రంగారెడ్డి

అనుమానితుల సమాచారమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, సెప్టెంబర్ 22: అనుమానితులపై వెంటనే సమాచారం ఇవ్వాలని పేట్‌బషీరాబాద్ ఎసిపి శ్రీనివాస్ రావు అన్నారు. పేట్‌బషీరాబాద్ పిఎస్‌లో ప్రచార వాహనాన్ని ఎసిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా జాగ్రత్త పడాలని, ప్రతి ఇంటికీ సెంట్రల్ లాక్ వేసుకోవాలని అన్నారు. మహిళలు బయటికి వచ్చినప్పుడు చైన్ స్నాచింగ్ జరగకుండా పైట కొంగు కప్పుకుని జాగ్రత్త పడాలని, అపార్ట్‌మెంట్ మొత్తం ప్రాంతం కవర్ అయ్యేటట్లుగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అపార్ట్‌మెంట్ అసోసియేషన్ వారికి తెలపాలని, మీ వాచ్‌మెన్‌ను తరుచుగా చుట్టూ పక్కల గమనించాలని తెలిపారు. వీక్లీ మార్కెట్‌కు వెళ్లినప్పుడు.. బస్సు ఎక్కే సమయంలో మీ విలువైన వస్తువులు (మొబైల్, పర్స్ మరియు బంగారు ఆభరణాలు) పట్ల జాగ్రత్త పడాలని అన్నారు. అపరిచితుల ఫోన్‌కాల్ వచ్చినట్లయితే స్పందించవద్దని, మీ యొక్క ఎటిఎం, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆధార్ కార్డ్‌ల సమాచారం ఇవ్వరాదని చెప్పారు. బంగారు నగలకు మెరుగు పెడతామని, వచ్చి చెప్పేవారి మాయమాటలు నమ్మరాదని, ఇంటింటికీ తిరిగే సేల్స్ బాయ్స్, అద్దె ఇళ్ల కొరకు, అడ్రెస్ కొరకు, ఎవరైనా వస్తే వారిని అనుమానించి వారి గుర్తింపు కార్డులను పరిశీలించాలని సూచించారు. అనుమానితులపై అనుమానం వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

వ్యక్తి అరెస్ట్, రిమాండ్‌

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 22: చిన్నారిని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లి విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డిసిపి పద్మజ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లా ఔరద్ తాలూకాకు చెందిన శరణప్ప అత్తాపూర్ ఎన్‌ఎం గూడలో నివసిస్తున్నాడు. అతని కుమారుడు మాస్టర్ నాగేష్ (4). నంది ముస్లాయిగూడలో చిన్నారి నాగేష్ ఈనెల 7వ తేదిన ఆడుకుంటుండగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన సుంకర గంగయ్య (29) ఎత్తుకెళ్లాడు. ఈజీ మనీ కోసం చిన్నారిని రూ. లక్షకు విక్రయించేందుకు కిడ్నాప్ చేశాడు. చిన్నారిని తీసుకొని గుంతకల్ వెళ్లగా అక్కడ పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన గంగయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా వివరాలను వెల్లడించాడు. దీంతో గంగయ్యను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు గంగయ్యను రిమాండ్‌కు తరలించారు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు డిసిపి పద్మజ అప్పగించారు.