రంగారెడ్డి

25వ రోజుకు చేరిన వెటర్నరీ విద్యార్థుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్,మే18: రాజేంద్రనగర్ సర్కిల్లోని పివి నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేస్తున్న నిరసన 25 వ రోజుకు చేరింది. గ్రామీణ పశుసంపద కేంద్రాలను పశువైద్యశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. గురువారం నిరసనలో భాగంగా ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శిస్తూ తమ నిరసనను తెలిపారు. పాటల పాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు చేస్తున్న నిరసన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా కనిపించడం లేదని విమర్శించారు. సంబంధిత మంత్రి రెండు రోజులు విద్యార్థులను చర్చలకు పిలిచి అవమానపరిచి వెనక్కు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఎల్‌యూలు విడిలుగా అప్‌గ్రేడ్ చేసేంత వరకు నిరసన ఆగే ప్రసక్తే లేదని వెటర్నరీ విద్యార్థులు తేల్చిచెప్పారు. తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరసన తెలిపిన వారిలో విద్యార్థి నాయకులు పురుషోత్తం నాయక్, కరుణాకర్, అభిలాష్, శశాంక్, అనిల్, రాజిరెడ్డి, సతీష్, మహేష్, సాయిప్రసాద్, వౌనిక, లావణ్య, సుష్మ ఉన్నారు.

30నుంచి మహిళలకు శిక్షణ
వికారాబాద్, మే 18: రాజేంద్రనగర్ బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు మహిళలకు 45 రోజులు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి హన్మంత్‌రావు తెలిపారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఔత్సాహికుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలని, ఈనెల 27వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అడ్వాన్స్‌డ్ టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుకు పదో తరగతి పాసై ఆపై చదివిన 35 మందికి, బ్యూటీ పార్లర్ శిక్షణ 25 మందికి, జర్దోసి, మగ్గం శిక్షణకు ఎస్‌ఎస్‌సి పాస్/ఫెయిల్ పై చదివిన 25 మందికి, ఎంఎస్ ఆఫీస్ ఇంటర్ ఆపై చదివిన 35 మందికి శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందుతుందని, ఎంపికైన వారు ఒరిజినల్ సర్ట్ఫికెట్స్, జిరాక్స్ కాపీలు రెండు సెట్లను, ఐదు కలర్ ఫొటోలను, ఆధార్ కార్డు (జిరాక్స్) తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. జిల్లాలోని మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంబిఎ, బిఇ, ఎంబిఎ బిఇడి, ఎంసిఎ చదివినవారు, విద్యార్థులు, ఆరోగ్య సమస్యలున్నవారు అనర్హులని స్పష్టం చేశారు.

