రంగారెడ్డి

పరిపూర్ణానందను దూషించాడని ఐలయ్యపై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, సెప్టెంబర్ 23: పరిపూర్ణనంద స్వామిని అసభ్య పదజాలంతో దూషించిన ప్రొఫెసర్ కంచి ఐలయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ నేరేడ్‌మెట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి శనివారం నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేరేడ్‌మెట్ సిఐ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఓ టివి చానల్‌లో జరిగిన చర్చ కార్యక్రమంలో ఐలయ్య పరిపూర్ణనంద స్వామిని అసభ్య పదజాలంతో దూషించాడని, హిందూ సమాజాన్ని అవమానించేవిధంగా మాట్లాడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. కంచి ఐలయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దాసన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు సిఐ తెలిపారు. కేసు విచారించి తగిన చర్యలు తీసుకుంటామని సిఐ పేర్కొన్నారు.
అతివేగానికి నిండు ప్రాణం బలి
కులకచర్ల, సెప్టెంబర్ 23. కారు నడుపుతున్న వ్యక్తి అతివేగం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. వివరాల్లోకి వెళ్తే.. కులకచర్ల మండలం పీరంపల్లెకు చెందిన కిందింటి రామయ్య తన ద్విచక్రవాహనం మీద పొలానికి వెళుతుండగా పరిగి వైపు నుంచి టిఎస్ 34 ఇసి4744 నంబరు గల కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వేగం నియంత్రించలేని కారు డ్రైవర్ బలంగా ద్విచక్రదారున్ని ఢీకొన్నాడు. శనవారం ఉదయం జరిగిన సంఘటన తెలిసిన వెంటనే కులకచర్ల పోలీసులు వచ్చి పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసుకున్నారు. కారు డ్రైవర్ పేరును కేసులో ఇంకా నమోదు చేయలేదు. ఎవరు నడుపుతున్నారో తెలియని కారణంగా పేరు పేర్కొనలేదని కులకచర్ల ఎస్ ఐ చంద్రకాంత్ తెలిపారు. రేపటిలోగా డ్రైవర్ ఆచూకీ తెలుసుకుని ఆయనపై కేసు నమోదు చేస్తామన్నారు. మృతుని ఇరువురు కుమారులు కూడా గతంలో ఒకరు విద్యుత్ షాక్‌తో మృతి చెందగా, మరొకరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా ముగ్గురు కూతుళ్లున్నారు.
ఫిట్స్‌తో వ్యక్తి మృతి
జీడిమెట్ల, సెప్టెంబర్ 23: ఫిట్స్ వ్యాధితో కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కర్నూల్ జిల్లాకు చెందిన కురుంగుల బాల బబులే (35) బహద్దూర్‌పల్లి గ్రామం, ఇందిరమ్మ కాలనీలో నివాసముంటాడు. కాజిపల్లిలోని మైలాన్ పరిశ్రమలో పనిచేస్తాడు. శనివారం ఉదయం ఉద్యోగానికని వెళ్లిన బబులే బహద్దూర్‌పల్లి స్వీట్ హోమ్ సమీపంలో కింద పడి మృతి చెందాడు. ఫిట్స్ వ్యాధి వచ్చి కింద పడి చనిపోయాడని పోలీసులు, కుటుంబ సభ్యులు బావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కస్టడీ నుంచి నిందితుడు పరార్?
ఉప్పల్, సెప్టెంబర్ 23: ఉప్పల్ పోలీసు స్టేషన్ నుంచి బిహార్‌కు చెందిన అభినయ్ అనే యువకుడు పరార్ అయినట్లు తెలిసింది. అమ్మాయిలను వేధిస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 17న అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అదే రోజు పోలీసుల కళ్లుగప్పి వెనుక గోడ దూకి పారిపోయినట్లు సమాచారం. ఇతని ఆచకీ కోసం బిహార్‌కు వెళ్లిన పోలీసులు నిందితుడి జాడ దొరకకపోవడంతో తిరిగి వచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై రాచకొండ కమిషనర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది.