రంగారెడ్డి

అతివేగంతోనే అనర్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మే 25: అతివేగం యరోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్‌ఎండిఎ కమిషనర్ టి. చిరంజీవులు అభిప్రాయపడ్డారు. నానక్‌రాంగూడ టోల్‌ప్లాజా వద్ద సైబరాబాద్ పోలీసులు ఏర్పాటుచేసిన ఔటర్‌రింగ్ రోడ్డుపై గస్తీ తిరిగే పెట్రోలింగ్ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి బెస్ట్ సిటీ అవార్డు అందుకుంటున్న మన మహానగంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై రోజుకు 86 వేల వాహనాలు తిరుగుతున్నాయని ఇందులో 70 శాతం వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా అతివేగంగా నడుపుతున్నారని చెప్పారు. సెంటర్ ఫర్ రోడ్డు రీసెర్చి సంస్థ పరిశీలించగా కొన్ని వాహనాలు గంటకు 208 కిలోమీటర్ల వేగంలో నడుపుతున్నట్లు తేలిందని తెలిపారు. ఔటర్ ప్రమాదాల గురించి అధ్యయనం చేయడం కోసం పరిశీలించిన సెంటర్ ఫర్ రోడ్డు రీసెర్చి సంస్థ 29 ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారని తెలిపారు. అతి వేగమే ప్రమాదాలకు కారణమని గ్రహించి ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు 120నుండి 100 కిలోమీటర్ల వేగానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరామనీ.. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వివరించారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో మీతోపాటు ఎదురుగా వస్తున్న వారి భద్రతను దృష్టిలో పెట్టుకువాలని ఆయన సూచించారు. అతివేగం వల్ల ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మృత్యు వాత పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రమాదాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. లైన్ నిబంధనలు పాటించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఆయన సూచించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ ప్రమాదాలు జరగకుండా విద్యార్థులను యువకులను చైతన్య పరచవలసిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయ పడ్డరు. ప్రమాదాలు జరిగిన కుటుంబాలను చూసినప్పుడు గుండె తరుక్కుపోతోందని అవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువకులు తల్లిదండ్రుల మాటల కంటే పోలీసు మాటలను పట్టించుకుంటారని తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ గత ఎడాది ఔటర్‌పై 44 మంది చనిపోయారి ఈ ఎడాది 16 ప్రమాదాలు జరిగితే 15 మంది చనిపోయారని చెప్పారు. ఔటర్‌పై ఎన్‌ఫోర్సుమెంటు పెంచడంతో పాటు 120నుండి 100కు వేగాని తగ్గించడం వలన 20శాతం ప్రమాదాలు తగ్గయని సిపి వివరించారు. శంషాబాద్ నుండి గచ్చిబౌలి రోడ్డులో ప్రమాదాలు జరుగుతున్నామని గుర్తించినట్లు సిపి తెలిపారు. ప్రమాదాలు నివారించేందుకు రింగ్ రోడ్డుపై ప్రమాదాలు నివారించేందుకు పెట్రోలింగ్ వాహనాలు స్పీడ్ గన్‌లు, బ్రీత్ ఎనలైజర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఔటర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంటు పెంచడంతోపాటు 120నుండి 100 కిలోమీటర్లకు వేగాన్ని తగ్గించడం వలన 20 శాతం ప్రమాదాలు తగ్గించగలిగామని సిపి తెలిపారు. సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ 18మంది ఎఎస్‌ఐలు 18 మంది పోలీసు సిబ్బందిని పెట్రోలింగ్‌కు నియమించడం జరిగిందని శాండిల్య తెలిపారు. ప్రస్తుతం ఒక్కో వాహనానికి 200 లీటర్లు డీజిల్ ఇస్తున్నారని ఇది వారం రోజులే వస్తోందని హెచ్‌ఎండిఎ కమిషనర్, స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సిపి షాన్వాజ్ ఖాసిం తోపాటు సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్ మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండిఎ అందించిన ఐదు స్పీడ్ గన్‌లు, 30 బ్రీత్ ఎనలైజర్లు, ఆరు పెట్రోలింగ్ వాహనాలను అందించారు. ఈ వాహనాలను సైబరాబాద్ కమిషనర్ సందీస్ శాండిల్య, హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీలు జెండాఉపి ప్రారంభించారు.

