హైదరాబాద్

అర్బన్ భగీరథలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: మహానగరంలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీటి అందించాలన్న సంకల్పంతో జలమండలి అమలు చేస్తున్న అర్బన్ భగీరథ కార్యక్రమంలో ఎలాంటి అవినీతి జరిగిన బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం బోర్డు ప్రధాన కార్యాలయంలో గ్రీన్ బ్రిగేడ్ కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేవలం రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు, ఈ అంశంపై ప్రజల్లో విస్త్రృత ప్రచారం చేసి అవగాహన కల్పించేందుకు స్వయం సహాయక బృందాలకు కూడా తగిన శిక్షణనిచ్చినట్లు ఆయన వెల్లడించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు కూడా ఈ కార్యక్రమం కింద లబ్ది పొందేందుకు వీలుగా ఇప్పటికే జలమండలి ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. అర్బన్ భగీరథ కార్యక్రమ లబ్దిదారులు కనెక్షన్ తాలుకూ కూలీల ఛార్జీలు, రోడ్డు తవ్వకం ఛార్జీలంటూ అదనంగా ఎలాంటి వసూళ్లు చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమం కింద పారదర్శకంగా, నిజమైన లబ్దిదారులకు రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలన్న మంచి ఉద్దేశ్యంతో చేపట్టామని, అందుకే ఈ కార్యక్రమం కింద మంజూరైన వాటర్ కనెక్షన్లపై థర్డ్ పార్టీ తనిఖీలు చేయనున్నట్లు, ఇందులో ఎవరైనా ఎక్కడైనా లబ్దిదారుల నుంచి అదనంగా డబ్బు వసూలు చేసినట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. దారిద్య్రరేఖకు దిగువన లేని కుటుంబాలకు చెందిన యజమానులు తప్పనిసరిగా నీటి మీటర్లను భిగించుకోవాలని సూచించారు.
నూతన కనెక్షన్లను మూడు రోజుర్లో పూర్తయ్యేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. కనెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గుంతలను యదావిధిగా పూడ్చాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జలమండలి రెవెన్యూ డైరెక్టర్ డి. శ్రీ్ధర్‌బాబు, సిజిఎం ఆనంద్‌స్వరూప్, సింగిల్ విండో జిఎం ఆర్. సీతారాంతో పాటు గ్రీబ్ బ్రిగేడ్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో
అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్/ నాచారం, ఏప్రిల్ 24: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల్లో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానంగా విద్యార్థి సంఘాలు సమన్వయంతో ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, ప్రపంచం గర్వించేలా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు, ఓయూ వైస్ చాన్సలర్‌తో కలసి ఆయన భద్రత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఓయూలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న శతాబ్ది ఉత్సవాల్లో విద్యార్థి సంఘాల రాజకీయ జోక్యం తగదన్నారు. ఉత్సవాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని, విద్యార్థుల హాజరుపై ఆంక్షలు విధించవద్దని పలువురు విద్యార్థులు విన్నవించారు. అయితే ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, రాష్టప్రతి రానున్నందున శాంతి బద్రతలకు విఘాతం కలుగకుండా పోలీస్ యంత్రాంగానికి విద్యార్థులు సహకరించాలని కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచించారు. రాష్టప్రతి రాక సందర్బంగా పలు రూట్లలో బస్సుల మళ్లింపు, కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించినట్టు కమిషనర్ వివరించారు. కాగా సమీక్ష సమావేశం జరుగుతుండగా కొందరు విద్యార్థి సంఘాల నాయకులు సీఎం కెసిఆర్‌ను విమర్శిస్తుండగా, అనుకూల విద్యార్థులు కలుగజేసుకోగా కాస్సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థుల మధ్య తోపులాట జరగ్గా, కమిషనర్ సముదాయించేందుకు యత్నించారు. అయినప్పటికీ విద్యార్థుల మధ్య వాగ్వాదం కొనసాగుతూ సమస్య జఠిలమైంది. దీంతో సమీక్ష సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. అనంతరం విసి మీడియాతో మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఓయూ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామచంద్రరావు అన్నారు. భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జి ప్రారంభించనున్న ఓయూ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామన్నారు. ఈనెల 26,27 తేదీల్లో తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాల కళలతో పాటు అనేక సదస్సులు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
సీఎం క్షమాపణ చెప్పాలి: విద్యార్థి సంఘాలు
విద్యార్థి సంఘాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ అనుచిత వాఖ్యలు చేశారని, వెంటనే క్షమాపణ చెప్పాలని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఓయూ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని, పాలక మండలి ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు కెసిఆర్ క్షమాపణ చెప్పాలనే డిమాండ్లపై వివరణ ఇస్తేనే శతాబ్ది ఉత్సవాలకు సహకరిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు.