రంగారెడ్డి

సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్: రాష్ట్ర ప్రజల అవసరాలకనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కార్యక్రమాలు అమలు చేస్తోందని రవాణా మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కవాతు మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సమకూరే సంపద రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు ఉపయోగపడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయలతో 35 సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో రుణమాఫీ పథకం కింద లక్షా 44 వేల 537 రైతుల ఖాతాల్లో రూ. 517 కోట్ల 50 లక్షలు జమ చేశామని పేర్కొన్నారు. జిల్లాలో 2017 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్‌లో 4036 క్వింటాళ్ళ సబ్సిడీ విత్తనాలను సరఫరా చేసినట్లు వివరించారు. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు రైతు హెల్ప్‌లైన్‌ను రూ.12.46 లక్షలతో ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో లక్షా 817 మందికి ఆసరా పింఛన్‌లు ఇస్తుండగా, అందులో 4280 మంది ఒంటరి మహిళలు ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున జీవనభృతి పొందుతున్నారని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన కెసిఆర్ కిట్‌లను ఇప్పటి వరకు 1060 మంది పేద మహిళలకు అందించినట్లు చెప్పారు. జిల్లాలోని 18 మండలాల్లో లక్షా 41 వేల 684 మంది మహిళలతో 14 వేల 485 పొదుపు సంఘాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 2017-18 సంవత్సరానికి ఇప్పటి వరకు 605 పొదుపు సంఘాలకు 20 కోట్ల రూపాయలు వడ్డీలేని రుణాలు అందించామని వివరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు రూ. 70.20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 46.83 లక్షల పనిదినాలను కూలీలకు కల్పించామని అన్నారు. లక్ష్యానికనుగుణంగా 58 శాతం పూర్తిచేసి రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉన్నామని అన్నారు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చిన్ననీటి వనరుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిందని, జిల్లాలో 1207 చెరువులను ఐదు సంవత్సరాల్లో పునరుద్ధరించేందుకు కార్యక్రమం రూపొందించామని.. ఇప్పటివరకు 323 చెరువుల పని ప పూర్తయిందని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా వికారాబాద్‌కు శ్రీశైలం డ్యాం ప్రధాన నీటి వనరుగా తీసుకుని 1187 కోట్ల అంచనా వ్యయంతో మూడు సెగ్మెంట్లుగా పనులు ప్రారంభించినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలకు తాగునీరందించేందుకు 2210 కిలోమీటర్ల పైపులైను కొనుగోలు చేసి 1534 కిలోమీటర్ల పైపులైను వేసేందుకు ఇప్పటి వరకు రూ. 620 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా 95 నర్సరీలలో కోటి 40 లక్షల మొక్కలు పెంచారని, జిల్లాలో అడవులను రక్షించడం కోసం 70 కిలోమీటర్ల కందకాలు తవ్వినట్లు చెప్పారు. జిల్లాలో 54 కాలనీల్లో 1960 రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి రూ. 98.78 కోట్ల రూపాయలు, కాలనీల్లో అంతర్గత రహదారులు, మురుగుకాలువల నిర్మాణానికి, మంచినీటి సరఫరాకు రూ. 18.50 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహన్‌రెడ్డి, వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు, జిల్లా కలెక్టర్ డి.దివ్య, జిల్లా ఎస్పీ టి.అన్నపూర్ణ, జెసి సురేష్ పొద్దార్, డిఆర్‌వో జి.సంధ్యారాణిలు పాల్గొన్నారు.