ఎరువుల డీలర్లందరికీ ఈ-పాస్ యంత్రాలు

వికారాబాద్, మే 18: వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలు రాగానే జిల్లాలోని ఎరువులు విక్రయించే దుకాణదారులందరికీ ఈ-పాస్ యంత్రాలు ఇస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తెలిపారు. గురువారం డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కోసం ఇచ్చే ఈ-పాస్ యంత్రాలపై ఎరువుల విక్రయదారులు, వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాస్ యంత్రాలు ఇచ్చే ముందు మరోసారి శిక్షణ ఇస్తామని చెప్పారు. పవర్ పాయింట్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కోరమండల్ ఏరియా మార్కెటింగ్ మేనేజర్ పి.ప్రసాద్ అన్ని విషయాలను వివరించారు. యంత్ర యజమాని పేర ఇస్తారని చెప్పారు. ఆధార్ కార్డు నెంబరు, వేలిముద్ర తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్‌గా తీర్చిదిద్దుదాం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 18: మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, హుడా మాజీ డైరెక్టర్ ఎం.ఏ. సిద్దిఖీ పిలుపునిచ్చారు. గురువారం ఆయన విజయనగర్‌కాలనీలో స్వచ్చ హైదరాబాద్‌పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ సాధన కోసం ప్రదాని నరేంద్రమోది ఇచ్చిన పిలుపును స్పూర్తిగా తీసుకుని సమాజంలోని ప్రజలు ఎవరికి వారు తమ ఇళ్లలో, ఆరు బయట శుభ్రతను పాటించటంతో పాటు చెత్తాచెదారాన్ని వాటి కోసం కేటాయించినా కుండీల్లోనే వేస్తే స్వచ్ఛత సాధ్యమవుతోందని, ఇందు లో మహిళలది, విద్యార్థులకు కీలక పాత్ర అని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా మహానగరంలో చెత్తను తడి,పొడి చెత్తగా వేర్వేరు చేసేందుకు ఇంటింటికి పంపిణీ చేసిన రెండు డస్ట్‌బిన్లను ప్రతి కుటుంబం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎక్కడబడితే అక్కడ చెత్త వేయకుండా కాస్త బాధ్యతాయుతంగా వ్యవహారిస్తూ చెత్తను కుండీల్లో మాత్రమే వేయటం, లేక ఇంటికి వచ్చే స్వచ్ఛ ఆటో టిప్పర్ల కార్మికులకు వేర్వేరుగా అందించాలని సూచించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత గర్భిణిలు మొదలుకుని ఒంటరి మహిళలు, వికలాంగులు, వివాహం కావల్సిన వారి కోసం కల్యాణ లక్ష్మీ వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవటం మనందరికి గర్వకారణం అని సిద్ధిఖీ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ నాయకురాళ్లు శకుంతలబాయి, సఫీయాబీ, సల్మాబీ, ఇస్మాయిబీ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు
షాద్‌నగర్, మే 18: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మరమ్మతు పనులు నిర్వహిస్తున్నట్లు షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట చౌరస్తా నుండి కొందుర్గు మండలం లాల్‌పహాడ్ వరకు 20 కిలోలీటర్ల బిటి రోడ్డు రెన్యువల్‌కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలికట్ట చౌరస్తా నుండి లాల్‌పహాడ్ వరకు ఉన్న పరిగి రోడ్డు గుంతలమయంగా మారిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలను నివారించేందుకు బిటి రోడ్డును రెన్యూవల్ చేస్తున్నట్లు వివరించారు. గుంతలమయంగా ఉన్న బిటి రోడ్లను రెన్యూవల్ చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ఎలికట్ట చౌరస్తా నుండి లాల్‌పహాడ్ వరకు నిర్మించనున్న 20 కిలోమీటర్ల రెన్యువల్ బిటి రోడ్డుకు ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వివరించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి ప్రతి రైతు బ్యాంక్ ఖాతాలో నాలుగు వేల రూపాయలు వేస్తారని వివరించారు. రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని వివరించారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. సమావేశంలో ఎలికట్ట సర్పంచ్ అరుందతి యాదయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు వెంకట్‌రాంరెడ్డి, ఈట గణేష్, అందె బాబయ్య, రాజేష్‌పటేల్, శ్రీ్ధర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, యుగంధర్‌తోపాటు గ్రామస్థులు పాల్గొన్నారు.కొత్తూరులో..
కొత్తూరు: గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కెసిఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు.
గురువారం కొత్తూరు మండలం కొడిచర్ల గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలను అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. గ్రామాలలో నెలకొన్న మంచినీటి ఎద్దడిని పరిష్కరించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నారని, వచ్చే సంవత్సరం ఇంటింటికీ మంచినీరు అందించడం జరుగుతుందని తెలిపారు. డంప్ యార్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో జ్యోతి, గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ జిల్లెల వెంకట్‌రెడ్డి, నాయకులు సత్తయ్య, రవీందర్‌రెడ్డి, కావలి కృష్ణ, నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.

