రంగారెడ్డి

అనుమానాస్పద స్థితిలో దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఏప్రిల్ 24: అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి తలపై బండరాయితో మోది దారుణంగా హత్యకు గురైన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇంతియాజ్, నిస్సార్ అహ్మద్ స్నేహితులు. ఇద్దరు స్నేహితులు కోళ్ల వ్యాపారం నిర్వహిస్తుంటారు. వ్యాపారం నిమిత్తం ఈనెల 18న హైదరాబాద్‌కు వచ్చారు. ఇంతియాజ్ బంధువుల ఇంట్లో 18వ తేది రాత్రి ఉన్నారు. 19వ తేదిన మెహదీపట్నంకు చెందిన ఇళ్లు అద్దెకు ఇప్పించే మధ్యవర్తి లతీఫుద్దీన్‌ను సంప్రదించారు. లతీఫుద్దీన్ రాజేంద్రనగర్‌లోని చింతల్‌మెట్ మొగల్ మెడవ్స్ అపార్టుమెంట్‌లో ప్లాట్లు ఉన్నాయని చెప్పాడు. ఇద్దరు స్నేహితులు అపార్టుమెంటులోని 105 ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. 20న నిస్సార్ అహ్మద్ ఫ్లాట్‌కు తాళం వేసి వెళ్లిపోయాడు. నాలుగు రోజులుగా ఇంటికి తాళం ఉండి, ఇంట్లోంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు మిగతా ఫ్లాట్ యజమానులు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తాళం పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా బాత్‌రూంలో ఇంతియాజ్ మృతదేహం పడి ఉంది. మృతదేహం బాగా కుళ్లిపోయి రక్తస్రావంలో పడి ఉంది. తలపై బండరాయితో మోదిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇంతియాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతని స్నేహితుడే హత్య చేసి ఉంటాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం
* కారు డ్రైవర్ మృతి.. తల్లీకూతుళ్లకు తీవ్ర గాయాలు
మేడ్చల్, ఏప్రిల్ 24: మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా అందులో ప్రయాణిస్తున్న తల్లికూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం మండంలోని గౌడవెళ్లి గ్రామానికి చెందిన తాటి హన్మంతు(41) కొంపల్లి ప్రాంతంలోని మాధవి అనే మహిళ వద్ద కారుడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మాధవి మండలంలోని ఘణపూర్ గ్రామంలో గల మెడిసిటీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తోంది. కాగా సోమవారం మధ్యాహ్న సమయంలో కారులో డ్రైవర్ తాటి హన్మంతు, యాజమాని మాధవి(41) కూతురు శ్రీయ(10) ముగ్గురు మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్నారు. కారు ఙ్ఞణాపూర్ బ్రిడ్జి వద్ద అదుపు తప్పి అటుగా వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టి బొల్తా పడింది. దీంతో కారుడ్రైవర్ హన్మంతు అక్కడికక్కడే మృతిచెందగా కారులో ప్రయాణిస్తున్న మాధవి ఆమె కూతురు శ్రీయకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం కోసం నగరంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది. కాగా కారు అటుగా వస్తున్న కంటైనర్ ఢీకొనని యేడల బ్రిడ్జిపై నుండి కిందకు పడేదని పలువురు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గణేశ్ పేర్కొన్నారు.

భూగర్భ జలాలు పెంపునకు కృషి

కీసర, ఏప్రిల్ 24: భూగర్భ జలాల పెంపునకు నీటి కుంటలు ఏర్పాటు చేయాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వేసవిలో ఉపాధిహామీ పనులు వేగవంతం చేయాలి అన్నారు. వర్షాలు వస్తే మట్టి పనులు చేపట్టలేమనీ. అందువల్ల ఉపాధి హామీ పనులు అన్ని గ్రామాల్లో ముమ్మరం చేయాలని కోరారు. ఇంకుడు గుంతలు, కాలువల పూడికతీత, నీటినిల్వ గుంతలు పనులు చేపట్టాలని ఆదేశించారు. రైతులు ఉద్యానవన పంటలు సాగు చేసినట్లయితే వారి పొలాల్లో ఇజిఎస్ కింద కంపోస్ట్ పిట్స్, నీటి గుంతలు, పండాల్స్ వంటివి అధికారులు చేపట్టాలన్నారు. హరితాహారం కింద అధికారులు ఎవెన్యూ ప్లాంటేషన్‌పై దృష్టి సారించాలని తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో మేడ్చల్ జిల్లాకు సంబంధించి సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో రైతు సంఘాలను ఏర్పాటుచేసి, వారికి ఉపాధి హామీ పనులతో పాటు ఎరువులు, విత్తనాలు, రుణాల మంజూరు, మార్కెటింగ్ తదితర సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపిక లాటరీ పద్ధతిన ఎంపిక చేయాలని కోరారు. ఈనెల 29వ తేదీన సర్పంచ్‌ల సమావేశం, మే మూడవ తేదీన పట్టణ ప్రాంతాలకు చెందిన కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామనీ.. పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ సురేందర్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.