రంగారెడ్డి

వౌలిక సదుపాయాలకు సర్కార్ పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, అక్టోబర్ 17: రాష్ట్రంలో వౌలిక సదుపాయాల కల్పనకు టిఆర్‌ఎస్ సర్కార్ పెద్దపీట వేస్తోందని, రాష్ట్రం అన్ని విధాలుగా సుభిక్షంగా ఉండాలనేదే ప్రభుత్వ ధ్యేయమని మల్కాజిగిరి ఎంపి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్‌తో పాటు మండలంలోని యాడారం, రావల్‌కోల్, పూడూరు గ్రామాల్లో మంగళవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎంపి, ఎమ్మెల్యే ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. ఎంపి మాట్లాడుతూ వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గ్రామాల్లో ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. సిసి రోడ్లు, అంతర్గత డ్రైనేజీ, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, సకల సౌకర్యాలతో శ్మశానవాటిక, గ్రామ పరిశుభ్రత పరిరక్షణకు డంపింగ్‌యార్డుల నిర్మాణాల కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాకత్మకంగా అందజేస్తున్న సామాజిక భద్రత పింఛన్‌లతో పాటు ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసర లభించిందని పేర్కొన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి తనవంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్లలోనే కనివిని ఎరుగని రితీలో రాష్ట్రంలో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఒకవైపు సంక్షేమం మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతుందని వివరించారు. గ్రామాల అభివృద్ధిపై కూడా ప్రధాన దృష్టి సారించిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల అమలుతో పాటు అన్ని గ్రామాలకు ప్రధాన రోడ్లు, గ్రామ పంచాయతీలకు భవనాలను నిర్మిస్తుందని చెప్పారు.
నిధులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆభయమిచ్చారు. పట్టణంలోని రాఘవేంద్రనగర్‌లో రూ.25లక్షలతో నిర్మించనున్న అంతర్గత మురుగు కాలువల నిర్మాణానికి, పాత గ్రామ పంచాయతీ భవనం, ముకుంద్ సినిమా హాల్ పక్క నుండి సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో 62 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని పూడూరు గ్రామంలో రూ.24 లక్షలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించగా, ఆదర్శరైతు సేవా సహకార సంఘం ఆవరణలో రూ.45 లక్షలతో నిర్మించనున్న గిడ్డంగికి శంకుస్థాపన చేశారు. స్థానిక చెరువులో చేపలను వదిలారు. ప్రభుత్వం నుండి నిధులు రాకపోయినా, ఎంపి, ఎమ్మెల్యే నిధుల నుండి కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
రావల్‌కోల్‌లో సమస్యల ఏకరువు
రావల్‌కోల్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో స్థానికులు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. స్పదించిన ఎంపి, ఎమ్మెల్యే.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఎస్సీ శ్మశానవాటిక అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హమీ ఇచ్చారు. రావల్‌కోల్ గ్రామానికి వంద డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. గ్రామంలో రూ.25లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, ఆరు లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. ఎంపిపి విజయలక్ష్మి, జడ్పీటిసి శైలజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, వైస్ ఎంపిపి లింగోళ్ల భవాని, రావల్‌కోల్ సర్పంచ్ దుందిగల్ల ప్రమీలారెడ్డి, పూడూరు సర్పంచ్ కోల స్రవంతి, సుగుణ, పిఎసిఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఎంపిటిసి అమరం మోహన్‌రెడ్డి, నాయకులు నందారెడ్డి, ఎం. శ్రీనివాస్‌రెడ్డి, విష్ణుచారి, వీర్లపల్లి భాగ్యరెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, రాములు యాదవ్, వెంకటేశ్, మల్లెల కృష్ణ, మోహన్‌రెడ్డి, మోనార్క్, మల్లేశ్, నాగరాజు ముదిరాజ్, తహశీల్దార్ విష్ణువర్దన్ రెడ్డి, ఎంపిడివో దేవసహాయం పాల్గొన్నారు.