సీనియర్ నటుడు కెకె శర్మ మృతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 18: సినీ నటుడు కెకె శర్మ (84) గురువారం హైదరాబాద్‌లో మృతి చెందారు. కంచుకోట చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో ప్రవేశించిన శర్మ దాదాపు 500 చిత్రాల్లో నటించారు. శర్మ స్వస్థలం కాకినాడ. సినిమాల్లోకి రాకముందు ఆయన రైల్వే శాఖలో పని చేశారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ రంగ ప్రవేశం చేశారు. కొందరు మిత్రులతో కలిసి ఆయన గోలనాగమ్మ సినిమా కూడా తీశారు. శుక్రవారం శర్మ అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరుగనున్నాయి.

అన్ని పిహెచ్‌సిల్లో వౌలిక వసతులు
కుటుంబ, వైద్యారోగ్య శాఖ కమిషనర్ కరుణ ఆదేశం
వికారాబాద్, మే 18: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర కుటుంబ, వైద్యారోగ్య శాఖ కమిషనర్ కరుణ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని సందర్శించి వౌలిక వసతులు, రోగుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రూ.20 లక్షలతో పెయింటింగ్, చిన్నపాటి మరమ్మతులు చేయిస్తున్నామని తెలిపారు. అనంతరం అనంతగిరిగుట్టలోని టిబి శానిటోరియం ఆసుపత్రిని సందర్శించి అక్కడి వసతులను ఆరా తీశారు. పరిగి ప్రాథమిక ఆసుపత్రిని సందర్శించి నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో వౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధుల కొరత లేదని ఆమె చెప్పారు. ప్రతి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అవసరమైన వౌలిక సదుపాయాల గురించి తెలుసుకుని తమకు నివేదికను అందజేయాలని డిఎంహెచ్‌వోను ఆదేశించారు. ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రాథమిక సదుపాయాలైన విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, సక్రమంగా ఉండేలా చూడాలని అన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో గల ఖాళీలను భర్తీచేసి, ఉన్న వాటిలో సర్దు బాటు చేయిస్తామని పేర్కొన్నారు. కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీలక్ష్మి అత్యధికంగా ప్రసవాలు చేసినందుకు ఆమె ఈసందర్భంగా అభినందించారు. ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు డాక్టర్లందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ డి.దివ్య మాట్లాడుతూ ఆసుపత్రుల్లో సిబ్బంది ఖాళీలను భర్తీ చేసేందుకు లేదా సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌కు తెలిపారు. అత్యవసరమున్న చోట తమ దగ్గర ఉన్న నిధులతో భవన మరమ్మతులు, వౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని చెప్పారు. ఆసుపత్రుల్లో ఉద్యోగులు సమయపాలన పాటించనందున బయోమెట్రిక్ హాజరు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి ఆసుపత్రిలో శానిటేషన్‌తో పాటు టాయిలెట్లు విడివిడిగా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. డాక్టర్‌లు, సిబ్బంది రోగులకు అంకితభావంతో సేవ చేయాలని సూచించారు. సమావేశంలో డిఎంహెచ్‌వో దశరథ్, డాక్టర్లు శంకర్‌గౌడ్, లలిత, డిప్యూటి డిఎంహెచ్‌వో మనోహర్, ప్రోగ్రాం అధికారులు, వివిధ ఆసుపత్రుల సిబ్బంది పాల్గొన్నారు.

ప్రాథమిక పాఠశాలల్లో
అంగన్‌వాడీలు విలీనం

* విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటమే కారణం
* ప్రభుత్వ ఖర్చును తగ్గించేందుకే నిర్ణయాలు
* అంగన్‌వాడీల తరలింపుపై కార్యకర్తల అయోమయం
* సాధ్యాసాధ్యాలపై అధికారుల మల్లగుల్లాలు

షాద్‌నగర్ రూరల్, మే 18: విద్యార్థుల సంఖ్యను, పాఠశాల గదులను దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల వివరాలను ఉన్నత స్థాయి విద్యాశాఖ అధికారులు ఇప్పటికే సేకరించారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలా? వద్దా? చేస్తే ఏమైనా ఇబ్బందులు తల్తెతుతాయా? సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వ ఖర్చును తగ్గించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల తాము వృథాగా ఉండిపోతామా? తమను ఉద్యోగాల్లో నుండి తీసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంగన్‌వాఆ్ప కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20మంది కంటే తక్కువగా విద్యార్థులు ఉంటే ప్రాథమిక పాఠశాలను మూసివేసి ఆ విద్యార్థులను సమీపంలో ఉన్న మరో పాఠశాలకు బదలాయించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో ఎలా విలీనం చేస్తుందని పలువురు విద్యావంతులు చర్చించుకుంటున్నారు. ఇది సాధ్యమవుతుందా? లేదా? అనే కోణాల్లు చర్చలు మొదలయ్యాయి. ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేసేందుకు అంగన్‌వాడీ కేంద్రాలను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించినప్పటికీ జూన్ 12వ తేదీ నాటికి విలీనం చేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేస్తారనేది నేటివరకు స్పష్టం కాలేదు. ప్రతి ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం ఐదు తరగతి గదులు ఉండాలని, అలా ఉంటే సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేస్తారు.. మరికొన్ని ప్రాంతాల్లో ఐదు గదులు లేనప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న సమయంలో కూడా అంగన్‌వాడి కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తులు ప్రారంభించింది. అంగన్‌వాడి కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల తాము ఏమి చేయాలి అంటూ ప్రస్తుతం విధుల్లో ఉన్న కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అంగన్‌వాడీ కేంద్రాలకు విలీనం చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సమీపంలోని ప్రాథమిక పాఠశాలలను గుర్తించి కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేసినట్లు సమాచారం. ఏది ఎమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
104 అంగన్‌వాడీ కేంద్రాలు విలీనం
* ఐసిడిఎస్ అధికారిణి నాగమణి
షాద్‌నగర్ నియోజకవర్గంలో 316 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 54 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని షాద్‌నగర్ ఐసిడిఎస్ అధికారిణి నాగమణి వివరించారు. 316 అంగన్‌వాడీ కేంద్రాల్లో 104 అంగన్‌వాడీలను ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేసినట్లు తెలిపారు. అవకాశం ఉన్నమేరకు మిగతా వాటిని కూడా ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో చర్చించి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

నేరరహిత సమాజమే లక్ష్యం
పోలీస్ శాఖలో 3వేల పోస్టులకు జూన్‌లో నోటిఫికేషన్ * ప్రజలకు గౌరవ, మర్యాదలతో సేవలు
* యువతకు ఉపాధి * * ప్రీ-రిక్రూట్‌మెంట్ అవగాహన సదస్సులో * సిపి మహేందర్‌రెడ్డి వెల్లడి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్/కాచిగూడ, మే 18: పోలీస్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులు ప్రజలకు గౌరవ, మర్యాదలతో సేవలందించాలని, వారి శిక్షణ నేరరహిత సమాజమే లక్ష్యం కావాలని నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీస్ శాఖలో పేద, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే సంకల్పంతో ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్త్ధ్వార్యంలో భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రీ-రిక్రూట్‌మెంట్ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, పోలీస్ శాఖలోని కుటుంబీకుల పిల్లలకు పోలీస్ శాఖలో ఉద్యోగావకాశాలు కల్పింనున్నట్టు కమిషనర్ తెలిపారు. విద్యార్థులు ఆత్మస్థయిర్యంతో, లక్ష్యసాధనతో ముందుకు వెళ్లాలన్నారు. ఇటీవల తాము శిక్షణ ఇచ్చిన 1700 మంది అభ్యర్థుల్లో 385 మంది అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలకు అర్హత సాధించారని కమిషనర్ తెలిపారు. వచ్చే నెలలో పోలీస్ శాఖలో కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలకు 3వేల పోస్టులకు గానూ నోటిఫికేషన్ జారీ కానుందని, ఈ పోస్టులకు భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్ ఉచితంగా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పోలీసులు ఆయా పోలీసుస్టేషన్లకు వచ్చే ఫిర్యాదు దారులకు గౌరవ, మర్యాదలతో సేవలందిస్తున్నామని, ఆధునిక టెక్నాలజీతో నేరాలను అదుపు చేయగల్గుతున్నామని చె