ఓ పక్క కోర్టు స్టే.. మరోపక్క ఫెన్సింగ్ పనులు?
ఉప్పల్, మే 25: ఉప్పల్ మండలం పరిధిలోని నాగోల్ ఫతుల్లగూడ చెరువులో ఎట్టకేలకు తిరిగి ఫెన్సింగ్ పనులు ప్రారంభమయ్యాయి. కోర్టు స్టే ఉండగా రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే ఎఫ్‌టిఎల్ హద్దులు మార్చి ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ పనులు చేపట్టినట్లు తెలిసింది. చెరువు పరిరక్షణలో భాగంగా చుట్టూ ఫెన్సింగ్ వేసి పార్కు అభివృద్ధితో పాటు వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని ఏడాద్నినర క్రితమే ప్రభుత్వం రూ.89లక్షలు మంజూరు చేసినట్లు సమాచారం. అప్పట్లో అధికారులు ఫెన్సింగ్ పనులు చేపట్టారు. మధ్యలో ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్న కొందరు ప్లాట్ల యజమానులు తమ స్థలాల్లో ఎలా ఫెన్సింగ్ వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఫెన్సింగ్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. తిరిగి అధికారులు గురువారం ఫెన్సింగ్ పనులు చేపట్టారు. ప్లాట్ల యజమానులతో కుమ్ముక్కై హద్దు రాళ్లను మార్చి చెరువు లోపలికి ఫెన్సింగ్ వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. 2002 సంవత్సరం ఎఫ్‌టిఎల్ మ్యాప్ ఉండగా 2013గా మార్చి ఫెన్సింగ్ వేయడంలో అంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం కోర్టు స్టే ఉండగా రెవెన్యూ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ప్లాట్ల యజమానుల సహకారంతో ఎఫ్‌టిఎల్ హద్దులు మార్చి చెరువు లోపలకి ఫెన్సింగ్ వేయడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హద్దు రాళ్లు మార్చడంతో పెద్ద ఎత్తున ముడుపులు స్వీకరించినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి ఫతుల్లగూడ చెరువు అవినీతి బాగోతంపై విచారణ జరిపి చెరువును పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

టిఎన్‌జిఓ స్థలాలకు
నకిలీ రిజిస్ట్రేషన్‌లు
డాక్యుమెంట్ రైటర్ అరెస్టు
కెపిహెచ్‌బికాలనీ, మే 25: టిఎన్‌సిఓ స్థలాలకు నకిలీ రిజిస్ట్రేషన్ చేయించి మరొకరికి విక్రయిస్తున్న డాక్యుమెంట్ రైటర్‌ను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కూకట్‌పల్లి సిఐ పురుషోత్తం నిందితుడి వివరాలను తెలిపారు. విద్యానగర్‌లో నివసించే నల్లగొండ నాగప్రకాష్ డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తూ ఆ తర్వాత కొద్ది రోజులు నాంపల్లి క్రిమినల్ కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేశాడు. ఎన్‌జిఓ అధికారిగా పనిచేసిన తన తండ్రికి గతంలో ప్లాట్ ఇవ్వలేదన్న కక్షతో టిఎన్‌జిఓ స్థలాలకు నకిలీ రిజిస్ట్రేషన్ చేయించే వాడని తెలిపారు. యూసఫ్ అనే వ్యక్తి పేరుపై టిఎన్‌జిఓ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించి వాటిని ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి స్థలం అప్పగించే సమయంలో మిగతా డబ్బులు తీసుకునేవాడు.
మహేశ్వరం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నాగప్రకాష్‌పై మొత్తం ఆరు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 2016 సంవత్సరంలో టిఎన్‌జిఓ కోఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నాగప్రకాష్‌కు సహకరించిన రామ్మోహన్, కౌశిక్, రమేష్, ప్రమోద్‌రెడ్డి, విజయ్, మధుసూదన్, ధన్‌రాజ్, సూర్యనారాయణ, రఘువరన్, శ్రీనివాస్‌లను అరెస్టు చేయాల్సి ఉందని త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు.
సిఎం కెసిఆర్‌కు గుణపాఠం తప్పదు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని గ్రేటర్ హైదరాబాద్ బిజెపి నగర మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణి, కార్యదర్శి సి.మల్లారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికిచ్చింది రూ. 67వేల కోట్లు అనటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఏ రాష్ట్రంలో అయిన తిరిగే హక్కు ఉందని, అలాగే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీని బలోపేతం చేయటం ఆయన లక్ష్యమని వారు వివరించారు. కేంద్రం నుంచి బేటీ బచావో బేటీ పడావో పేరిట వస్తున్న నిధుల్ని ఇక్కడ తెలంగాణలో షాదీ ముబారక్ పేరు మీదకు మార్చి ఆ నిధులను ఉపయోగించటం లేదా? స్మార్ట్ సిటీల పేరిట కేంద్రం ఇచ్చిన నిధులు, హౌజింగ్ స్కీంక కింద ఇచ్చిన నిధులు పక్కదారి పట్టిస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలన్నింటినీ తుంగలో తొక్కిన కెసిఆర్ జాతీయ పార్టీ బిజెపిని విమర్శిస్తూ మాట్లాడటం మంచిదికాదని వారు వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రజలే కెసిఆర్‌కు తగిన గుణపాఠం నర్పుతారన్న విషయాన్ని గుర్తించి, ఇప్పటికైనా ముఖ్యమంత్రి కెసిఆర్ తీరు మార్చుకోవాలని వారు సూచించారు. హైదరాబాద్‌లోని నిధులను కేవలం నగరానికే ఖర్చు పెట్టకుండా జిహెచ్‌ఎంసి నిధులు ఆర్టీసి మళ్లించటం ద్వారా హైదరాబాద్ అభివృద్ధి కుంటు పడుతోందన్నారు. ఇక్కడ ఉన్న నిధులు, కేంద్ర నిధులు రెండింటిని అభివృద్ధికి ఉపయోగించాలే తప్ప, ఇవేమీ చేయకుండా జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన హామీ ఇంత వరకు కేవలం ఐడిహెచ్‌కాలనీకే పరిమితమైందని నేతలు వెంకట్‌రెడ్డి, వెంకరమణి విమర్శించారు.

