రంగారెడ్డి

అటవీ సంపదను కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, అక్టోబర్ 12: అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రజత్‌కుమార్ అన్నారు. గురువారం అనంతగిరి పర్యాటక కేంద్ర అభివృద్ధి, ఆయుష్ ఆసుపత్రి, అటవీ ప్రాంత అభివృద్ధి తదితర అంశాలపై చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సిద్దానంద కుక్కిరేటి, టూరిజం ఎండి క్రిస్టీనా, ఔషధ మొక్కల బోర్డు సంచాలకులు సోనిబాల, జిల్లా కలెక్టర్ దివ్యలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ సంపద దేవుడిచ్చిన వరమని దీన్ని కాపాడుకుంటే ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతగిరి అటవీ ప్రాంతం ప్రకృతి సిద్దంగా ఉందని, ఇందులో ఔషధ మొక్కలతో కూడిన చెట్లు అధికంగా ఉండటం మూలాన ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అనంతగిరి రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నందున పర్యాటకులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. అంతే కాకుండా రైల్వే జంక్షన్, విమానాశ్రయం సైతం దగ్గరలో ఉండడం సైతం అదృష్టమని పేర్కొన్నారు. పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించే ఈప్రాంతంలో హరిత రిసార్ట్స్ సైతం ఉండటం మంచి పరిణామమని అన్నారు. అటవీ ప్రాంతంలో ఎటువంటి అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సైతం మనపై ఉందని వివరించారు. ఈ అటవీ ప్రాంతం పూర్తిగా రిజర్వు ఫారెస్ట్ కాబట్టి దీన్ని ఎంతో అభివృద్ధి చేసేందుకు అవకాశముందని తెలిపారు. 2018-19 సంవత్సరంలో అవసరమైన నిధులను కేటాయించి పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. అటవీ ప్రాంతంలో చెత్తచెదారం వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంత అభివృద్ధికి 15 రోజులు లేదా నెలకోసారి సమీక్షలు నిర్వహించాలని అన్నారు. అనంతగిరి అటవీ ప్రాంత పరిసరాలపై జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు తెలియజేశారు. ఈసందర్భంగా రాష్ట్ర జంతువైన జింక ప్రతిమను అనంతగిరి కూడలిలో ఆవిష్కరించారు. సమీక్షలో జిల్లా అటవీశాఖ అధికారి శ్రీలక్ష్మి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీకాంత్‌రావు, భూకొలతల శాఖ ఎడి సదాశివుడు, అర్‌అండ్‌బి ఇఇ బికె ప్రతాప్, అనంతగిరి దేవాలయ కార్యనిర్వహణాధికారి జి.శేఖర్‌గౌడ్‌లున్నారు.