హైదరాబాద్

ఈదురు గాలులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, మే 27: జంటనగరాలతో పాటు రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్లు పడటంతో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులు భారీగా వీయడంతో ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయ. ప్రజలు బిక్కుబిక్కుమంటూ వర్షంలోనే ఉండిపోయారు. జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని వీరన్నపేట గ్రామానికి చెందిన రైతు శ్రీశైలంకు సంబంధించిన రెండు ఎకరాల మామిడి తోటలు కాయలు నేలరాలిపోయాయి. అదే గ్రామానికి చెందిన రైతు బాలయ్యకు చెందిన నాలుగు ఎకరాలలో మామిడి కాయలు నేలరాలిపోయాయి. వడగండ్ల వానకు మూడు ఎకరాల టమాట పంట పూర్తిగా దెబ్బతింది. బాలయ్యకు చెందిన రేకుల షెడ్‌తోపాటు సమీపంలో ఉన్న రైస్‌మిల్లు రేకులు గాలికి ఎగిరిపోయాయి. కొందుర్గు మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన యాదయ్యకు చెందిన రేకుల ఇల్లు గాలికి ఎగిరిపోయాయి. ఐదు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. రంగమ్మకు చెందిన షెడ్‌తోపాటు ప్రభుత్వ పాఠశాల వద్ద చెట్టు విరిగిపోయింది. దేవునిపల్లి గ్రామానికి చెందిన మంగ కృష్ణ, కమ్మరి నర్సింహలకు చెందిన రేకుల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు చెట్టు విరిగిపడటంతో లక్ష్మమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మహదేవ్‌పూర్ గ్రామానికి చెందిన విఠలమ్మ, తోట్ల బసమ్మలకు సంబంధించిన రేకులు ఈదురు గాలులకు ఎగిరిపోయాయి. శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షానికి రెండు మండలాల్లో సుమారు ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆకాల వర్షం కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈదురు గాలులకు ఇళ్లు నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు.