రంగారెడ్డి

సేల్స్‌మెన్‌గా ఎమ్మెల్యే తీగల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్‌బినగర్, ఏప్రిల్ 24: తెలంగాణ రాష్ట్ర సమితి ఈనెల 27న చేపట్టనున్న ప్లీనరీ సభకు సంబంధించిన ఖర్చుల కోసం మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సెల్స్‌మెన్ అవతారమెత్తారు. సోమవారం ఆర్కెపురం డివిజన్ పరిధిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో డివిజన్ తెరాస అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గులాబీ కూలీ’ కార్యక్రమానికి ఎమ్మెల్యే విచ్చేసి షాప్‌లోని చీరలు, గాజులు తదితర వస్తులను అమ్మారు. అనంతరం షాపింగ్ మాల్ ఎండి ఎమ్మెల్యే తీగల బృందానికి కూలీ డబ్బులను అందజేశారు. ఎమ్మెల్యే తీగల మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఒక్క కెసి ఆర్‌తోనే సాధ్యమని, ఈనెల 27న నిర్వహించే తెరాస ప్లీనరీ సభకు టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

గంజాయి గుట్టురట్టు చేసిన ఎస్‌వోటి పోలీసులు
రాజేంద్రనగర్, ఏప్రిల్ 24: గంజాయిని విక్రయిస్తున్న ముఠాను నార్సింగ్ జోన్ ఎస్‌వోటి పోలీసులు.. మైలార్‌దేవ్‌పల్లి పోలీసుల సహకారంతో ఓ ఇంటిపై దాడి చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతా ముఠా సభ్యులు తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ శర్మ, విజయ్, మధు.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ మధుబన్‌కాలనీలో ఓ ఇంటిని అద్దెను తీసుకొని ఉంటున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన మున్నా అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేస్తూ కాటేదాన్ పారిశ్రామికవాడలోని కార్మికులను లక్ష్యంగా చేసుకొని విక్రయిస్తున్నారు. కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విశ్వసనీయంగా సమాచారం అందుకున్న ఎస్‌వోటి పోలీసులు.. మైలార్‌దేవ్‌పల్లి పోలీసుల సహకారంతో మధుబన్‌కాలనీలో ముఠా ఉండే ఇంటిపై దాడి చేశారు. రూ.50వేలు విలువ చేసే ఆరు కిలోల గంజాయి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితుడైన రాహుల్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గతేడాది ఎస్‌బిఐ బ్యాంక్ జియో సంస్కార్ మనీ ట్రాన్స్‌ఫర్ సెంటర్‌లో క్యాషియర్‌పై కాల్పులు జరిపిన ఘటనలో రాహుల్ శర్మ నిందితుడిగా ఉన్నాడు. రిమాండ్‌కు వెళ్లి వచ్చాకా సులువుగా డబ్బు సంపాదన కోసం మళ్లీ గంజాయి విక్రయాలు ప్రారంభించాడు. రాజేంద్రనగర్ తహశీల్దార్ నిర్మల సమక్షంలో మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ పి.జగదీశ్వర్ పంచనామా నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతన్ని రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

‘రూర్బన్’ వివరాలను త్వరగా సమర్పించాలి

వికారాబాద్, ఏప్రిల్ 24: రూర్బన్ పథకం కింద చేపట్టాల్సిన పనుల వివరాలను త్వరగా సమర్పించాలని వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ డి.దివ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రూర్బన్ కింద చేపట్టాల్సిన పనులపై అధికారులతో సమీక్షించారు. తాండూరు మండలంలోని 25 గ్రామ పంచాయతీలలో అన్ని సౌకర్యాలను కల్పించేందుకు శాఖల వారీగా తమ నివేదికలను అందజేయాలని చెప్పారు. ఎక్కడైతే గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీలకు సొంత భవనాలు లేనట్లయితే నిర్మాణాలకు కావాల్సిన స్థలాన్ని గుర్తించి వాటికి ఎంత ఖర్చు అవుతుందో ఆ వివరాలను స్పష్టంగా అందించాలని సూచించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, కిచెన్‌షెడ్ల నిర్మాణాలకు సంబంధించిన అంచనాలను రూపొందించి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. గోదాముల నిర్మాణాలకు సంబంధించి స్థలాల కేటాయింపు విషయమై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు కోటి నాలుగు లక్షల నిధులను వెచ్చిస్తున్నట్లు, వెంటనే స్థలాల వివరాలను సమర్పిచాలని డిఎంహెచ్‌వోను ఆదేశించారు. గ్రామాల్లో ఇంకా గ్యాస్ కనెక్షన్ లేనివారిని గుర్తించి వారికి కనెక్షన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైతే ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని డిసిఎస్‌వోను ఆదేశించారు. ఆరు పార్కుల ఏర్పాటుకుగాను ఒక్కో పార్కుకు పది లక్షల రూపాయలను వెచ్చించనున్నామని అన్నారు. వచ్చే వారం నిర్వహించే రూర్బన్ సమావేశానికి అధికారులందరూ నిర్మాణాలు చేపట్టాలని స్థలాల వివరాలతో పాటు అంచనాలను సైతం సమర్పించాలని ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో సబ్‌కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, రూర్బన్ రాష్ట్ర రిసోర్స్ పర్సన్స్ నర్సింలు, శేఖర్, డిఆర్‌డివో జాన్సన్, పంచాయతిరాజ్ ఇఇ మనోహర్‌రావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ ఆంజనేయులు, డిఎంహెచ్‌వో దశరథ్, పశు సంవర్థక శాఖ సుబ్బారావు, డిడబ్ల్యువో జ్యోత్స్న, డిఇవో దీపిక, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విజయ్‌మోహన్, డిసిఎస్‌వో పద్మజ, వ్యవసాయశాఖ జిల్లా అధికారి గోపాల్ పాల్గొన్నారు.