రంగారెడ్డి

అన్ని రాష్ట్రాలకూ ఆదర్శం తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర: మేడ్చల్ కలెక్టరేట్‌లో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ఎందరో త్యాగధనులు వారి ప్రాణాలను ఫణంగా పెట్టారని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందని, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందినప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతోకృషి చేస్తున్నారని, పేద ప్రజల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కుల వృత్తులు, చేతి వృత్తులు ప్రోత్సహించేందుకు గొర్రెల పంపిణీతో పాటు నిరాధారమైన ఒంటరి మహిళలకు ప్రతి నెల పింఛన్ అందజేస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు అమ్మఒడి, కెసిఆర్ కిట్ పథకాలను అమలు చేసి తల్లి బిడ్డ సంరక్షణకు ఉపయోగపడే వస్తువులను అందజేయటం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రభుత్వం అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేస్తూ, ప్రజల కార్యక్రమంలా నిర్వహించి, హరితహారంలో అందరూ పాలు పంచుకొని ఉద్యమంలా నిర్వహించటం హర్షించదగ్గ విషయమన్నారు. మిషన్‌భగీరథ కింద ఇప్పటికే 98 గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేస్తున్నామని, ఓఆర్‌ఆర్ లోపలి గ్రామాలకు 200 కోట్ల రూపాయలతో 2018 లోగా మంచినీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. జిల్లాలో 25,190 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు గాను ఇప్పటికే 16వేల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుండి శామీర్‌పేట్ మండలంలోని కేశవరం, లక్ష్మాపూర్, మూడిచింతలపల్లి గ్రామాల్లో వౌలిక వసతుల కల్పనకు దాదాపు 62 కోట్ల నిధులను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించటం జరిగిందన్నారు. జిల్లాలో మత్స్య సంపదను పెంపొందించేందుకు గత సంవత్సరం 41 చెరువుల్లో 13 లక్షల చేప పిల్లలను వేశామని, ఈ యేడాది కోటి 15లక్షల చేప పిల్లలను వేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో లక్షా ఒక వెయ్యి 598 మంది పింఛన్‌దార్లకు ప్రతినెల 12 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని, పేద, బడుగు వర్గాల పిల్లల అభ్యున్నతికి ఇప్పటికే 37 రెసిడెన్సియల్ స్కూల్స్ నడుస్తున్నాయని, అదనంగా ఎనిమిది మైనార్టీ, 5 బిసి, 4 ఎస్సీ రెసిడెన్సియల్ స్కూల్స్ మంజూరు చేశామన్నారు. జిల్లాలో 16 లక్షల జనాభాకు 4.82 లక్షల రేషన్ కార్డులకు 636 రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేస్తూ, అతిపెద్ద ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. స్వచ్ఛ్భారత్ స్వచ్ఛ తెలంగాణలో భాగంగా జిల్లాలోని 77 గ్రామ పంచాయతీలలో టాయిలెట్లు లేని 4,377 కుటుంబాలకు ఆరోగ్యకరమైన టాయిలెట్లు నిర్మించామన్నారు. 77 గ్రామ పంచాయతీల్లో అన్ని కుటుంబాలకు టాయిలెట్లు నిర్మించుకొని, బహిరంగ మల విసర్జన లేని గ్రామ పంచాయతీలుగా ప్రకటించుకున్నామన్నారు. ఈ సందర్బంగా స్వచ్ఛ మేడ్చల్ జల్లాగా ప్రకటిస్తూ మంత్రి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి సర్ట్ఫికెట్టు అందుకున్నారు. ముందుగా స్వాతంత్య్ర సమరయోధుడు మల్లాది కాశీవిశ్వనాధంను సన్మానించటంతో పాటు, పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందజేసిన అధికారులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, గ్రామ పంచాయతీలకు, స్వచ్ఛంద సంస్ధలకు హోంమంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందజేసారు. హరిత మిత్ర అవార్డులో భాగంగా జిల్లా అటవీశాఖ అధికారి వి.కృష్ణకు లక్ష రూపాయల నగదుతో పాటు, ప్రశంశాపత్రాన్ని, మెమెంటోను, కుత్బుల్లాపూర్ ఎంపిడివోకు, ఇన్ఫోసిస్ సంస్థకు రెండు లక్షల నగదు అవార్డుతో పాటు, ప్రశంశాపత్రాన్ని, మెమెంటోను అందజేసారు. డిపివో సురేశ్‌మోహన్, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ సుధాకర్, కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వరరెడ్డి, కలెక్టరేట్ డ్రైవర్ గోపాల్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఇనె్సంటివ్ అవార్డులను మంత్రి అందజేసారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పలు పాఠశాలల విద్యార్ధులు నిర్వహించిన మార్చ్ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు దేశ భక్తిని చాటేలా ఇచ్చిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం విద్యార్ధులకు మెమోంటోలు మంత్రి అందజేసారు. కార్యక్రమంలో ఎంపి సిహెచ్ మల్లారెడ్డి, కలెక్టర్ ఎంవి రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.