రంగారెడ్డి

హామీల అమలులో సర్కార్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 17: ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కెసిఆర్ సర్కార్ విఫలమైందని సిపిఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి కోమటి రవి విమర్శించారు. మహాజన పాదయాత్ర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రామంతాపూర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎవ్వరూ సాహసం చేయని.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం ‘మహాజన పాదయాత్ర’ అని అభివర్ణించారు. తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో తొమ్మిది మంది బృందం 4250 కిలోమీటర్ల మేర ఐదు నెలలు మూడు రోజుల పాటు 17వందల గ్రామాలు తిరుగుతూ ప్రజల సమస్యలను వెలికి తీస్తూ చేసిన పాదయాత్ర నేటికీ ఏడాది పూర్తయిందని అన్నారు. పాదయాత్రలో బయటపడ్డ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లినా స్పందించకపోవడం విచారకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా మాయమాటలు చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాందోళన చేపట్టగలమని హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం రామంతాపూర్ కార్యదర్శి ఎర్రం శ్రీనివాస్, నేతలు ఎండి.గౌస్, భీష్మాచారి, నామాల శ్రీనివాస్, కృష్ణ, రాజు, యాదగిరి, రవి పాల్గొన్నారు.

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన వైద్య విద్యార్థులపై కేసు
మేడ్చల్, అక్టోబర్ 17: మద్యం మత్తులో వీరంగం సృష్టించి మెడిసిటి మెడికల్ కళాశాలకు చెందిన వైద్య విద్యార్థులపై ఎట్టకేలకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం మండలంలోని ఘణపూర్ గ్రామంలోని మెడిసిటి మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థులు తప్ప తాగి మేడ్చల్ - శామీర్‌పేట్ రోడ్డుతో పాటు మేడ్చల్ పిఎస్ వద్ద హంగామా సృష్టించినా విషయం తెలిసిందే.
పూడూరు గ్రామంలోని బిఎన్‌ఆర్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్‌పై దాడి చేయడంతో పాటు ప్రిన్సిపాల్‌పై చేయి చేసుకోవడంతతో పాటు దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా వ్యక్తులను దుర్భషలాడారు. అడ్డుకున్న స్థానికులపై ఇష్టానుసారంగా ప్రవర్తించారు. దీంతో పాఠశాల డ్రైవర్‌తో పాటు నిర్వాహకులు, స్థానికులు, విలేఖరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనకు కారణమైన ఎనిమిది మంది వైద్య విద్యార్థులపై మంగళవారం మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోమటి రెడ్డి, సాయితేజ, పర్వతాశ్రేయాస్ రెడ్డి, హ్యరిస్ భజం, గూడూరు నిశంత్‌హరి, గుగ్గిల్ల గిరిధర్, కందుకూరి రవితేజ, గొట్టిముక్కల సాయి ప్రణయ్, కె.నవీన్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదైన వైద్య విద్యార్థులంతా ఎంబిబిఎస్ 4వ సంవత్సరం హౌస్‌సర్జన్‌లుగా ఘణపూర్ గ్రామ పరిధిలోని మెడిసిటి మెడికల్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరంతా రాజకీయ పలుకుబడి ఉన్న ఉన్నత కుటుంబాలకు చెందిన వైద్య విద్యార్థులు కావడంతో ఎన్నో విధాలుగా ఓత్తిళ్లు వచ్చినప్పటికీ.. ఓత్తిళ్లకు లొంగకుండా కేసు నమోదు చేసిన వ