రంగారెడ్డి

ఇంటి తాళలు పగలగొట్టి చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, డిసెంబర్ 28: కూకట్‌పల్లిలో దొంగలు రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం కెపిహెచ్‌బికాలనీ 9వ ఫేజ్ ఎమ్‌ఐజి 59 ఇంట్లో యజమాని లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఆరు లక్షల విలువ గల సొత్తును అపహరించిన సంఘటన మరవకముందే తాజాగా ఇదే తరహాలో మరో సంఘటన చోటు చేసుకుంది. కెపిహెచ్‌బికాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టలో తాళాలు పగలగొట్టి 16 తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. ఇటీవలి కాలంలో పోలీసుల గస్తీతో పాటు పర్యవేక్షణ కొరవడంతో కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు అనేకం చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని అడ్డగుట్టలో రూపా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్ 401లో జీవన్‌రెడ్డి, సంధ్య దంపతులు నివాసముంటున్నారు. జీవన్‌రెడ్డి ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా వారం రోజుల క్రితం తమ సొంత ఊరు మంచిర్యాలకు ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. తిరిగి అడ్డగుట్టలోని నివాసానికి చేరుకోగా ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని చంద్రహారం, పచ్చల హారం మొత్తం 16 తులాల విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకొని పారిపోయారు. బీరువాలో రెండు లాకర్స్ ఉండగా ఒక దానిలోని 16 తులాలను మాత్రమే దొంగలించారు. రెండవ లాకర్‌లో ఉన్న బంగారు ఆభరణాలు పదిలంగా ఉన్నట్లు బాధితులు తెలిపారు. దొంగలు ఇంట్లో ల్యాప్‌టాప్ వంటి విలువైన వస్తువులు ఉన్నప్పటికి వాటి జోలికి వెళ్లకుండా బంగారు ఆభరణాలను దొంగలించుకొని పరారయ్యారు. బాధితుల సమాచారం మేరకు డిఐ విజయ్ సంఘటన ప్రాంతానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకొని సాక్షాధారాలను సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.