జిహెచ్‌ఎంసి ఉద్యోగులకు హెల్త్‌స్కీం

ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం
విధి విధానాలు రూపొందించాలని సర్కారు ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 25: మహానగర పాలక సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తొంది. తెల్లవారే కల్లా నగరాన్ని ఎంతో పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం జిహెచ్‌ఎంసి ఉద్యోగులకు హెల్త్ స్కీంను అమలు చేసే అంశంపై కూడా సానుకూలంగా స్పందించింది. కార్పొరేషన్ ఉద్యోగులు ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న హెల్త్ స్కీం ప్రతిపాదన మరో అడుగు ముందుకు పడింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అమలవుతున్నా, జిహెచ్‌ఎంసి ఉద్యోగులకు మాత్రం ఆ వెసులుబాటు లేదు. అత్యవసర సమయాల్లోనూ వారు ముందుగా ఖర్చు చేసుకుని, ఆ తర్వాత ఖర్చులను క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. కానీ అన్ని ప్రభుత్వం శాఖల ఉద్యోగుల మాదిరిగా తమకు కూడా హెల్త్ స్కీంను అమలు చేయాలని కోరుతూ జూలై 31వ తేదీ 2014న అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ ద్వారా, ఆ తర్వాత 2015 ఫిబ్రవరి 28వ తేదీన ప్రస్తుత కమిషనర్ జనార్దన్ రెడ్డి ద్వారా ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనకు సర్కారు సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జిహెచ్‌ఎంసి ఉద్యోగులకు హెల్త్ స్కీంను అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను సిద్దం చేసి, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇటీవలే మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ నుంచి ఓ లేఖ కూడా జిహెచ్‌ఎంసికి అందించింది. అయితే ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు కేవలం తమ ఐడి కార్డును చూపి ఏ ఆసుపత్రిలోనా తమకు కావల్సిన వైద్య సేవలను పొందేలా జిహెచ్‌ఎంసి ఉద్యోగులకు కూడా ఈ స్కీంను రూపకల్పన చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం అమలు చేస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పరిధిలోకి జిహెచ్‌ఎంసి ఉద్యోగులను సైతం తీసుకువచ్చేందుకు వీలుగా ఆ స్కీంలో చేయాల్సిన సవరణలు, మార్పులను కూడా సూచించాలని ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్ లేఖలో అధికారులకు సూచించారు. కాగా, దాదాపు దశాబ్దపు కాలం నుంచి జిహెచ్‌ఎంసి ఉద్యోగుల హెల్త్ కార్డుల కోసం పోరాటం చేస్తున్న పలు యూనియన్లు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ఊదరిగోపాల్, నేతలు బాలనర్సింగ్‌రావు, శంకర్‌లు ఓ ప్రకటనలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.

ఉనికి కోసమే కాంగ్రెస్ ఆరాటం
* మంత్రి మహేందర్‌రెడ్డి
బాలాపూర్, మే 25: తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తప్పా ఏ పార్టీకి మనుగడ లేదని, కాంగ్రెస్ వాళ్లు తమ మనుగడ కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి విమర్శించారు. గురువారం బాలాపూర్ మండలం బడంగ్‌పేట్ నగర పంచాయతీ పరిధిలో మంత్రి మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపి కొండ విశే్వశరరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గుర్రంగూడ నుంచి నాదర్‌గూల్ వరకు బిటి రోడ్డు నిర్మాణం కోసం రూ. 5 కోట్లు, బడంగ్‌పేట్ నుంచి నాదర్‌గూల్ వరకు బిటి రోడ్డు నిర్మాణం రూ. 90 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. అదేవిధంగా బడంగ్‌పేట్‌లో నూతనంగా మార్కెట్ గోడౌన్‌ను నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు.
రోడ్ల కోసం కాంగ్రెస్ వాళ్లు ధర్నా నిర్వహిస్తే, వెంటనే ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రోడ్డును మంజూరు చేయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు తమ ఉనికి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు దాదాపు రెండు సంవత్సరాలు ఉన్నా.. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో ప్రతి ఇంటికి మంచి నీరు ఇస్తామని హమీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో రూ.50 కోట్లతో 19 మార్కెట్లను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత వందల కోట్లతో అనేక రోడ్లు వేసినట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని 1200 వందల చెరువులను రూ.400 కోట్లతో మిషన్ కాకతీయలో అధునీకరణ చేపట్టినట్లు తెలిపారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎనలేని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రైతులకు రుణాల మాఫీ చేయడంతో పాటు ఎరువుల కోసం ఎకరానికి రూ. 4వే