రంగారెడ్డి

సమష్టి కృషితోనే బంగారు తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఆగస్టు 15: శాంతియుత పంథాలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కలసి అభివృద్ధి చేసుకుందామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన రంగారెడ్డి జిల్లా 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 21శాతం ఆదాయం వృద్ధి రేటుతో రాష్ట్రం దేశంలో అగ్రభాగాన నిలిచిందన్నారు. నిరుపేదలకు కనీస భద్రత కల్పించాలని ఆసరా పెన్షన్లను అందిస్తున్నామని, వితంతువులు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులతోపాటు ఇటీవలనే ఒంటరి మహిళలకు జీవన భృతిని కల్పిస్తున్నామని చెప్పారు. 5,330 కోట్లను వెచ్చించి 35లక్షల 87వేల 184మందికి ఆసరా పెన్షన్లను అందిస్తున్నామని, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 51నుండి 75వేల రూపాయలకు పెంచడం జరిగిందని వివరించారు. వ్యవసాయ రంగానికి 9గంటలు పగటి పూట విద్యుత్ సరఫరా చేస్తున్నామని రాబోవు రోజుల్లో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడానికి గర్భిణీలకు వైద్యపరీక్షల కోసం 12వేలు రూపాయల ఆర్ధిక సహాయం అందించే కెసిఆర్ కిట్ పథకాన్ని అందిస్తున్నట్లు అలీ తెలిపారు. షీటీమ్ ఏర్పాటుచేసి మహిళలను వేధిస్తున్న పోకిరీలను అదుపు చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ పథకం కింద 46,500 చెరువుల్లో 20వేల చెరువులను పునరుద్ధరించామని రాబోవురోజుల్లో అన్ని పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 17వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేసిందని మహమూద్ అలీ వివరించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను తిలకించిన ఆయన లబ్దిదారులకు రుణాలను, పనిముట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందనరావు, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, జాయింట్ సిపి షానవాజ్ ఖాసిం, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ పాల్గొన్నారు.