హైదరాబాద్

ఐటి వినియోగంతో మరింత మెరుగైన పౌరసేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: దేశంలోనే ఇతర మున్సిపల్ సంస్థల కన్నా ఎక్కువ ఆన్‌లైన్ సేవలను అందిస్తున్న జిహెచ్‌ఎంసిలోని ఐటి విభాగాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలను అందిస్తామని కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ‘మై జిహెచ్‌ఎంసి’యాప్ అప్‌డేట్‌తో పాటు ఇతర ఐటి సంబంధిత అంశాలపై కమిషనర్ సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర కూడా పాల్గొన్న ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగర ప్రజలకు సులభతరమైన, మరింత సౌలభ్యంగా పౌరసేవలను అందించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజిని మరింత పటిష్టం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే అత్యధిక డౌన్‌లోడ్‌లతో పాటు నగర సమస్యలను జిహెచ్‌ఎంసి దృష్టికి తెచ్చే మై జిహెచ్‌ఎంసి మొబైల్ యాప్‌ను అప్‌డేట్ చేయనున్నట్లు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించిన ఆన్‌లైన్ చెల్లింపుల్లో ఎదురవుతున్న ప్రధాన సమస్యలను పరిష్కరించటం జరిగిందని, డిజిటల్ సంతకాల ద్వారా మ్యుటేషన్ల సర్ట్ఫికెట్ల జారీ ప్రక్రియ పూర్తియిందని తెలిపారు. ఆస్తిపన్ను డేటాకు బిఆర్‌ఎస్ దరఖాస్తుల జాబితాను అనుసంధానం చేయటంతో ఆస్తిపన్ను స్వీయ మదింపు, ఎల్‌ఆర్‌ఎస్‌కు ఖాళీ స్థలాల ఆస్తిపన్నును అనుసంధానం చేసే ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే వినియోగం, అవసరానికి తగిన విధంగా జిహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌ను ఆధునీకరించే ప్రక్రియను పూర్తి చేయాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు సూచించారు. టి. వ్యాలెట్‌తో జిహెచ్‌ఎంసి ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్సు, స్పోర్ట్స్ విభాగం పే అండ్ ప్లే స్కీం వివరాలను అనుసంధానం చేయటం పూర్తియిందని పేర్కొన్నిరు.
హోటళ్ల తనిఖీకి రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా వచ్చే నివేదికలను డ్యాష్‌బోర్డుపై ప్రదర్శించటం జరుగుతుందని, అదే విధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్‌తో పాటు నివేదికలను జిహెచ్‌ఎంసి డ్యాష్‌బోర్డుపై ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఎన్‌ఐసి, జిహెచ్‌ఎంసి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విభాగాలకు చెందిన అధికారులు హజరయ్యారు.