రంగారెడ్డి

అక్రమ సంబంధం అనుమానంతో సడ్డకుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, డిసెంబర్ 26: ఆటోడ్రైవర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటనలో నిందితున్ని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం అనంతపురానికి చెందిన శ్రీనివాస్ (34) లారీడ్రైవర్‌గా పనిచేస్తాడు. గాజులరామారం, రావినారాయణరెడ్డినగర్‌లో నివాసముండే హన్మంతు (35) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తాడు. శ్రీనివాస్, హన్మంతులిద్దరూ వరుసకు సడ్డకులు అవుతారు. నవంబర్ 5న రావినారాయణరెడ్డి నగర్‌కు వచ్చిన శ్రీనివాస్‌ను హన్మంతు కొట్టాడు. శ్రీనివాస్ భార్యతో హన్మంతుకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం, కొట్టాడన్న కోపంతో శ్రీనివాస్ హన్మంతును హతమార్చాలని తిరుగుతున్నాడు. ఈనెల 12న మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో హన్మంతు తన ఆటోతో షాపూర్‌నగర్ రైతుబజార్ నుండి గాజులరామారం వైపు వెళుతున్నాడు. షాపూర్ రంగా థియేటర్ సమీపంలోని డివైడర్ వద్ద హన్మంతు ఆటోను నిలిపాడు. శ్రీనివాస్ ఓ బాటిల్‌లో పెట్రోల్‌ను తీసుకుని ఆటోలో ఉన్న హన్మంతుపై చల్లి నిప్పంటించి పరారయ్యాడు. మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి వెంటనే మంటలను ఆర్పివేశారు. 70 శాతం కాలిన హన్మంతును పోలీసులు 108 అంబులెన్స్ సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంటల్లో ఆటో పూర్తిగా దగ్ధమైంది. హన్మంతు చికిత్స పొందుతూ ఈనెల 13న మరణించాడు. ఈ మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతోనే ఆటోడ్రైవర్ హన్మంతును హత్యచేశాడని పోలీసులు తెలిపారు.

జల్సాల కోసం చోరీలు
సైదాబాద్, డిసెంబర్ 26: జల్సాల కోసం చోరీల బాటపట్టిన ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన సైదాబాద్ పోలీసులు వారి నుండి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం సరూర్‌నగర్ భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన బిటెక్ విద్యార్థి షేక్ నజీర్ అహ్మద్(20), కొంపల్లిలోని జయబేరి పార్కు వద్ద నివసించే ఐటిఐ విద్యార్థి గుంటక వాసురెడ్డి(20) ఇరువురు స్నేహితులు. క్రికెట్ బెట్టింగులు, జల్సాల జీవితానికి అలువాటుపడి అందుకు అవసరమైన డబ్బుల కోసం దొంగతనాలను ఎంచుకున్నారు. ఈనెల 22న దొంగిలించిన వాహనంపై తిరుగుతున్న నజీర్ అహ్మద్‌ను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నజీర్ ఇచ్చిన వివరాలతో వాసురెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. జంట కమిషనరేట్‌ల పరిధిలో చోరీ చేసిన 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్న సైదాబాద్ క్రైం సిబ్బందిని డిసిపి అభినందించారు. సమావేశంలోఅడిషనల్ డిసిపి ఎల్‌టి చంద్రశేఖర్, ఏసిపి సుధాకర్, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, అడిషనల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.