఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ. 40 వేల కోట్లతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తూ బంగారు తెలంగాణ సాధన కోసం చేస్తున్న అవిరళ కృషికి ఆకర్షితులై ఆయా పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం అత్వెల్లి పరిధిలోని శాంతబయోటెక్ ఎ సనోఫి కంపెనీ, బిఎస్ స్టీల్ కంపెనీ, రొటోఫ్లెక్స్ కంపెనీలకు చెందిన వైఎస్‌టియుసికి కార్మిక నాయకులు పలువురు కార్మికులు అప్పమ్మగారి రాంరెడ్డి ఆధ్వర్యంలో సుధీర్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.
పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన చేరికల సందర్భంగా ఎమ్మెల్యే చేరిన వారికి పార్టీ గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా టిఆర్‌ఎస్ సర్కార్ పనిచేస్తుందని పేర్కొన్నారు. దేశంలోనే ఏవరు చేయని విధంగా మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ, తదితర బృహత్తరమైన పథకాలతో టిఆర్‌ఎస్ దూసుకెళ్తుందని వివరించారు. వచ్చే సంవత్సరం నుండి రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ప్రభుత్వమే రూ. 8వేలు ఆర్ధిక సహయాన్ని అందించనుందని తెలిపారు.
టిఆర్‌ఎస్ అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో అత్యంత ఆదరణ పొందడంతో ఓర్వలేని ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. పార్టీ శ్రేణులు సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా కృషి చేసి వారికి మరింత చేరువకావాలని సూచించారు. కొత్త పాత తేడా లేకుండా అందరు కలిసికట్టుగా ముందుకు సాగుతూ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే విధంగా అంకితభావంతో పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ సత్యనారాయణ, సర్పంచ్‌లు రాజమల్లారెడ్డి, నరేందర్‌రెడ్డి, నాయకులు భాస్కర్ యాదవ్, నందారెడ్డి, మర్రి నర్సింహ్మరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఎన్. నర్సింహ్మరెడ్డి, మోనార్క్, పి, రవీందర్, నాగరాజు, శివకుమార్, కాశీ తదితరులు పాల్గొనగా చేరిన వారిలో మురళీకృష్ణ, అక్రంపాషా, సంతోష్, సాయిలు, శ్రీనివాస్, దేవేందర్, నవీన్, శ్రీకాంత్, కవిత, అనురాధ తదతర కార్మికులు ఉన్నారు.

మండే ఎండల్లో కూలీల అవస్థలు

వౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు వేసవిలో కనిపించని టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు
ఇంటి నుండే తాగునీటిని తెచ్చుకుంటున్న కూలీలు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం

కేశంపేట, ఏప్రిల్ 23: ఎండలను లెక్కచేయకుండా ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు వౌలిక సదుపాయాలు అధికారులు కల్పించకపోడంతో అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలం ప్రారంభమైందంటేనే కూలీలకు టెంట్లు, ప్రథమ చికిత్స కిట్స్, నీటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉంటుంది. కానీ ఇవేమి పట్టించుకోకుండా ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకు పనులకు తీసుకువెళ్లి చేయించుకుంటున్నారే తప్ప వౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని కూలీలు మహాలింగం, రమేష్, మల్లేష్, లింగం, శేఖర్, యాదయ్య, రాములమ్మ, పర్వతాలు, వెంకటయ్య, లాలయ్య, యాదమ్మ, జంగమ్మ, కృష్ణవేణి, కృష్ణయ్య, శాంతయ్య, సురేష్, రవి, శ్రీదేవి, ఎల్లమ్మ, లక్ష్మమ్మ, లక్ష్మీ ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పనులు త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో వేగం పెంచాలని అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారే తప్పా సౌకర్యాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని అంటున్నారు. కేశంపేట మండల పరిధిలోని కాకునూరు, కొత్తపేట, కూండారెడ్డిపల్లి, పోమాల్‌పల్లి, లింగంధన, తొమ్మిదిరేక తదితర గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారు. మండలంలోని 19గ్రామ పంచాయతీలకు 18గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. వీటిలో ఏ ఒక్క గ్రామానికి కూడా టెంట్లు, ప్రథమ చికిత్స కిట్స్, నీటి సౌకర్యం కల్పించలేదని కూలీలు వాపోతున్నారు. గత ఏడాది కంటే ప్రస్తుత వేసవి కాలంలో 43డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, దీన్ని తట్టుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించాలని మండల ఉపాధి హామీ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉపాధి కూలీలకు అన్ని వౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ స్థానిక అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కూలీ డబ్బులు సైతం సకాలంలో చెల్లించడం లేదని, ఇదేమని ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రశ్నిస్తే ప్రభుత్వం నుండి నిధులు రాలేవు.. వచ్చిన వెంటనే చెల్లిస్తామని చెబుతున్నారని కూలీలు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.
ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పిస్తున్నాం
* కేశంపేట ఉపాధి హామీ ఎపిఓ కృష్ణ
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు వౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేశంపేట ఉపాధి హామీ ఎపిఓ కృష్ణ అన్నారు. మండలంలో మొత్తం 505 గ్రూపులు ఉండగా 315గ్రూపులు మాత్రమే పనిచేస్తున్నాయని, వీటిలో 7484జాబ్‌కార్డులు ఉన్నాయని వివరించారు. 19గ్రామ పంచాయతీలకు 18గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. పనిచేస్తున్న గ్రూపులకు టెంట్లు, ప్రథమ చికిత్స కిట్స్, నీటి వసతి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వడదెబ్బకు గురికాకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రెడ్లకు రిజర్వేషన్‌ను కెసిఆర్ కల్పిస్తారు

వికారాబాద్, ఏప్రిల్ 23: రెడ్డిల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పి.సునీతారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కొండా బాలకిష్టారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ రెడ్డి మహిళా వేదిక వికారాబాద్ జిల్లా సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మైనారిటీలకు సిఎం కెసిఆర్ 12 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నారని, భవిష్యత్‌లో రెడ్డిలకు సైతం 12 శాతం రిజర్వేషన్ ఇస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెడ్డిలలో ఆర్థికంగా బలపడినవారు పేద రెడ్డి కుటుంబాలకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. తెలంగాణ రెడ్డి మహిళా వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు గంగుల శ్రీలతారెడ్డి మాట్లాడుతూ సమస్యను పరిష్కరించే సత్తా మహిళలకు ఉంటుందని చెప్పారు. వేదిక వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు తొడిగెల శ్రీదేవిరెడ్డి, ఉపాధ్యక్షురాలు శాగంటి గీతారెడ్డి, ప్రధానకార్యదర్శిగా బి.లక్ష్మిరెడ్డి, సంయుక్త కార్యదర్శి మంజులారెడ్డి, సహాయ కార్యదర్శిగా కవితారెడ్డి, కోశాధికారిగా గీతారెడ్డి, సంయుక్త కార్యదర్శిగా సువర్ణదేవి, సలహాదారు మున్సిపల్ కౌన్సిలర్ సుచరితా నరోత్తంరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షురాలు రోజారాణిరెడ్డి, ప్రధానకార్యదర్శి అరుంధతిరెడ్డి, సహాయ కార్యదర్శి సరితారెడ్డి, సలహాదారు శే్వతారెడ్డి, గొట్టిముక్ల సర్పంచ్ జె.అరుణ, మున్సిపల్ కౌన్సిలర్ భార్గవి పాల్గొన్నారు.