రంగారెడ్డి

దగాకోరు రాజకీయాలకు ఖాన్ బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, సెప్టెంబర్ 22: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాడిన యోధులు, ఉద్యమ నాయకులు తమ ప్రాణాలను అర్పిస్తే, అమరుల కుటుంబాలకు టిఆర్‌ఎస్ పాలనలో చుక్కెదురవుతుందని జిల్లా టిజెఎసి చైర్మన్ ఎస్.సోమశేఖర్ పేర్కొన్నారు. మైనారిటీ నాయకుడు ఆయుబ్ ఖాన్.. టిఆర్‌ఎస్ పాలకుల దగాకోరు రాజకీయాలకు బలి కావడం శోచనీయమని వాపోయారు. తెలంగాణ ఉద్యమంలో పోలీసుల లాఠీ దెబ్బలకు, కేసులను ఎదుర్కొన్న ఆయుబ్ ఖాన్‌కు నిరాదరణకు గురయ్యారని చెప్పారు. అయుబ్ ఖాన్ మృతికి సంతాప సూచికంగా శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సంతాప సభ నిర్వహించారు. సభలో తాండూరు ప్రాంత ఉద్యమకారులు వెంకటేష్ చారి, గోపాల్, ప్రశాంత్, భానుప్రసాద్, జిలానీ, శ్రీనివాస్, సంజీవ్, సుదర్శన్, రాజు పాల్గొని అయుబ్ ఖాన్ మృతికి సంతాపం ప్రకటించారు. సంతాప సభలో కాంగ్రెస్, టిడిపి, బిజెపి, సిపిఐ, సిపిఎం నాయకులు బి.సునీతా సంపత్, పి.లక్ష్మారెడ్డి, ఎం.నరేష్ మహారాజ్, ఎం.రాకేష్, ప్రభాకర్ గౌడ్, ఎస్.సుశీల్ కుమార్ రాజూ గౌడ్, సుమిత్ గౌడ్, రవీందర్ రెడ్డి, ప్యాట బాల్‌రెడ్డి, నాగారం నర్సింలు, పాండూ, బొప్పి సురేష్, బి.జనార్దన్ రెడ్డి, విజయలక్ష్మీ పండిట్, సుదర్శన్, వెంకటయ్య, శంకర్, శ్రీనివాస్ పాల్గొని ఆయుబ్ ఖాన్ మృతికి తమ సంతాపం తెలిపారు.